తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Love Horoscope | మీరు డేట్​ చేసే వ్యక్తితో కాస్త జాగ్రత్తగా ఉండండి..

Love Horoscope | మీరు డేట్​ చేసే వ్యక్తితో కాస్త జాగ్రత్తగా ఉండండి..

HT Telugu Desk HT Telugu

20 May 2022, 6:57 IST

google News
    • ప్రతి ఒక్కరికి లైఫ్​లో ప్రేమ ముఖ్యమైనది. ప్రేమ జీవితం సరిగా ఉంటే.. అన్ని విషయాలలో విజయం సాధించవచ్చు. మరి మీ విషయంలో ప్రేమ కాంప్లికేటడ్​గా ఉందా? మీ భాగస్వామితో సంబంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలి అనుకుంటున్నారా? అయితే రాశుల ప్రకారం మీ ప్రేమలో ఎలాంటి ట్విస్ట్​లు ఉన్నాయో తెలుసుకుని.. ముందుకు వెళ్లిపోండి. చంద్రమానం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
రాశుల ఫలితాలు
రాశుల ఫలితాలు

రాశుల ఫలితాలు

మేషం: శృంగార సంబంధాల విషయానికి వస్తే.. మీరు మరింత సున్నితంగా, బహిరంగంగా మాట్లాడగలరు. చిన్న విషయాలకైనా మీ ప్రియమైన వ్యక్తి బాధపడకుండా ఉండేలా చూసుకోవాలి. మీరు మంచి హాస్యాన్ని కలిగి ఉండి.. మీకు సంతోషాన్ని కలిగించే విషయాలలో పాల్గొనాలి. దీర్ఘకాలంలో మీ భాగస్వామితో బలమైన సంబంధాన్ని కలిగి ఉండటానికి ఇది మీకు సహాయం చేస్తుంది.

వృషభం: మీ భాగస్వామి మీ కోసం చేసిన వాటిని మీరు ఎంతగా అభినందిస్తున్నారో చూపించడానికి ఈ రోజు మంచి సమయం. మీ బంధం, మీ భాగస్వామి కోసం.. మీరు ఇద్దరూ ఉత్తమ అడుగు ముందుకు వేయాలని కోరుకుంటారు. మీరు ఒక ప్రత్యేక సందర్భాన్ని జరుపుకుంటున్నట్లయితే.. మీ భాగస్వామి ఆలోచనాత్మకమైన బహుమతి ఇచ్చి.. మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు.

మిథునం: మీరు, మీ భాగస్వామి ఇటీవల సరిగా కమ్యూనికేట్ చేసుకోవడం లేదని మీకు అనిపించవచ్చు. మీ బంధం గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడు దానిలో తేడాను మీరు గమనిస్తారు. ఈ సమస్య దానంతట అదే పోదు కాబట్టి.. మీరే ఓ అడుగు ముందుకు వేయండి. భాగస్వామితో సమయం గడిపి.. చర్చించుకోండి.

కర్కాటకం: మీ జీవితం లేదా మీ లక్ష్యాలపై ఎటువంటి ప్రభావం చూపని పనిలో పాల్గొనవద్దు. ఈరోజు మీరు మీట్​ అయ్యే పర్సన్ మీకు తెలిసిన వారే అయి ఉంటారు. అయినప్పటికీ ఆ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వారు మునుపటి బంధాన్ని ముగించి.. ఇప్పుడు కొత్త సంబంధం కోసం వెతుకుతున్నారు. మీరు వారిని ఎంచుకునే ముందే దీని గురించి తెలుసుకోవడం మంచిది.

సింహం: లోతైన వ్యక్తిగత కనెక్షన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మీ సొంత ఆలోచనలే మిమ్మల్ని ముప్పులో పడేస్తాయి. మీ ప్రవర్తనలో ఏదో ఒక తేడా జరుగుతుంది. ఈ సమస్యను మీరు మాత్రమే పరిష్కరించుకోగలరు. ఈ విషయంలో మీ భాగస్వామి ఏమి చేయలేరు. కాబట్టి ముందుండి.. మీ దృక్పథాన్ని మార్చుకోండి.

