తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Toxic Food Ingredients। రుచికరమైన విష పదార్థాలు.. ఎక్కువ తిన్నారో, తీస్తాయి ప్రాణాలు!

Toxic Food Ingredients। రుచికరమైన విష పదార్థాలు.. ఎక్కువ తిన్నారో, తీస్తాయి ప్రాణాలు!

HT Telugu Desk HT Telugu

24 January 2023, 20:33 IST

    • Toxic Food Ingredients: మీరు వాటిని ఆహారంలో కలుపుకొని తింటున్నకొద్దీ రుచిగానే ఉంటుంది. కానీ ఇవి మీ శరీరానికి స్లో పాయిజన్ గా పనిచేసి మీ ఆరోగ్యాన్ని హరించి వేస్తాయి. ఆ రుచికరమైన విషపదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
Toxic Food Ingredients
Toxic Food Ingredients (Unsplash)

Toxic Food Ingredients

Toxic Food Ingredients: మనం రోజూవారీగా తినే కొన్ని ఆహార పదార్థాలు మన శరీరంపై స్లో పాయిజన్‌గా పనిచేస్తాయని మీకు తెలుసా? ఇంట్లో వండిన ఆహారాన్ని తరచుగా ప్రజలు ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. అయితే ఇంట్లో వండిన ఆహారంలో కూడా అనారోగ్యానికి హాని కలిగించే పదార్థాలు ఉంటాయి. అలాంటపుడు ఇంటి ఆహారం తినడంలో అర్థం ఏముంది.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

మీరు మీ ఆహారం వండేటపుడు ఉపయోగించే కొన్ని పదార్థాలు ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. మీకు నెమ్మదిగా విషం ఎక్కిస్తూ, మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆ రుచికరమైన విషపదార్థాలు ఏమిటో చూడండి మరి.

మైదా పిండి

మీరు ఉదయం తినే మైసూర్ బజ్జీల నుంచి, సాయంత్రం తినే కేక్ నుంచి, రాత్రికి తినే రోటీల వరకు ప్రతీ దానిని మైదాపిండిని ఉపయోగించే చేస్తారు. పార్టీలు, హోటళ్లు సర్వ్ చేసే చాలా వంటకాల్లో దీని వినియోగం ఉంటుంది. కానీ ఇది మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఉదరకుహర వ్యాధికి కూడా కారణమవుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి మైదాపిండి ఒక స్లో పాయిజన్, అధికంగా తింటే అనేక వ్యాధులను కలిగిస్తుంది.

నూనె

గుండెపోటు, స్ట్రోక్, రొమ్ము/అండాశయ క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు, కీళ్ల నొప్పులు ఇలా ఒకటేమిటి? దాదాపు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో అందుబాటులో ఉండే చికిత్సలన్నింటికీ అవసరమయ్యే వ్యాధులను కలిగించడానికి కారణం నూనె. ఈ నూనెను ఎంత ఎక్కువ తింటే, అంత ఎక్కువ రోగాలు.

ఉప్పు

అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుంది ఉప్పు. వంటలో రుచి కోసం ఉప్పు వేసుకుంటాం. కానీ అధికంగా వేసుకుంటే ఆసుపత్రిలో మనకోసం ఒక పడక వేసుకోవాల్సి వస్తుంది. ఉప్పు మీ ఆరోగ్యాన్ని నాశనం చేసే ఒక స్లో పాయిజన్. ఎందుకంటే ఉప్పులో సోడియం ఉంటుంది, ఇది రక్తపోటు స్థాయిలను ప్రభావితం చేస్తుంది, తద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తి రోజూ 5 mg కంటే తక్కువ సోడియం తీసుకోవాలి.

చక్కెర

చక్కెర పేరుతోనే ఒక బ్రాండె వ్యాధి ఉంది, ఆ వ్యాధి గనక తగులుకుంటే వదలనే వదలదు, అదే డయాబెటీస్. చక్కెరను ఎక్కువగా వాడటం వల్ల ఇది శరీరంలో స్లో పాయిజన్‌గా పనిచేస్తుంది. చక్కెరను తయారుచేసేటప్పుడు చాలా వరకు శుద్ధి చేస్తారు, దీని కారణంగా దానిలోని అవసరమైన పోషకాలు అన్నీ నాశనం చేయబడతాయి. అధిక కేలరీలు రక్తంలో చక్కెరను పెంచుతాయి, ఇందులోని కార్బోహైడ్రేట్‌లు స్థూలకాయానికి కూడా కారణమవుతాయి.

వైట్ బ్రెడ్

వైట్ బ్రెడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, అజీర్ణ సమస్యలు ఉండవచ్చు. వైట్ బ్రెడ్ మైదాపిండితో పాటు కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉపయోగించి తయారు చేస్తారు. ఇందులో ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు లేవు. దీని రెగ్యులర్ వినియోగం బరువు పెరుగుట మరియు కడుపు రుగ్మతలకు దారితీస్తుంది.

తదుపరి వ్యాసం