తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipe : హై ప్రోటీన్ బ్రేక్​ఫాస్ట్ కావాలంటే.. పనీర్ పాన్ కేక్స్ బెస్ట్ ఛాయిస్

Breakfast Recipe : హై ప్రోటీన్ బ్రేక్​ఫాస్ట్ కావాలంటే.. పనీర్ పాన్ కేక్స్ బెస్ట్ ఛాయిస్

12 July 2022, 7:18 IST

    • Paneer Pan Cakes : ఉదయాన్నే మీరు ఆరోగ్యకరమైన హై ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీకు పనీర్ పాన్ కేక్స్ బెస్ట్ ఆప్షన్స్. ఇవి మీకు రుచికి రుచిని అందిస్తాయి. పైగా హెల్తీ కూడా. వీటిని తయారు చేయడానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.
పనీర్ పాన్ కేక్స్
పనీర్ పాన్ కేక్స్

పనీర్ పాన్ కేక్స్

Breakfast Recipe : మీ ఉదయాన్ని అమెరికన్ క్లాసిక్ బ్రేక్‌ఫాస్ట్​తో ప్రారంభించాలనుకుంటే.. పనీర్ పాన్ కేక్స్ బెస్ట్ ఆప్షన్. పైగా ఇది హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్. ఈ పనీర్ పాన్‌కేక్‌లను తేనెతో కలిపి తీసుకుంటే.. ఇది మీకు మంచి ఎంపిక అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

కావాల్సిన పదార్థాలు

* పనీర్ - 250 గ్రాములు (తురిమినవి)

* గుడ్లు - 2

* చక్కెర - 3 స్పూన్లు

* బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్

* గోధుమపిండి - అరకప్పు

* పాలు - 3 స్పూన్స్

* సాల్ట్ - తగినంత

* వెన్న - తగినంత

పనీర్ పాన్​కేక్ తయారీ విధానం

ఓ గిన్నెలో గుడ్లను పగులగొట్టి బాగా కలపండి. దానిలో పంచదార వేసి.. అది బాగా కలిసే వరకు కలపండి. ఈ మిశ్రమంలో తురిమిన, మృదువైన పనీర్, బేకింగ్ పౌడర్, గోధుమ పిండి, ఉప్పు వేసి బాగా కలపండి.ఈ మిశ్రమం బాగా కలవడానికి పాలు వేయండి. పిండి మరీ గట్టిగా లేకుండా.. పాన్ కేక్ వేయడానికి సరిపడినట్లు మందంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. పాన్ పెట్టాలి. తక్కువ మంట మీద ఉంచి.. కొద్దిగా వెన్న వేయాలి. పాన్‌పై పనీర్ పాన్‌కేక్ పిండిని పెద్ద గరిటెలో తీసుకుని పోయాలి.

పిండి దానంతటదే వ్యాపిస్తుంది. పైన బుడగలు రావడం కనిపించినప్పుడు.. దానిని మరో వైపునకు తిప్పి రోస్ట్ చేయండి. ఇలా రోస్ట్ అయిన తర్వాత.. మిగిలిన పిండితో కూడా అదే విధంగా పనీర్ పాన్ కేక్స్ తయారు చేయండి. వాటిని సర్వింగ్ ప్లేట్‌కు బదిలీ చేయండి. పనీర్ పాన్‌కేక్‌ను పండ్లు, తేనె లేదా మాపుల్ సిరప్‌తో కలిపి తీసుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం