తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Dairies | మీరు హెల్తీ డైట్​ ఫాలో అవ్వాలనుకుంటే.. ఈ స్మూతీ మీకోసమే..

Breakfast Dairies | మీరు హెల్తీ డైట్​ ఫాలో అవ్వాలనుకుంటే.. ఈ స్మూతీ మీకోసమే..

07 June 2022, 7:02 IST

google News
    • మీరు మంచి హెల్తీ రెసిపీల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఈ స్మూతీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికే కాదండోయ్.. మీకు అనేక ప్రయోజనాలను ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మీకు హెల్తీ హెయిర్, స్కిన్ కావాలనుకుంటే దీనిని కచ్చితంగా మీ డైట్​లో యాడ్​ చేసుకోండి.
పాలకూరతో స్మూతీ
పాలకూరతో స్మూతీ

పాలకూరతో స్మూతీ

Hulk Smoothie | హల్క్ స్మూతీ. దీనిని మీరు బ్రేక్​ ఫాస్ట్​గా తీసుకోవచ్చు. జిమ్​లో కసరత్తులు చేసి.. అలసిపోయిన శరీరానికి రోజంతా ఉత్సాహంగా ఉండేలా ఓ డ్రింక్​ కావాలనుకుంటే.. ఈ స్మూతీ మీకు పర్​ఫెక్ట్ ఛాయిస్. ఇది మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా.. హెల్తీ హెయిర్​కు, హెల్తీ స్కిన్​కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఈ రెసిపీ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. ​

కావాల్సిన పదార్థాలు (3 గ్లాసులకు)

* పాలకూర - 1 కట్ట

* అరటిపండ్లు - 2

* యాపిల్స్ - 2

* చియా సీడ్స్ - 2 స్పూన్స్

* బెల్లం లేదా హనీ - 2 లేదా 3 స్పూన్స్

* అల్లం - 1 చిన్న ముక్క

* కొబ్బరి పాలు - 1 కప్పు (డెయిరీ మిల్క్​ కూడా వాడొచ్చు)

* యోగర్ట్ - 1 అరకప్పు

* ఐస్ క్యూబ్స్ - 1 కప్పు

తయారీ విధానం

మిక్సీజార్​లో పాలకూర, అరటిపండ్లు, యాపిల్స్, చియా సీడ్స్, బెల్లం, అల్లం, కొబ్బరిపాలు, యోగర్ట్, ఐస్​క్యూబ్స్ ఇవన్నీ మిక్సీ జార్​లో వేసుకుని.. మెత్తగా చేసుకోవాలి. రోజూ ఉదయాన్నే ఈ హల్క్ జ్యూస్​ను తీసుకోవడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే జిమ్ చేసినా లేదా వ్యాయమం చేసినా తర్వాత ఈ జ్యూస్​ తీసుకోవడం వల్ల మీరు డే అంతా.. ఉత్సాహంగా ఉంటారు.

టాపిక్

తదుపరి వ్యాసం