Dangerous Gas Geyser: బాత్రూంలో గ్యాస్ గీజర్లు వాడుతున్నారా? జాగ్రత్త, సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయి
24 July 2024, 17:30 IST
- Dangerous Gas Geyser: గ్యాస్ గీజర్లు ఆధునిక కాలంలో వాడకంలోకి వచ్చాయి. వీటితో కొన్ని రకాల ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
గ్యాస్ గీజర్
Dangerous Gas Geyser: ఇటీవల హైదరాబాద్‌లోని ఒక కుటుంబం మొత్తం గ్యాస్ గీజర్ వల్ల బాత్రూంలోనే మరణించారు. దీంతో గ్యాస్ గీజర్లు వాడే వారిలో ఆందోళన మొదలైంది. గ్యాస్ గీజర్ నుండి విడుదలైన విషపూరిత వాయువును పీల్చి ఆ కుటుంబమంతా మరణించినట్టు పోలీసులు కూడా తేల్చారు. గ్యాస్ గీజర్లను వాడడం కాస్త ప్రమాదంతో కూడుకున్నదే. సరైన భద్రతా నియమాలు పాటించకపోతే ఆ గ్యాస్ గీజర్ల నుండి కార్బన్ మోనాక్సైడ్ విడుదలై సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తుంది. కాబట్టి ఇంట్లో గ్యాస్ గీజర్ ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.
గ్యాస్ గీజర్ అంటే ఏమిటి?
నీటిని వేడి చేయడానికి ఈ గీజర్ LPGని ఉపయోగిస్తుంది. అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. దీనివల్ల అది మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. దీనికోసం విద్యుత్తును వినియోగించరు. దీనిలో చాలా తక్కువ మొత్తంలోనే LPGని వాడి నీటిని వేడెక్కేలా చేయవచ్చు. కాబట్టి గ్యాస్ గీజర్లు కొనేవారి సంఖ్య కూడా పెరిగింది. గ్యాస్ గీజర్లతో పోలిస్తే విద్యుత్ సహాయంతో నీటిని వేడెక్కించే గీజర్లే ఉత్తమమని చెప్పాలి.
గ్యాస్ గీజర్లు వాడేటప్పుడు కొన్ని భద్రతా ప్రమాణాలు పాటించాలి. అందరూ బాత్రూంలోనే గ్యాస్ గీజర్‌ను ఫిట్ చేయించుకుంటారు. అలా చేయడం వల్ల గీజర్ నుంచి ప్రమాదవశాత్తు విష వాయువు విడుదలైనప్పుడు కొన్ని సెకన్లలోనే ఆ బాత్రూంలో నిండిపోయి ప్రాణాలు తీసేస్తుంది. కాబట్టి మూసి ఉన్న ప్రదేశంలో గ్యాస్ గీజర్లను ఫిట్ చేయకూడదు. విషవాయువు విడుదలైనా కూడా బయటికి పోయేలా ఓపెన్ ప్లేస్ లో గ్యాస్ గీజర్‌ను ఫిట్ చేసుకోవడం మంచిది. వెంటిలేటర్లు ఎల్లప్పుడూ తెరిచే ఉంచుకోవాలి, లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఎప్పుడూ పనిచేసేలా చూసుకోవాలి. గీజర్‌ను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోవాలి. ఏవైనా లీకులు సమస్యలు ఉన్నాయేమో రెండు నెలలకు ఒకసారి అయినా గీజర్ను చూపించుకోవాలి. రోజంతా గీజర్ ను రన్నింగ్ లో ఉంచకూడదు. ఉపయోగించే ముందు, తర్వాత కాసేపు ఆపడం చాలా ముఖ్యం.
విష వాయువు ఇదే...
గ్యాస్ గీజర్ లో కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ ఎలాంటి వాసన వేయదు. కాబట్టి లీక్ అవుతున్నా కూడా దాని గురించి ఎవరికీ తెలియదు. అది పీల్చిన కొద్ది నిమిషాలకే శరీరంలో ప్రమాదకర మార్పులు జరుగుతాయి. వ్యక్తికి మైకం కమ్మడం, స్పృహ కోల్పోవడం వంటివి జరుగుతాయి. ఎక్కువ పరిమాణంలో దీన్ని పిలిస్తే ప్రాణాలు కూడా పోతాయి. కార్బన్ మోనాక్సైడ్ వల్ల మైకం కమ్మినా, స్పృహ కోల్పోయినా వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. లేకుంటే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. కాబట్టి ఇంట్లో గ్యాస్ గీజర్ ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
గ్యాస్ గీజర్ కన్నా ఎలాంటి విషవాయులు విడుదల చేయని విద్యుత్ తో నడిచే గీజర్లని ఎంపిక చేసుకోవడం ముఖ్యం మంచిది గ్యాస్ గీజర్లు ఎప్పుడు విషవాయులను విడుదల చేస్తాయో చెప్పలేము ఇప్పటికే మన దేశంలో చాలాసార్లు ఈ గ్యాస్ గీజర్ల కారణంగా ప్రమాదంలో పడిన వారి సంఖ్య అధికంగానే ఉంది గతంలో బెంగుళూరులో కూడా తల్లి ఏడేళ్ల కూతురు ఈ గ్యాస్ గీజర్ కారణంగానే మరణించారు నుంచి విడుదలైన కార్బన్ మోనాక్సైడ్ ను పీల్చి వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి రిస్క్ తీసుకోవడం కన్నా గ్యాస్ గీజర్ల వాడకాన్ని తగ్గించుకోవడమే మంచిది