Valentine's day 2024: వాలెంటైన్స్ డేకి అక్కడ ప్రేమ చెంచాలే బహుమతులు, ప్రేమికుల రోజున వింతైన ఆచారాలు ఇవే
04 February 2024, 10:57 IST
- valentine's day 2024: వాలెంటైన్స్ డే వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేమ వేడుక మొదలైపోతుంది. ముఖ్యంగా ఏం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవాలో ప్రేమికులు ఆలోచిస్తూ ఉంటారు. అయితే వాలెంటెన్స్ డే రోజు కొన్ని రకాల వింత ఆచారాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
వాలెంటైన్స్ డే గిఫ్టు ‘ప్రేమ చెంచా’
valentine's day 2024: వాలెంటైన్స్ డే రోజు ప్రపంచంలోని అందరూ ఒకేలా తమ ప్రేమను వ్యక్తపరచరు. అలాగే వాలెంటైన్స్ డే రోజు ప్రేమికులంతా ఎంజాయ్ చేయాలని. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవాలని లేదు. కొన్నిచోట్ల కొన్ని వింత ఆచారాలు వాడుకలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాలెంటెన్స్ డే సంప్రదాయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్నిచోట్ల వాలెంటైన్స్ డే రోజు కొన్ని వింత పనులు చేస్తూ ఉంటారు. అవి కాస్త ఆసక్తికరంగానే ఉంటాయి.
1. ఫిబ్రవరి 14 వచ్చిందంటే జపాన్లోని పురుషులకు పండగే. ఎందుకంటే ఆ రోజున మహిళలు, పురుషులకు చాక్లెట్లను పంచుతారు. తమ ప్రేమను వ్యక్తం పరచడానికి వారు ఇలా చాక్లెట్లు పంచుతారు. ఖరీదైన చాక్లెట్లను మాత్రం ఇవ్వరు. చవకైన చాక్లెట్ రకాలను కొని అందిస్తారు. మార్చి 14న పురుషులు, మహిళలకు తిరిగి చాక్లెట్లను ఇస్తారు.
2. దక్షిణ కొరియాలో ఒక వింత ఆచారం ఉంది. వాలెంటైన్స్ డే రోజు ప్రేమికులు లేని ఒంటరి వారు బ్లాక్ నూడుల్స్ తింటారు. బ్లాక్ నూడుల్స్ తినడం ద్వారా వాలెంటైన్స్ డే రోజు తమ ఒంటరితనానికి సంతాపాన్ని పలుకుతారు.
3. వేల్స్ లో ప్రేమ స్పూన్లు లభిస్తాయి. వాలెంటైన్స్ డే రోజు ఈ ప్రేమ స్పూన్లు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. స్త్రీల కోసం ఈ స్పూను ప్రత్యేకంగా చెక్కతో చెక్కిస్తారు. పురుషులు ఎక్కువగా ఈ స్పూన్లను తమ ప్రేమకు చిహ్నంగా స్త్రీలకు అందిస్తారు.
4. జర్మనీలో పందులను అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. వాలెంటైన్స్ డే గ్రీటింగ్ కార్డులలో కచ్చితంగా పందులు ఉంటాయి. జర్మన్లకు పంది మాంసం అంటే చాలా ఇష్టం. ప్రేమికుల రోజున పందులను ఇచ్చిపుచ్చుకునే వారు కూడా ఉన్నారు.
5. థాయిలాండ్ లోని ప్రేమికులు వాలెంటైన్స్ డే రోజు పర్వతారోహణ చేస్తారు. తాడులు పట్టుకొని పర్వతాలు ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా వివాహం చేసుకున్న జంటలు ఇలా చేస్తాయి.
6. ఆఫ్రికాలోని మహిళలు తమ ప్రేమను ఒక కాగితంపై రాసి తాము ఇష్టపడే అబ్బాయిల చొక్కాలకు పిన్నుతో తగిలిస్తారు. ఈ పని వారు వాలెంటైన్స్ డే రోజే చేస్తారు.
7. ఫిలిప్పీన్స్ లో వాలెంటైన్స్ డే రోజు ఎక్కువ మంది వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడతారు. ప్రతి ఏడాది ప్రేమికుల రోజునే ఫిలిప్పీన్స్ లో సామూహిక వివాహాలు అత్యధికంగా జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే ఆ రోజున వివాహ వేదికలు దొరక్క ఎంతోమంది ఇబ్బంది పెడతారు. అంతా పోటీ ఉంటుంది వాలెంటైన్స్ డే రోజున.
వాలెంటైన్స్ డే వస్తే కార్డులు, పూలు, చాక్లెట్లు అధికంగా అమ్ముడవుతాయి. ప్రపంచంలో వాలెంటైన్స్ డే చేసే వ్యాపారం ఇంతా అంతకాదు. పాశ్చాత్యదేశాల్లో దీన్ని సంబరంగా నిర్వహించుకుంటారు. మనదేశంలోనూ నిర్వహిస్తున్నా కొన్ని సమూహాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆరోజున నల్లజెండాలు పట్టుకుని పరేడ్ చేయడం వంటివి చేస్తారు. ప్రపంచంలో వాలెంటైన్స్ డే బహుమతుల కోసం సింగపూర్, చైనీస్, దక్షిణ కొరియన్లు అధికంగా ఖర్చు చేస్తారు. ఆ తరువాత తూర్పు ఆసియాలో ఉన్న దేశాల వారు ఖర్చుపెడతారు.