తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Today Horoscope | మీ సహోద్యోగులపై పుకార్లు పుట్టిస్తున్నారా? అయితే జాగ్రత్త

Today Horoscope | మీ సహోద్యోగులపై పుకార్లు పుట్టిస్తున్నారా? అయితే జాగ్రత్త

HT Telugu Desk HT Telugu

19 April 2022, 7:32 IST

google News
    • రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? ఈ రోజు మీకు అనుకూలించే అంశాలు ఏంటో.. అనుకూలించనివి ఏంటో తెలుసుకుని.. రోజును ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. ఏప్రిల్ 19వ తేదీ 2022న కెరీర్​ పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
రాశి ఫలాలు
రాశి ఫలాలు

రాశి ఫలాలు

మేషం: పనిలో మెరుగ్గా ఉండేందుకు.. ఈ రోజు మీరు చేసే అన్ని పనుల జాబితాను తయారు చేసుకోండి. మీలో చాలా ఆలోచనలు, సృజనాత్మకత ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించి ఎలా ప్రయోజనం పొందాలో ఆలోచించండి. శ్రద్ధగల వర్కర్‌గా, కొన్ని సమయాల్లో మీరు దేనికి అర్హులు అని దానిపై క్లారిటీ ఉండాలి. ప్రస్తుతం రేసును (ఉద్యోగాన్ని) విడిచిపెట్టి.. మీ సొంత బిజినెస్​ను ప్రారంభించే అవకాశముంది.

వృషభం: మీ పని బాధ్యతల్లో అద్భుతమైన విశ్వశక్తి.. మీ ఊహలకు స్ఫూర్తినిస్తుంది. వృత్తిపరమైన బాధ్యతల పట్ల ఉత్సాహంగా ఉండాలి. మీ తదుపరి కెరీర్ అడ్వెంచర్ ఏమిటో అర్థం చేసుకోవడానికి.. మీరు చేసే ప్రతిదానిని పరిగణించాలి. ప్రస్తుత పనిలో బాధ్యతలు, జరిగే పరిచయాలు మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడతాయి.

మిథునం: ఈ రోజు మీ అవుట్‌పుట్ గురించి ఆందోళన చెందాల్సిన రోజు కాదు. అస్తవ్యస్తమైన వాతావరణంలో కూడా... మీరు మీ పనులను దృష్టిలో ఉంచుకుని పూర్తి చేయగలరు. అయితే ఈ ఒక్క రోజు మినహాయింపు తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే పనిలోని సంఘటనలను మీరు నియంత్రించగలరు. వాటిని పరిష్కరించడానికి ఒక్కరోజు చాలు. ఈ రోజు మీరు సెలవు తీసుకున్నా పర్వాలేదు.

కర్కాటకం: మీ ఆర్థిక పరిస్థితి గణనీయమైన సర్దుబాట్లకు లోనవుతుంది. మీరు ఇప్పుడే ఏర్పాటు చేసుకున్న.. కొత్త వ్యాపార భాగస్వామ్యాలపై ఒక కన్ను వేసి ఉంచండి. రోజువారీగా జరిగే పనుల్లో మార్పులు ఎక్కువగా ఉంటాయి. భౌతిక, ఆర్థిక వనరుల్లో కొద్దిగా మార్పును చూడవచ్చు.

సింహం: మీ ఉద్యోగంలో మరింత సృజనాత్మకతను ఎలా చేర్చుకోవచ్చు అనే విషయంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. కార్యాలయంలో.. మీరు మరిన్ని అసైన్‌మెంట్‌లను చేపట్టడం ద్వారా మీ ఉత్పాదకతను పెంచుకునే అవకాశం ఉంటుంది. సృజనాత్మకతను పెంచుకోవడానికి సమయాన్ని వెచ్చించండి. ఇలా చేయడం వలన మీరు మెరుగ్గా పని చేయడానికి వీలుగా ఉంటుంది.

కన్య: మీ చుట్టూ జరుగుతున్న మార్పులు, కొత్త అవకాశాల పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. మీ ఉద్యోగ సంబంధాలలో విషయాలను మార్చడానికి మీరు ప్రయత్నిస్తారు. ఏదైనా చేసే ముందు.. ఏమి మార్చాలనుకుంటున్నారో ఆలోచించండి. సాధ్యమయ్యే మార్పుల గురించి మీ బృందంతో చర్చించండి. వారు కూడా మీకు సహకరిస్తారు.

