తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vivo Y30 5g | బడ్జెట్ ధరలో మరొక 5g స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్లు ఇలా ఉన్నాయి!

Vivo Y30 5G | బడ్జెట్ ధరలో మరొక 5G స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్లు ఇలా ఉన్నాయి!

HT Telugu Desk HT Telugu

24 July 2022, 15:08 IST

    • వివో నుంచి మరొక సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ Vivo Y30 విడుదల అయింది. దీని ధర, ఇతర విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.
Vivo Y30
Vivo Y30

Vivo Y30

మొబైల్ తయారీదారు వివో తమ Y-సిరీస్‌లో మరొక సరికొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y30ను విడుదల చేసింది. ఇది బడ్జెట్ ధరలోనే లభించే 5G స్మార్ట్‌ఫోన్‌. అయితే దీని లుక్, వెనుకవైపు కెమెరా మాడ్యూల్ డిజైన్ పరిశీలిస్తే ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన Vivo T1 స్మార్ట్‌ఫోన్ ను పోలి ఉంది. వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్ 2MP మాక్రో కెమెరాతో పాటు f/1.8 ఎపర్చర్‌తో 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. Y30 5G సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

Vivo Y30 స్పెసిఫికేషన్ల పరంగా, Y30 5G మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoCని ప్యాక్ చేస్తుంది. చిప్‌సెట్ 6GB RAMతో వస్తుండగా, అదనంగా 2GB ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది స్టోరేజ్ విస్తరణ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్‌తో కూడా వస్తుంది. ఈ ఫోన్ స్టార్‌లైట్ బ్లాక్, రెయిన్‌బో అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇంకా Vivo Y30లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు అన్ని వివరాలు ఈ కింద చూడండి.

Vivo Y30 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.51 అంగుళాల LCD HD+ డిస్‌ప్లే
  • 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+2MP కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్

కనెక్టివిటీ పరంగా చూస్తే Vivo Y30 5Gలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, AI ఫేస్ అన్‌లాక్ సపోర్ట్‌, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్-సిమ్, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.1, ఉన్నాయి.

ప్రస్తుతం థాయ్ లాండ్ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అక్కడ దీని ధర THB 8,699. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.18,950/- . ఈ ఫోన్ త్వరలో ఇండియాలోనూ విడుదలయ్యే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం