Yuva Galam: నిరుద్యోగంతో యువత ఆందోళన.. సర్కారును సాగనంపాలన్న లోకేశ్-let us all work to dethrone this rule lokesh says at padayatra yuva galam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Yuva Galam: నిరుద్యోగంతో యువత ఆందోళన.. సర్కారును సాగనంపాలన్న లోకేశ్

Yuva Galam: నిరుద్యోగంతో యువత ఆందోళన.. సర్కారును సాగనంపాలన్న లోకేశ్

HT Telugu Desk HT Telugu
Jan 31, 2023 08:01 AM IST

Yuva Galam: ఏపీలో ఉపాధి లేక యువత వలస పోతోందని, నిరుద్యోగంతో యువత ఆందోళన చెందుతోందని, వైఎస్సారీ‌సీపీ సర్కారును సాగనంపాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.

టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేశ్ యువగళం పాదయాత్ర (HT_PRINT)

పలమనేరు: ఆంధ్రప్రదేశ్ యువత నిరుద్యోగంతో సతమతమవుతున్నారని టీడీపీ శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నాలుగో రోజు యువ గళం పాదయాత్ర సందర్భంగా యువతతో ముచ్చటించారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగావకాశాలు లేకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిలిపివేయడం వల్ల యువత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని లోకేష్ అన్నారు.

యువతను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ‘ఈ పాలనను గద్దె దించి సంక్షేమం, ప్రగతి కోసం పాటుపడే పాలనను తిరిగి తీసుకురావడానికి మనమందరం కృషి చేద్దాం.. యువ గళం ఇప్పుడు మనకు లభించిన అవకాశం, దీనిని అందరం సద్వినియోగం చేద్దాం..’ అని అన్నారు.

పలువురు నిరుద్యోగ యువకులు ఉపాధి వెతుక్కుంటూ పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని, ఇది వారి తల్లిదండ్రులకు ఆందోళన కలిగించిందని అన్నారు. కొందరు తమకు ఉపాధి అవకాశాలు లేవని లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. తమపై పోలీసు కేసులు నమోదు చేస్తున్నారని పలువురు ఆరోపించారు.

టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని, వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు.

పలమనేరులో పరిశ్రమలు వస్తాయని, వాటి ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నానని చెప్పారు.

అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా గాంధారమాకులపల్లెలో వడ్డెర సంఘంతో నారా సమావేశం నిర్వహించగా, ఆర్థికంగా, రాజకీయంగా తమకు ఎలాంటి గుర్తింపు లేదని సంఘం సభ్యులు తెలిపారు. తమ పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలస వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫెడరేషన్ నుండి తమకు ఎలాంటి నిధులు రావడం లేదని వారు పేర్కొన్నారు. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేర్చాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తమ కులంలోని విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని కోరారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వడ్డెరల సమస్యలపై అధ్యయనం చేసేందుకు సత్యపాల్ కమిటీని వేశారని, ఈ కమిటీ ఇటీవలే నివేదిక సమర్పించిందని నారా లోకేశ్ తెలిపారు.

కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. వడ్డెర సమాజం కోసం సంక్షేమ పథకాలు ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే వారి సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో పెరుగుతున్న జీవన వ్యయాలను తట్టుకోలేక కుప్పం, పలమనేరు ప్రజలు కర్ణాటకకు వలస వెళ్తున్నారని అన్నారు.

కొత్త పరిశ్రమల సంగతి పక్కన పెడితే.. చంద్రబాబు నాయుడు హయాంలో ఇక్కడ యూనిట్లు పెట్టుకున్న వ్యాపారవేత్తలు సైతం ఈ ప్రభుత్వం వేధింపులు, భారీ పన్నులు విధిస్తుండడంతో రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నారని నారా లోకేశ్ అన్నారు.

యువ‌గ‌ళం పాద‌యాత్ర 5వ రోజు (31-01-2023) మంగ‌ళ‌వారం షెడ్యూల్‌

 

ఉదయం 

8.00 కృష్ణాపురం టోల్ గేట్ విడిది కేంద్రం నుంచి పాద‌యాత్ర ప్రారంభం

10.30 క‌స్తూరి న‌గ‌రం క్రాస్ వ‌ద్ద గౌడ(త‌మిళ్‌) సామాజిక‌వ‌ర్గం వారితో స‌మావేశం

11.40 కైగ‌ల్లు గ్రామం వ‌ద్ద యాద‌వ సామాజిక‌వ‌ర్గ ప్ర‌తినిధుల‌తో భేటీ

మ‌ధ్యాహ్నం

12.30 దేవ‌దొడ్డి గ్రామంలో కురుబ‌/కురుమ సామాజిక‌వ‌ర్గం వారితో ముఖాముఖి

సాయంత్రం

4.25 బైరెడ్డిప‌ల్లె ప‌ట్ట‌ణం రాయ‌ల్ మ‌హ‌ల్ లో బీసీ క‌మ్యూనిటీ స‌మావేశం

5.15 బైరెడ్డిప‌ల్లె ప‌ట్ట‌ణంలో తెలుగుదేశం జెండా ఆవిష్క‌ర‌ణ

రాత్రి

6.55 క‌మ్మ‌న‌ప‌ల్లె స‌మీపంలోని క‌స్తూరిబా స్కూల్ విడిది కేంద్రంలో బ‌స

IPL_Entry_Point

టాపిక్