తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monsoon Soup : సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే.. వేడి వేడిగా ఈ సూప్ తాగండి

Monsoon Soup : సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే.. వేడి వేడిగా ఈ సూప్ తాగండి

14 July 2022, 12:30 IST

google News
    • వర్షాకాలంలో వేడి వేడి సూప్ తాగుతుంటే మనసు ఎంత హాయిగా ఉంటుందో చెప్పనవసరం లేదు. అయితే సూప్ తయారు చేయడం అందరికీ రాదు. కానీ దీనిని చేయడం చాలా తేలిక. పైగా మెంతుల ఆకులు, మొక్కజొన్న గింజలతో ఈ సూప్ తయారు చేస్తారు. ఇది మంచి రుచిని ఇవ్వడమే కాకుండా.. సీజనల్ వ్యాధులనుంచి మనలను రక్షిస్తుంది. 
సూప్
సూప్

సూప్

Monsoon Special Soup : మెంతుల ఆకులు, మొక్కజొన్నతో చేసిన హెల్తీ మాన్సూన్ సూప్ రెసిపీ ఇక్కడ ఉంది. మెంతులు జీర్ణాశయ వ్యవస్థకు చాలా మంచివి. అందుకే పురాతన కాలం నుంచి వీటిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా మెంతుల ఆకులు, మొక్కజొన్న గింజల కలయిక సూప్‌కు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. అయితే వర్షాకాలంలో ఈ రెసిపీని ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి హెల్తీ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..

* మెంతుల ఆకులు - స్పూన్ (తరిగినవి)

* కార్న్ ఫోర్ల్ - స్పూన్

* మొక్కజొన్న గింజలు - 1 కప్పు

* వెన్న - అర టీస్పూన్

* స్ప్రింగ్ ఆనియన్స్ - 2 చిన్నవి (తరగాలి)

* వెల్లుల్లి - 2,3 (తరిగినవి)

* క్యారెట్ - 1 చిన్నది (తరగాలి)

* మిరియాల పొడి - చిటికెడు

* ఉప్పు - రుచికి తగినంత

తయారీ విధానం

కార్న్‌ఫ్లోర్‌ను ఓ గిన్నెలో తీసుకుని కొంచెం నీరు కలపి.. పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ వెలిగించి దానిపై ఉంచండి. దానిలో వెన్నను వేసి కరిగించండి. అనంతరం స్ప్రింగ్ ఆనియన్స్, వెల్లుల్లి, క్యారెట్ వేసి మీడియం మంట మీద 2-3 నిమిషాలు వేయించాలి. మొక్కజొన్న గింజలు వేసి బాగా కలపాలి. ఉప్పు వేసి.. రెండు కప్పుల నీరు వేయాలి.

ఈ మిశ్రమాన్ని బాగా కదిలిస్తూ.. 6-7 నిమిషాలు ఉడికించాలి. మెంతుల ఆకులు వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి మరో నిమిషం ఉడికించాలి. అనంతరం మిరియాల పొడి చల్లి దించేసి.. సర్వ్ చేసుకోవాలి. దీనిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. పైగా వర్షాకాలంలో వచ్చే చలినుంచి ఇది మీకు ఉపశమనం ఇస్తుంది. ఈ సూప్‌ మంచి రుచిని మాత్రమే కాకుండా.. దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల బారి నుంచి మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం