తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipe : మీరు డయాబెటికా? అయితే ఈ స్వీట్ మీరు కూడా తినొచ్చు..

Breakfast Recipe : మీరు డయాబెటికా? అయితే ఈ స్వీట్ మీరు కూడా తినొచ్చు..

13 August 2022, 7:20 IST

    • పాపం మధుమేహం ఉన్నవారు స్వీట్ కష్టాలు అన్ని ఇన్నికావు. వీరికి స్వీట్ తినాలనిపిస్తుంది. కానీ తినకూడదు. ఇంట్లో వాళ్లు అసలు వారికి స్వీట్ ఇచ్చే ఛాన్సే లేదు. మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా? అయితే మీరు ఈ స్వీట్ తినొచ్చు. అవునండి.. మీరు ఇంట్లోనే దీనిని తయారు చేసుకోవచ్చు కూడా.
డయాబెటిక్ ఫ్రెండ్లీ స్వీట్
డయాబెటిక్ ఫ్రెండ్లీ స్వీట్

డయాబెటిక్ ఫ్రెండ్లీ స్వీట్

Breakfast Recipe : ఓట్స్, నారింజతో తయారు చేసే ఈ వంటకం రుచికరమైనది మాత్రమే కాకుండా చాలా ఆరోగ్యకరమైనది కూడా. ఈ రెసిపీని మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరే ఆలోచన లేకుండా చక్కగా లాగించేయవచ్చు. అయితే స్వీట్ కోసం ఆరాటపడే మీ ఇంట్లోని వారికి.. ఉదయమే వేడిగా వండి.. చల్లగా వారికి వడ్డించి వారి నోరు తీపి చేయండి. పైగా దీనిని వండడం కూడా చాలా సులభం. ఈ ప్రత్యేకమైన స్వీట్ ఎలా తయారు చేయాలో, కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Male Infertility : మీ స్మార్ట్ ఫోన్ ఈ ప్రదేశంలో పెడితే సంతానోత్పత్తి సమస్యలు

How To Die Properly : చచ్చాక ఎలా ఉంటుందో చూపించే పండుగ.. పిచ్చి పీక్స్ అనుకోకండి

New Broom Tips : కొత్త చీపురుతో ఇంట్లోకి దుమ్ము రావొచ్చు.. అందుకోసం సింపుల్ టిప్స్

Parenting Tips : కుమార్తెలు భయపడకుండా జీవించేందుకు తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు

కావాల్సిన పదార్థాలు

* ఓట్స్ - పావు కప్పు

* ఆరెంజ్ - 2 కప్పులు (పీల్ తీసేయాలి)

* పాలు - 2 కప్పులు

* నెయ్యి - 1 టీస్పూన్

* స్టెవియా - 1 టీస్పూన్ (పంచదారకు ప్రత్యామ్నాయం)

తయారీ విధానం

స్టవ్ వెలిగించి ఓ పాన్ దానిమీద ఉంచాలి. దానిలో నెయ్యి వేసి.. ఓట్స్‌ను కూడా వేసి 2 నిమిషాలు వేయించాలి. అలా వేగాక ఓట్స్‌లో పాలు వేసి బాగా కలపాలి. దానిని 10 నిమిషాలు ఉడికించాలి.

ఓట్స్ చిక్కగా అయిన తర్వాత.. మంట నుంచి దించేయాలి. అది చల్లారాక.. దానిలో నారింజ ముక్కలు, స్టెవియో వేసి బాగా కలపాలి. వడ్డించే ముందు కనీసం 30 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. తినేముందు తరిగిన బాదంపప్పులతో అలంకరించండి. దీనిని మధుమేహం ఉన్నవారు కూడా హ్యాపీగా తినొచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం