తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Dairies : మనసు స్వీట్ తినాలని కోరుకున్నప్పుడు.. రైస్​ ఖీర్ ట్రై చేయండి

Breakfast Dairies : మనసు స్వీట్ తినాలని కోరుకున్నప్పుడు.. రైస్​ ఖీర్ ట్రై చేయండి

13 July 2022, 7:56 IST

    • Recipe of the Day :  సడెన్​గా అప్పుడప్పుడు స్వీట్ తినబుద్ధి అవుతుంది. పైగా పండుగలు ఉన్నప్పుడు మరీనూ.. ఎందుకంటే ఇంట్లో ఉండే వాతావరణం మనకు ఆ వైబ్స్ ఇస్తాయి. ఆ సమయంలో పూజకు పెట్టిన నైవేథ్యాలే మనం బ్రేక్​ఫాస్ట్​గా లాగించేస్తాం. పైగా ఈ రోజు గురుపౌర్ణమి కూడా కాబట్టి.. స్వీట్​ను చేసుకుని తినడానికి ఇదే మంచి సమయం అనుకుని ఈ రైస్​ ఖీర్ ట్రై చేయండి. పైగా ఇది చేయడం కూడా సింపుల్.
రైస్ ఖీర్
రైస్ ఖీర్

రైస్ ఖీర్

Breakfast Dairies : ఖీర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. పైగా ఇది అన్నం పాయసం వలె ఉంటుంది. అందుకే దీనిని అందరూ ఇష్టపడతారు. పూజలు, పుట్టినరోజులు, ఏ స్పెషల్ డే అయినా.. ఖీర్ ఉండాల్సిందే. అయితే దీనిని తయారు చేయడం కూడా చాలా సులువు. అయితే దీనిని ఎలా తయారుచేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Healthy Food: ఆ మూడింటిని ఎంత తక్కువగా తింటే అంత ఆరోగ్యమని చెబుతున్న వైద్యులు, వారి మార్గదర్శకాలు ఇదిగో

Bed Time Habit : మీకు రాత్రిపూట ఈ అలవాటు ఉంటే.. అది బంధానికి విలన్

Capsicum Pachadi: స్పైసీగా క్యాప్సికం పచ్చడి ఇలా చేసుకోండి, చూడగానే నోరూరిపోతుంది

Peepal Tree Leaves Benefits : రావి చెట్టు ఆకుల ప్రయోజనాలు మీకు నిజంగా తెలియవు

రైస్ ఖీర్​కు కావాల్సిన పదార్థాలు

* పాలు - 5 కప్పులు

* బియ్యం - పావు కప్పు

* పంచదార - అర కప్పు

* ఎండుద్రాక్షలు - 10

* ఏలకులు - 2 (పొడి చేయండి)

* బాదం పప్పులు - 10 - 12 (తురిమినవి)

రైస్ ఖీర్ తయారీ విధానం

లోతైన పాన్ తీసుకుని.. బియ్యం, పాలను వేసి చిన్న మంట మీద ఉడకబెట్టండి. అన్నం ఉడికి, పాలు చిక్కబడే వరకు బాగా కలపండి. అనంతరం పంచదార, ఎండుద్రాక్ష, యాలకులు జోడించండి. చక్కెర కరిగిపోయే వరకు కలపండి. పంచదార కరిగిపోగానే.. స్టవ్ ఆపేసేయండి. అనంతరం సర్వింగ్ డిష్‌లోకి ఖీర్ తీసుకోండి. దానిని బాదంపప్పుతో అలంకరించండి. వేడిగా తిన్నా లేదా చల్లగా తిన్నా బాగానే ఉంటుంది. కాబట్టి ఎంజాయ్ చేయండి.

టాపిక్

తదుపరి వ్యాసం