కన్య: మీ దీర్ఘకాల అభిప్రాయాలు, వైఖరులు మీ ప్రస్తుత సంబంధం వాస్తవికతకు ఏమాత్రం సంబంధం కలిగి ఉండవు అనే వాస్తవాన్ని మీరు గ్రహిస్తారు. ఈ నేపథ్యంలో మీరు ఓ చర్య ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మీ జీవితంలో పెద్ద పురోగతి సాధించడానికి సహాయం చేస్తుంది. ప్రారంభించడానికి అది చిన్నదే అయినా.. మీపై పెద్ద ప్రభావాన్నే చూపిస్తుంది. మీ భాగస్వామిపై నమ్మకముంచండి.

తుల: మీకు, మీ ప్రియమైన వ్యక్తికి మధ్య ఇటీవల కమ్యూనికేషన్‌లో కాస్త సమస్యలు ఏర్పడి ఉండవచ్చు. దీన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి. అయితే దీని నుంచి మీరు కొన్ని అంశాలు నేర్చుకోవాలి. కమ్యూనికేట్ చేయడం సాధ్యంకాని విధంగా ఏమి జరిగిందో గుర్తించడం తెలుసుకోవాలి. ఇలా వారి సమస్యను తెలుసుకుని వారికి తోడుగా.. ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వండి.

వృశ్చికం: మీరు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటే మీ శృంగార జీవితం సరైన మార్గంలో ఉంటుంది. మీ సహచరుడితో కలిసి ఉండటానికి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ ధైర్యమైన వైఖరి ద్వారా మీ భాగస్వామి బాగా ప్రభావితమవుతారు. ఇది మీకు, మీరు ఇష్టపడే వ్యక్తికి మధ్య ఇప్పటికే అద్భుతమైన భాగస్వామ్యాన్ని కుదిర్చింది.

ధనుస్సు: మీ భాగస్వామికి మీలోని భావోద్వేగ ఫీలింగ్స్ ప్రదర్శించాలని అనుకుంటే.. ఇది మీ పరిపక్వత స్థాయికి పరీక్ష పెట్టినట్లే. మంచి దృక్పథాన్ని కొనసాగిస్తూ.. మానసికంగా బలంగా ఉండటం మిమ్మల్ని బాధ్యతాయుతమైన భాగస్వామిగా చేస్తాయి. ఉద్వేగభరితమైన ఫోన్ చర్చ లేదా మధురమైన సందేశాలు మీ రోజును మరింత ప్రత్యేకంగా చేస్తాయి.

మకరం: ఈ రోజు మీ భాగస్వామి ఆలోచనల్లో.. పూర్తిగా మునిగిపోయి ఉంటారు. రోజంతా మీ మనసు మీ ప్రియమైన వారి జ్ఞాపకాలతో నిమగ్నమై ఉంటుంది. కాబట్టి మీ పనిపై దృష్టి పెట్టండి. పని త్వరగా ముగించుకుని.. వారితో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించండి. అప్పుడు ఇద్దరు కలిసి ప్రశాంతమైన సాయంత్రం ఆనందించడానికి ఎదురుచూడండి.

కుంభం: బయటి ఒత్తిళ్ల కారణంగా మీరు కొంత కాలంగా ఆందోళనలో ఉన్నారు. ఈరోజు అంతా సాధారణ స్థితికి వచ్చే అవకాశముంది. విషయాలను మాట్లాడటానికి సమయాన్ని వెచ్చించడం ద్వారా అనవసరమైన అపార్థాలను నివారించవచ్చు. మీకు ఏమి కావాలో స్పష్టంగా చెప్పండి. మీరిద్దరూ ఒకరి ఆలోచనలకు మరొకరు మరింత ఓపెన్‌గా ఉంటారు. ఇది మీ మధ్య సామరస్యానికి దారితీస్తుంది.

మీనం: మీరు ఒకరితో ఒకరు సంపూర్ణంగా సమకాలీకరించబడుతున్నారని.. అద్భుతమైన సామరస్య భావనతో నిండి ఉన్నారని మీరు గ్రహిస్తారు. ఈ రోజు మీ ముఖ్యమైన వారితో మీ ఆలోచనలు, భావాలు, కోరికలు పంచుకునేందుకు మీరు ఏమాత్రం వెనుకాడరు.

టాపిక్

తదుపరి వ్యాసం