Ugadi Wishes 2024: ఉగాది పండుగకు బంధుమిత్రులకు ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి
09 April 2024, 8:20 IST
- Ugadi Wishes 2024: ఉగాది పండుగ తెలుగు సంవత్సరాన్ని ఆరంభించే ఒక పర్వదినం. ఉగాది పండుగ కోసం తెలుగు ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు. ఉగాది రోజు మీ బంధుమిత్రులకు తెలుగులోనే అందంగా శుభాకాంక్షలు చెప్పండి.
ఉగాది శుభాకాంక్షలు
Ugadi Wishes 2024: ప్రతి ఏడాది చైత్ర శుద్ధ ప్రాద్యమినాడు ఉగాది పండుగ నిర్వహించుకుంటారు. ఇదే రోజు బ్రహ్మ సృష్టిని నిర్మించాడని అని చెబుతారు. అలాగే శ్రీ విష్ణుమూర్తి మత్స్య అవతారం ధరించి సోమకుణ్ణి సంహరించి వేదాలను సంరక్షించాడని... ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగానే ఉగాది పండుగ నిర్వహించుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల్లో ఉగాది రోజే ఇంకా ఎన్నో అద్భుతాలు జరిగాయనే ప్రస్తావన ఉంది. మొదటి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజునే తన సింహాసనాన్ని అధిష్టించాడని అంటారు. కాబట్టే ఇది పెద్ద పండుగగా తెలుగు వారికి మారిపోయిందని చెబుతారు. ఉగాది పండుగ రోజు తెలుగు వారంతా ఆనందోత్సాహాల మధ్య దీన్ని నిర్వహించుకుంటారు. బంధుమిత్రులకు తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఇక్కడ మేము కొన్ని ఇచ్చాము. వీటిలో మీకు నచ్చిన కోట్స్ ఎంచుకొని మీ బంధుమిత్రులకు ఎస్ఎంఎస్, వాట్సాప్, సోషల్ మీడియాలో షేర్ చేయండి.
ఉగాది శుభాకాంక్షలు
1. ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసే పండుగ ఉగాది పండుగ.
మీ కుటుంబ సభ్యులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
2. ఉగాది పచ్చడిలాగే మీ జీవితం
షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
3. ఈ కొత్త సంవత్సరం
ఆనందం, శాంతి, శ్రేయస్సు, సంతృప్తిని
మీకు మీ కుటుంబ సభ్యులకు అందజేయాలని కోరుకుంటూ
కొత్త సంవత్సరంలోకి ఆహ్వానం.
శ్రీ కోధి నామ సంవత్సర శుభాకాంక్షలు.
4. శ్రీ కోధి నామ సంవత్సరం
ఆరు రుచులతో ఆరంభం
మనసుకు తెచ్చెను తరగని సంతోషం
మీకు మీ కుటుంబ సభ్యులకు
బంధుమిత్రులందరికీ
శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు.
5. తీపి చేదులతో కలిస్తేనే జీవితం
కష్టం సుఖం ఉంటేనే జీవితం
ఆ జీవితంలో ఆనందోత్సాహాలను
పంచేందుకు వచ్చేదే ఉగాది పండుగ
మీకు మీ కుటుంబ సభ్యులకు
శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు.
6. సరికొత్త ఆశలు, నిండైన నవ్వులు
ఆనందాలతో ఉగాదిని ఆహ్వానిద్దాం.
ప్రతి ఒక్కరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాధి శుభాకాంక్షలు.
7. ఉగాది ఒక సంపూర్ణమైన పండుగ.
అందులో లేనిది లేదు, అదనంగా చేర్చాల్సింది లేదు.
ఉగాది ఆనందాలకు ఆది.
శ్రీ కోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
8. గతించిన కాలాన్ని మరిచిపోవాలి.
కొత్త ఏడాదికి స్వాగతం పలకాలి.
ప్రతి ఒక్కరికి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
9. లేత మామిడి ఆకుల తోరణాలు
శ్రావ్యమైన సన్నాయి రాగాలు
అందమైన ముగ్గులతో నిండిన వాకిళ్లు
కొత్త బట్టలతో పిల్లాపాపలు
ఉగాది పండుగకు ఇవే సంబరాలు
శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
10. ఉగాది ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసే పండుగ.
గుండెల్లో ఆనంద క్షణాలు నింపే వేడుక.
కష్టసుఖాల జీవితాన్ని చవి చూడాలని చెప్పే
ఉగాది పండుగ శుభాకాంక్షలు.
11. చీకటిని పారదోల్లే ఉషోదయంలా
చిగురాకుల ఊయలలో
నవరాగాల కోయిలలా అడుగు పెడుతున్న
కొత్త ఏడాది ఉగాదికి స్వాగతం
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
12. కొత్త కలలతో, కొత్త ఆశలతో
కొత్త భావాలతో, కొత్త ఆలోచనలతో
జీవితంలో మరింత ముందుకు పోవాలని
మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ
ప్రతి ఒక్కరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
13. మధురమైన ప్రతిక్షణం నిలుస్తుంది జీవితాంతం.
రాబోతున్న ఈ కొత్త సంవత్సరం
అలాంటి క్షణాలను ఎన్నో అందించాలని ఆశిస్తున్నాం.
ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు
14. ఈ ఏడాది పొడవునా విజయం, అదృష్టం
మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
15. మామిడి పువ్వుకి కాత వచ్చింది
కోకిల గొంతుకి కూత వచ్చింది
వేప కొమ్మకి పూత వచ్చింది
పసిడి బెల్లం తోడు వచ్చింది
గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది
ఉగాది పండుగ మన ముందుకు వచ్చింది
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
16. పాత సంవత్సరపు
తీపి, చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ
కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలో
అడుగుపెడుతున్న సందర్భంగా
మీ ఆశయాలు నెరవారాలని ఆకాంక్షిస్తూ
శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
17. లేత మామిడి ఆకుల తోరణాలు
శ్రావ్యమైన కోయిల రాగాలు
అందమైన ముగ్గులు
కొత్త దుస్తులతో కలకలలాడిపోతున్న పిల్లలు
ఉగాది పండుగ సంబరాలు ఎన్నో
మీకు మీ కుటుంబ సభ్యులకు
క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
18. జీవితం సకల అనుభూతుల సంగమం
అదే ఉగాది పండుగ సందేశం
మీకు మీ కుటుంబ సభ్యులకు
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
అన్ని రాశుల వారికి ఉగాది రాశి ఫలాలు ఈ పేజీలో చూడండి.
టాపిక్