Valentine's week full list 2023: ఫిబ్రవరి 7 నుంచే వాలెంటైన్ వీక్.. ఏ రోజు ఏంటి?
07 February 2023, 9:54 IST
- Valentine's week full list 2023: రోజులు మారాయి. ఏ చిన్న రోజు వచ్చినా.. వాట్సాప్ స్టేటస్ లోకి విషయం ఎక్కుతోంది. మరి అసలే రాబోయేది.. వాలెంటైన్స్ డే. మరి ఫిబ్రవరి 14 కంటే ముందు ఉన్న రోజులు ఏంటో తెలుసుకోవాలి కదా? వాలెంటైన్ వీక్ వివరాలు మీకోసం…
వాలెంటైన్ వీక్ 2023
Valentine's week full list: ప్రేమ నెల వచ్చింది. ప్రేమికులు తెగ ప్లాన్స్ చేసుకుంటున్నారు. ప్రేమించిన వ్యక్తితో ఎక్కడికి వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేయాలని గూగుల్ సెర్చ్ కొడుతున్నారు. అయితే వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14 కంటే ముందే కొన్ని రోజులు మెుదలవుతాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలి కదా. మీ ప్రియమైన వారికి ఏ రోజున ఏం ఇవ్వాలో.. ఏ రోజు ఏంటో చెప్పేందుకు కాస్త ఇన్ఫర్మేషన్ ఉండాలి. ప్రేమికుల రోజు(Lovers Day)కు వారం ముందు నుంచే ప్రతి రోజూ ఓ స్పెషాలిటీగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో యువత వీటిని ఎక్కువగానే ఫాలో అవుతున్నారు. వాలెంటైన్స్ వీక్ 2023.. ముఖ్యమైన తేదీల పూర్తి జాబితా ఇక్కడ ఉంది.
ఫిబ్రవరి 7 : రోజ్ డే
వాలెంటైన్స్ వీక్ రోజ్ డేతో ప్రారంభమవుతుంది. మీ ప్రేమను చెప్పడానికి.. లేదా ముఖ్యమైన వారికి మీ మనసులోని విషయం అర్థమయ్యేందుకు.. ఓ పువ్వు ఇచ్చి సంకేతం పంపొచ్చు.
ఫిబ్రవరి 8 : ప్రపోజ్ డే
ఈ రోజు మీ ప్రియమైన వ్యక్తికి ప్రపోజ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీరు లవ్ చేసే వ్యక్తిని విందు లేదా ప్రత్యేక విహారయాత్రకు తీసుకెళ్లొచ్చు. ప్రపోజ్ విషయంపై చర్చించొచ్చు.
ఫిబ్రవరి 9 : చాక్లెట్ డే
ఈ రోజు చాక్లెట్లను బహుమతిగా ఇవ్వొచ్చు. మీ బంధాన్ని బలోపేతం చేయడానికి, ఈ రోజున మీ ముఖ్యమైన వ్యక్తికి చాక్లెట్ బాక్స్‌ను బహుమతిగా ఇవ్వండి.
ఫిబ్రవరి 10 : టెడ్డీ డే
ఈ రోజున జంటలు ఒకరికొకరు టెడ్డీని బహుమతిగా ఇవ్వడం ద్వారా తమ ప్రేమను చూపించుకుంటారు. టెడ్డీని బహుమతిగా ఇవ్వడం ఆనందాన్ని సూచిస్తుంది. మీ లవ్ ను గుర్తుచేసుకుంటూ.. టెడ్డీని ముద్దుగా చూసుకోండి.
ఫిబ్రవరి 11 : ప్రామిస్ డే
లవర్స్ మధ్య వాగ్దానాలు కూడా ఉండాలి కదా మరి. మీ జీవితాన్ని పంచుకోవాలనుకునే వారికి నమ్మకాన్ని కలిగిస్తూ ఈ రోజున ప్రామిస్ చేయాలి. జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నారో.. ఇద్దరూ మాట్లాడుకోవచ్చు. మీరిచ్చే ప్రామిస్.. జీవితాంతం గుర్తుండేలా చూసుకోండి.
ఫిబ్రవరి 12 : హగ్ డే
కౌగిలికి మించిన మరో అనుభూతి ఇంకేం ఉంటుంది. మీ ప్రేమను వెచ్చని కౌగిలి ద్వారా ఈ రోజున వ్యక్తపరుచుకుంటారు. ప్రియమైన వారిని కౌగిలించుకుంటే.. సమస్యలను మర్చిపోయేలా అవుతాయి. ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నారో తెలిపేలా హగ్ ఇవ్వండి.
ఫిబ్రవరి 13 : కిస్ డే
తమ ప్రేమను ముద్దు ద్వారా ప్రేమికులు ఈ రోజున వ్యక్తపరుస్తారు. ఈ రోజు చాలా జంటలు ముద్దు పెట్టుకోవడం ఓ ప్రత్యేకతగా అనుకుంటారు. ముద్దు ప్రేమ స్వచ్ఛమైన రూపాలలో ఒకటి.
ఫిబ్రవరి 14 : వాలెంటైన్స్ డే
వాలెంటైన్స్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న జరుపుకొంటారు. మిగతా వారం రోజుల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా.. చాలా మంది ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. తమ ప్రియమైన వారికి బహుమతులు ఇస్తారు. కొన్ని సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తారు. ఈ రోజున జంటలు ఎక్కువగా సెలబ్రేషన్స్ లో పాల్గొంటారు.