తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Easy Weight Loss Tips : సులువుగా బరువు తగ్గాలనుకుంటే.. వీటిని తినండి..

Easy Weight Loss Tips : సులువుగా బరువు తగ్గాలనుకుంటే.. వీటిని తినండి..

21 June 2022, 14:21 IST

google News
    • ఎండుద్రాక్ష బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ విషయం ఎక్కువమందికి తెలియదు. కానీ దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు దీనిని మానరు. వీటిని తినడానికి ఓ ప్రత్యేకమైన పద్ధతి కూడా ఉంది. పైగా మహిళలకు ఎండు ద్రాక్ష చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
ఎండు ద్రాక్షలతో ఉపయోగాలు
ఎండు ద్రాక్షలతో ఉపయోగాలు

ఎండు ద్రాక్షలతో ఉపయోగాలు

Weight loss Tips: సులువుగా బరువు తగ్గాలి అనుకునేవారికి ఎండుద్రాక్షలు బాగా ఉపయోగపడతాయి అంటున్నారు నిపుణులు. కానీ వీటిని తినడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎండుద్రాక్ష బరువు తగ్గడం నుంచి ఎముకలను బలోపేతం చేయడం వరకు అనేక విధాలుగా సహాయపడుతుంది. అయితే ఎండుద్రాక్షను నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు నియంత్రణ

బరువు తగ్గాలని చాలామంది కోరుకుంటారు. కానీ బరువు తగ్గడం వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో ఉన్నప్పుడు ఎండుద్రాక్షలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు.  ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి ఇతర స్వీట్లను తినాలనే కోరికను తగ్గిస్తాయి. నానబెట్టిన ఎండుద్రాక్ష రక్తంలో చక్కెరను సరిగ్గా ఉంచుతుంది. అదనపు కేలరీలను బర్న్ చేయదు. కాబట్టి ఇది బరువును సరిగ్గా ఉంచుతుంది. దీనిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి వీటిని చిరుతిండిగా తింటే ఆకలి తగ్గుతుంది.

రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది

నానబెట్టిన ఎండుద్రాక్షలో విటమిన్లు బి, సి పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు మీ రోగనిరోధక వ్యవస్థకు చాలా అవసరం. నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల అనేక ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు. 

జీర్ణశక్తి మెరుగుదల

ఎండుద్రాక్షలో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. అలాగే జీర్ణశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

కళ్లకు మంచిది

నానబెట్టిన ఎండుద్రాక్షలో పాలీఫెనాల్ ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి మీ కంటి కండరాలకు మేలు చేస్తాయి. ఎండుద్రాక్షను క్రమం తప్పకుండా నానబెట్టడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

కాలేయానికి మేలు 

మీరు ఆల్కహాల్ తాగితుంటే.. తప్పనిసరిగా నానబెట్టిన ఎండుద్రాక్షను మీ ఆహారంలో చేర్చుకోవాలి. నానబెట్టిన ఎండుద్రాక్ష,  ఎండుద్రాక్ష నీరు కాలేయానికి మంచివి. వాటిలో బయోఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి కాలేయాన్ని నిర్విషీకరణ చేసి రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

ఎముకలకు మంచిది

మహిళలు ఎండుద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఎముకల సాంద్రత తగ్గడం చాలా మంది మహిళలకు పెద్ద సమస్య. 30 ఏళ్లు దాటిన తర్వాత.. ముఖ్యంగా మహిళలు నానబెట్టిన ఎండుద్రాక్షను ప్రతిరోజూ తినాలి. ఇందులో రాగి ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. రక్తహీనతతో బాధపడేవారు రోజూ ఎండుద్రాక్ష తినాలి.

 

తదుపరి వ్యాసం