Oats Masala Vada Recipe : ఓట్స్‌తో మసాలా వడలు చాలా సింపుల్‌గా చేసేయొచ్చు..
30 September 2022, 7:06 IST
- Oats Masala Vada Recipe : ఓట్స్ అనేవి ఫిట్నెస్ ఫ్రీక్స్‌కి.. మంచి ఆరోగ్యం కావాలనుకునే వారికి ఓట్స్ చాలా ముఖ్యమైనవి. చాలామంది తమ డైట్లో ఓట్స్‌ని యాడ్ చేసుకుంటారు. అయితే ఓట్స్ అంత టేస్టీగా ఉండవు కాబట్టి. మనం రకరకాలుగా దానిని తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టుకోవాలి. దానిలో ఒకటి ఓట్స్ మసాలా వడ.
ఓట్స్ మసాలా వడ
Oats Masala Vada Recipe : ఈరోజు నవరాత్రి ఐదవ రోజు. కాబట్టి ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అయితే ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా గారెలు పెట్టాలి. కాబట్టి ఈరోజు మనం ఓట్స్‌తో గారెలు చేసి.. అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. మనం కూడా హ్యాపీగా తినవచ్చు. మరి వీటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* ఓట్స్ - 1 కప్పు
* పెరుగు - 1/3 కప్పు
* బియ్యం పిండి - 1/2 కప్పు
* ఉప్పు - రుచికి తగినంత
* మిరియాల పొడి - రుచికి తగినంత
* పశ్చిమిర్చి - 2 (తురమాలి)
* అల్లం - అంగుళం- (తురమాలి)
ఓట్స్ మసాలా వడ తయారీ విధానం
ఓట్స్ తీసుకుని గ్రైండ్ చేసి.. ఒక గిన్నెలో వేయాలి. దానిలో బియ్యం పిండి, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో పెరుగు వేసి బాగా కలపాలి. అప్పుడు అది గారెల పిండిలా తయారువుతుంది. దీనిని ఓ పదినిముషాలు పక్కన పెట్టండి.
ఇప్పుడు స్టౌవ్ మీద పాన్ వెలిగించి.. దానిలో డీప్ ఫ్రై చేయడానికి అవసరమైన నూనె పోయండి. సిద్ధం చేసుకున్న పిండిని.. గుండ్రంగా తయారు చేసి.. మధ్యలో ఓ చిన్న రంధ్రం పెట్టి.. కాగిన నూనెలో వేయండి. అది మంచి బంగారు రంగు వచ్చే వరకు బాగా వేయించండి. స్పైసీ, టేస్టీ చట్నీతో ఈ గారెలను లాగించండి.