తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  7 Cup Burfi: వంట రాని వాళ్లూ చేయగల 7 కప్ బర్ఫీ రెసిపీ, పండగ రోజు సింపుల్ స్వీట్

7 Cup burfi: వంట రాని వాళ్లూ చేయగల 7 కప్ బర్ఫీ రెసిపీ, పండగ రోజు సింపుల్ స్వీట్

12 October 2024, 6:30 IST

google News
  • 7 Cup burfi: ఏడు కప్పుల పదార్థాలతో చేసే సింపుల్ బర్ఫీ రెసిపీ ఇది. అసలు వంట రాని వాళ్లయినా ఈ స్వీట్ చేసేయొచ్చు. దీని తయారీ ఎలాగో చూసేయండి.

7 కప్ బర్ఫీ
7 కప్ బర్ఫీ

7 కప్ బర్ఫీ

స్వీట్స్ అంటే మీకిష్టమా? కానీ ఏ స్వీట్ చేయాలన్నా కాస్త సమయం ఓపిక కావాలి. అలాగే ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు కూడా టక్కుమని ఏ స్వీట్ చేయాలో తోచదు. అప్పుడు సులువుగా అయిపోయే ఈ 7 కప్పుల బర్ఫీని ప్రయత్నించండి. దీనికి ఆ పేరు ఎందుకంటే.. ఈ స్వీట్ తయారీకి వాడే పదార్థాలను ఒకే కప్పుతో 7 సార్లు కొలిచి వేస్తాం. మరింకే కొలతా అవసరం లేకుండా చక్కని స్వీట్ రెడీ అయిపోతుంది. దాన్నెలా చేయాలో చూడండి.

7 కప్పుల బర్ఫీకి కావాల్సిన పదార్థాలు:

1 కప్పు పాలు

1 కప్పు శనగపిండి

1 కప్పు కొబ్బరి తురుము

1 కప్పు నెయ్యి

3 కప్పుల పంచదార

చిటికెడు యాలకుల పొడి

7 కప్పుల బర్ఫీ తయారీ విధానం:

1. ముందుగా చెప్పుకున్నట్లే పైన చెప్పిన పదార్థాలన్నీ ఒకే కప్పుతో కొలుచుకోవాలి.

2. ఒక కడాయి పెట్టుకుని కొద్దిగా వేడెక్కాక 1 కప్పు నెయ్యి , 1 కప్పు పాలు, 1 కప్పు శనగపిండి, 1 కప్పు కొబ్బరి తురుము, 3 కప్పుల పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి.

3. పిండి ఉండలు కట్టకుండా చెంచాతో కలుపుతూనే ఉండాలి. పంచదార పూర్తిగా కరిగి, పిండి రంగు మారేదాకా వేయించుకోవాలి. కలియబెడుతూనే ఉండాలి.

4. కాసేపయ్యాక చిక్కగా మారి చిన్న చిన్న బుడగల్లాంటివి కనిపిస్తాయి. అంతా చిక్కగా అయిపోతుంది. అప్పుడు అన్నీ బాగా ఉడికాయని అర్థం. ఇప్పుడు కాస్త యాలకుల పొడి చల్లుకుని కలుపుకుంటే సరి. గ్యాస్ కట్టేయాలి.

5. కాస్త లోతుగా ఉన్న ట్రే తీసుకుని మొత్తం నెయ్యి రాసుకోవాలి. అందులో రెడీ చేసుకున్న పిండి మిశ్రమం పోసుకోవాలి. అరగంటయ్యాక చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే సరి. 7 కప్ బర్ఫీ రెడీ అయినట్లే.

టాపిక్

తదుపరి వ్యాసం