తుల: మీరు ఆత్మవిశ్వాసంతో, విశ్వసనీయంగా ఉన్నప్పుడు.. ఇతరులు మీపై విశ్వాసం కలిగి ఉంటారు. మీ వృత్తి జీవితంలో ఒక స్థాయికి ఎదిగేందుకు మీ వ్యక్తిత్వం ఉపయోగపడుతుంది. మీ అత్యుత్తమ నాయకత్వం, కమ్యూనికేషన్ సామర్థ్యాల కారణంగా.. మీరు కార్యాలయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటారు. దాని ప్రయోజనాన్ని పొందడానికి మీ వంతు కృషి చేయండి.

వృశ్చికం: మనల్ని మనం స్పష్టంగా వ్యక్తీకరించడం ఎంత ముఖ్యమో గ్రహించే రోజు ఇది. ఈరోజు పని వాతావరణంలో సహోద్యోగులతో కమ్యూనికేట్ చేయడం కష్టతరంగా ఉంటుంది. కమ్యూనికేషన్ సమస్యలు ఉండవచ్చు కాబట్టి.. మీరు ఒక అడుగు వెనక్కి తగ్గి.. మీ పిచ్​ను కాస్త తగ్గించుకుని.. ఎలా మాట్లాడాలనే దానిపై కాస్త శ్రద్ధ వహించండి. మీ సంభాషణ సామర్థ్యాలను మెరుగుపరిచే మార్గాలను చూడండి.

ధనుస్సు: వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రత్యర్థులను ఓడించాలనుకుంటే ఏకాగ్రత చాలా అవసరం. మీరు కృషి చేయడం, స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం ద్వారా మీ ఉద్యోగం పట్ల మీ అంకితభావాన్ని చూపవచ్చు. మెరుగైన పని, నీతి, మంచి ఉద్దేశాలు.. మిమ్మల్ని ఏ విధంగానూ అస్థిరపరచకుండా ఉంచుతాయి. ఏకాగ్రతతో ఉండండి. మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి.

మకరం: మీ డబ్బును ఖర్చు చేయాలనుకోవడం, సంరక్షించాల్సిన అవసరం మధ్య నలిగిపోవచ్చు. మీ ఆర్థిక స్థిరత్వం ఇతర ప్రాధాన్యతల కంటే ప్రాధాన్యతనివ్వాలి. మీ బడ్జెట్ కోసం జవాబుదారీతనం, నిజాయితీ ఉండాలి. హాబీ లేదా సైడ్ బిజినెస్‌లో పెట్టుబడి పెట్టండి. మీరు కొంచెం పెట్టుబడి పెట్టవలసి వస్తే.. మీ పెట్టుబడికి రాబడి సరిపోతుందా అని ఆలోచించండి.

కుంభం: మీ సహోద్యోగులకు వారి ఉద్యోగ సమస్యలలో సహాయం చేయండి. అయితే మీ సహోద్యోగుల గురించి పుకార్లు వ్యాప్తి చేయకుండా ఉండడం మంచిది. వేరొకరి గురించి కథనాలను ప్రచారం చేయొద్దు. దీనివల్ల మీకు ఎదురుదెబ్బ తగలవచ్చు. ఇది మీపై చెడు ప్రభావం చూపవచ్చు. పనిలో అనైతికంగా ఉన్నప్పుడు.. మీ ఉన్నతాధికారులు మిమ్మల్ని కచ్చితంగా గమనిస్తారు. కాబట్టి మీ వృత్తిపరమైన ప్రతిష్ట దెబ్బతింటుంది.

మీనం : మీరు కార్యాలయంలో ఈ రోజు కీలక ఘట్టాలు చోటు చేసుకోవచ్చు. మీ సహోద్యోగుల్లో కొందరిని మీకు కేటాయించే అవకాశం ఉంది. ఏకాగ్రతతో ఉండి, మీ పనిని మీరు చేస్తూ.. అందరితో కలివిడిగా ఉండడమే మీకు శ్రేయస్సు. మీ కృషిని ఉన్నతాధికారులు గమనించి.. మీకు అండగా ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు.

టాపిక్

తదుపరి వ్యాసం