తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipe: మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఈ మఫిన్ పర్​ఫెక్ట్ బ్రేక్​ఫాస్ట్..

Breakfast Recipe: మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఈ మఫిన్ పర్​ఫెక్ట్ బ్రేక్​ఫాస్ట్..

03 August 2022, 10:05 IST

google News
    • Breakfast Recipe: ఆరోగ్యకరమైన, పోషకాలతో నిండిన ఫుడ్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తినొచ్చు అంటే ఇంకా ఆగుతామా? చేసి తినాల్సిందే అనుకుంటాము. అయితే మీరు కూడా ఓ బ్యూటీఫుల్ టేస్టీ మఫిన్ తినాలి అనుకుంటే.. ఈ రెసిపీని ఫాలో అయిపోండి.
డేట్స్ అండ్ పిస్తా మఫిన్
డేట్స్ అండ్ పిస్తా మఫిన్

డేట్స్ అండ్ పిస్తా మఫిన్

Breakfast Recipe: మధుమేహ వ్యాధిగ్రస్తులకు పోషకమైన, ఆరోగ్యకరమైన టేస్టీ ట్రీట్ ఇవ్వాలనుకుంటే ఖర్జూరం, పిస్తా మఫిన్ ట్రై చేయాల్సిందే. మఫిన్ అంటే స్వీట్ ఉంటుంది కదా మరీ మధుమేహం ఉన్నవారికి ఎలా ఇవ్వడం అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకోవాల్సిందే.

కావాల్సిన పదార్థాలు

* నెయ్యి - పావు కప్పు

* దేశీ ఖాండ్ - పావు కప్పు (పంచదారకు ప్రత్యామ్నాయం)

* రాగిపిండి - ఒకటిన్నర కప్పు

* గోధుమపిండి - ముప్పావు కప్పు

* మొక్కజొన్న పిండి - 2 టేబుల్ స్పూన్లు

* ఉప్పు - అర టీ స్పూన్

* ఏలకుల పొడి - 1 టీ స్పూన్

* బేకింగ్ పౌడర్ - 2 స్పూన్లు

* బేకింగ్ సోడా - అర టీ స్పూన్

* మజ్జిగ - 1 కప్పు

* నీళ్లు - అర కప్పు

* ఖర్జూరం - 1 కప్పు

* పిస్తా - 1 కప్పు

తయారీ విధానం

ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్‌కు ప్రీహీట్ చేయండి. దానిలో మీ మఫిన్ ట్రేని తీసుకుని వెన్నతో గ్రీజు వేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో వెన్న, ఖాండ్‌లను వేసి బాగా కలపండి. ఇది క్రీమ్ లాంటి ఆకృతిలోకి వస్తుంది. అప్పుడు దానిలో రాగి పిండి, గోధుమపిండి, మొక్కజొన్న పిండి, యాలకుల పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మిశ్రమాన్ని వేసి బాగా కలపండి. ఉండలు లేకుండా చూసుకోవాలి.

ఇప్పుడు ఆ మిశ్రమంలో మజ్జిగ, నీరు వేసి.. బాగా కలపాలి. అన్ని పదార్థాలు బాగా కలిసేలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దానిలో తరిగిన ఖర్జూరాలు, పిస్తాలను వేయాలి. బాగా కలిపాలి. ఈ మిశ్రమాన్ని సిద్ధం చేసుకున్న మఫిన్ ట్రేలో వేసి.. 25-30 నిమిషాలు బేక్ చేయండి. అంతే టేస్టీ టేస్టీ.. ఖర్జూరం, పిస్తా మఫిన్ రెడీ.

ఖర్జూరం, పిస్తాతో నిండిన ఈ వంటకం అధిక ఫైబర్, ప్రోటీన్ కంటెంట్‌ను కలిగి ఉంటుంది. చక్కెరకు ప్రత్యామ్నాయంగా 'ఖాంద్' ఉపయోగించాము కాబట్టి.. మధుమేహవ్యాధిగ్రస్తులు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతిరోజూ ఉదయం వేడిగా ఉండే కప్పు టీకి ఇది సరైన తోడు!

టాపిక్

తదుపరి వ్యాసం