తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Today Breakfast Recipe : శాండ్​విచ్​లందు పనీర్ బుర్జీ శాండ్​విచ్ టేస్ట్ వేరయా..

Today Breakfast Recipe : శాండ్​విచ్​లందు పనీర్ బుర్జీ శాండ్​విచ్ టేస్ట్ వేరయా..

14 July 2022, 7:00 IST

google News
    • Today Breakfast Recipe : శాండ్‌విచ్ అంటే చాలా మందికి ఇష్టముంటుంది. అందుకే ఎక్కువ మంది బ్రేక్​ఫాస్ట్​లా దానినే తీసుకుంటారు. పైగా దీనిని ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి. అయితే మీరు రకరకాల శాండ్​విచ్​లు ట్రై చేసి ఉంటారు. మరి పనీర్ బుర్జీ శాండ్​విచ్​ని ఎప్పుడైనా తిన్నారా? అయితే మీరు ఈసారి ట్రై చేయాల్సిందే.
పనీర్ బుర్జీ శాండ్​విచ్
పనీర్ బుర్జీ శాండ్​విచ్

పనీర్ బుర్జీ శాండ్​విచ్

Today Breakfast Recipe : పనీర్ బుర్జీ శాండ్​విచ్​ అనేది చాలా సులభంగా తయారు చేసుకోగల రెసిపీ. పైగా ఇది మంచి రుచిని కూడా ఇస్తుంది. దీనిని ఉదయం అల్పాహారంగా తీసుకోవచ్చు. సాయంత్రం స్నాక్స్ లేదా రాత్రులు తేలికపాటి భోజనంలాగా కూడా తీసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా దీనిని ట్రై చేయండి. దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పనీర్ బుర్జీ శాండ్‌విచ్ తయారికీ కావాల్సిన పదార్థాలు

* బ్రెడ్ - 4

* పనీర్ - కప్పు (తురిమినది)

* వెన్న - 2 టీస్పూన్స్

* నూనె - 1 స్పూన్

* జీలకర్ర - అర టీస్పూన్

* వెల్లుల్లి - 1 స్పూన్ (తురిమినది)

* ఉప్పు - తగినంత

* పసుపు - చిటికెడు

* కారం - అర టీస్పూన్

* గరం మసాల - అర టీస్పూన్

* కొత్తిమీర - కొంచెం

* ఉల్లిపాయ - 1

* టమాట - 1

పనీర్ బుర్జీ శాండ్‌విచ్ తయారీ విధానం

స్టవ్ వెలిగించి ఓ కడాయి పెట్టండి. దానిలో నూనె వేసి వేడి చేయండి. అనంతరం వెల్లుల్లి, జీలకర్ర వేసి వేయించి స్టవ్ ఆపేయండి. దానిలో పనీర్, కారం పొడి, మసాలా పొడి, పసుపు, ఉప్పు, కొత్తిమీర ఆకులు, ఆమ్చూర్ పొడి వేసి బాగా కలపండి.

బ్రెడ్‌పై వెన్న రాసి.. ఉల్లిపాయ రింగులు, టొమాటోలు, పనీర్ బుర్జీని ఉంచండి. మరొక బ్రెడ్ స్లైస్​తో శాండ్‌విచ్‌ను మూసివేసి.. గ్రిల్ చేయండి. వేడివేడిగా సర్వ్ చేసుకుని మీకు ఇష్టమైన సాస్​తో ఆనందించండి.

టాపిక్

తదుపరి వ్యాసం