తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saggubiyyam Idli : ఉదయం ఇన్‌స్టంట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలా? సగ్గుబియ్యంతో ఇడ్లీ ట్రై చేయండి

Saggubiyyam Idli : ఉదయం ఇన్‌స్టంట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలా? సగ్గుబియ్యంతో ఇడ్లీ ట్రై చేయండి

Anand Sai HT Telugu

04 November 2023, 6:30 IST

google News
    • Saggubiyyam Idli Recipe : సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎంత మంచిదో కదా. అలాంటి సగ్గుబియ్యంతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ప్రతికాత్మక చిత్రం
ప్రతికాత్మక చిత్రం

ప్రతికాత్మక చిత్రం

Saggubiyyam Idli : ఉదయం ఇన్‌స్టంట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలా? సగ్గుబియ్యంతో ఇడ్లీ ట్రై చేయండిఇడ్లీ, దోశ, వడ రోజూ తినేవి.. వీటినే కాస్త వెరైటీగా చేస్తే బాగా తినొచ్చు. దోశలో వంద రకాలు ఉన్నాయి, ఇడ్లీలో కూడా అంతే.. సగ్గుబియ్యంతో పాయసం, ఉప్మా చేసుకోవచ్చు కానీ ఇడ్లీ కూడా చేయొచ్చని మీకు తెలుసా? అసలీ ఇడ్లీ ఉంటుంది.. అబ్బో నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. టేస్ట్‌లో ఇక వేరే మాట అక్కర్లేదు. ఇక సగ్గుబియ్యం ఇడ్లీకి ముందు రోజు నుంచి ఏం ప్రిపేర్‌ చేయాల్సిన అవసరం లేదు.. అప్పటికప్పుడు చేసేయొచ్చు. ఇంకేందుకు లేట్‌.. ఎంతో రుచిగా ఉంటే.. సగ్గుబియ్యం ఇడ్లీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా..!

స‌గ్గుబియ్యం ఇడ్లీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఇడ్లీ ర‌వ్వ – ఒక క‌ప్పు,

స‌గ్గుబియ్యం – అర క‌ప్పు,

పుల్ల‌టి మ‌జ్జిగ – రెండు క‌ప్పులు,

నూనె – ఒక టేబుల్ స్పూన్,

ఆవాలు – అర టీ స్పూన్,

శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్,

మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్,

త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌,

చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్,

ఉప్పు – త‌గినంత‌,

వంట‌సోడా – పావు టీ స్పూన్.

స‌గ్గుబియ్యం ఇడ్లీ త‌యారు చేసే విధానం..

ఒక గిన్నెలో ఇడ్లీ ర‌వ్వ‌, స‌గ్గుబియ్యం వేసి క‌ల‌పండి.త‌రువాత అందులో మ‌జ్జిగ పోసి ఇంకా బాగా క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి ఒక గంట పాటు ఉంచండి. అది బాగా నానుతుంది. త‌రువాత మరికొన్ని మ‌జ్జిగ‌ను పోసి ఇడ్లీ పిండిలా కలపండి. క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత మిన‌ప‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు, ఆవాలు వేసి తాలింపు వేయండి. కరివేపాకు వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఈ తాళింపును ఇడ్లీ పిండిలో వేసి క‌ల‌పుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో ఉప్పు, చిల్లీ ప్లేక్స్, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇడ్లీ ప్లేట్‌ల‌ను తీసుకుని వాటికి నూనెను రాసుకోవాలి. పిండిని వేసుకుని ఆవిరి మీద మాములు ఇడ్లీలు ఉడికించినట్లే చేయాలి. ఇడ్లీలు ఉడికాక బ‌య‌ట‌కు తీసి కొద్దిగా చ‌ల్లారిన త‌రువాత ప్లేట్ లో వేసుకుని చ‌ట్నీతో స‌ర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, హెల్తీ సగ్గుబియ్యం ఇడ్లీలు రెడీ.. వీటిని టమాటా చెట్నీతో తింటే ఉంటుంది.. ఆ..హా.. అనాల్సిందే.

తదుపరి వ్యాసం