తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipe : ఫిట్​నెస్ మీద శ్రద్ధ చూపే వారికి బెస్ట్ బ్రేక్​ఫాస్ట్.. బాదం, కొబ్బరి పోహా

Breakfast Recipe : ఫిట్​నెస్ మీద శ్రద్ధ చూపే వారికి బెస్ట్ బ్రేక్​ఫాస్ట్.. బాదం, కొబ్బరి పోహా

16 July 2022, 7:18 IST

    • Breakfast Recipe : ఈ బిజీ మార్నింగ్ మీల్​లో హెల్తీ బ్రేక్​ఫాస్ట్​ గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఈ ఆల్మండ్, కొబ్బరి పోహాను ట్రై చేయండి. దీనిని తయారు చేయడం సులభం. పైగా ఇది హెల్తీ కూడా. ఇది శరీరానికి కావాల్సినంత శక్తిని అందిస్తుంది. కాబట్టి మీ బ్రేక్​ఫాస్ట్​ రోటీన్​లో దీనిని కచ్చితంగా చేర్చుకోవచ్చు.
బాదం, కొబ్బరి పోహా
బాదం, కొబ్బరి పోహా

బాదం, కొబ్బరి పోహా

Breakfast Recipe : కొబ్బరి, బాదంతో చేసిన పోహా అత్యుత్తమ అల్పాహారం ఎంపిక. ఈ పోహా రెసిపీని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పైగా ఇది ఆరోగ్యకరమైనది కూడా. బాదం, కొబ్బరి మీకు ఆసక్తికరమైన టేస్ట్​ను ఇస్తుంది. కొలెస్ట్రాల్ సున్నా. కానీ అధిక ప్రోటీన్, కాల్షియం విలువతో కూడిన సరళమైన వంటకం. కాబట్టి ఫిట్​నెస్​ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు కూడా దీనిని హ్యాపీగా తమ డైట్​లో చేర్చుకోవచ్చు. మరీ ఈ రెసిపీ తయారీ, కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Turmeric Water Benefits : వేడి నీటిలో పసుపు కలిపి తాగితే ఈ 7 సమస్యలు రాకుండా ఉంటాయి

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో 8 అంకెల మధ్య 3 అంకె దాక్కొని ఉంది, అదెక్కడుందో 10 సెకన్లలో కనిపెట్టండి

Chicken Chinthamani Recipe : చికెన్ చింతామణి.. ఒక్కసారి ట్రై చేయండి.. రుచి సూపర్

Rice For Long Time : బియ్యంలోకి తెల్లపురుగులు రాకుండా ఉండేందుకు చిట్కాలు

కావాల్సిన పదార్థాలు

* బాదం ఫ్లేక్స్ - 200 గ్రాములు (బాదం పప్పులను సన్నగా తరగాలి)

* ఉల్లిపాయలు - 450 గ్రాములు

* పోహా - 200 గ్రాములు

* సాల్ట్ - తగినంత

* నూనె - 20 మి.లీ

* కరివేపాకు - 8 రెబ్బలు

* పచ్చిమిర్చి - 2

* తాజా కొబ్బరి - 100 గ్రాములు

కొబ్బరి, బాదం పోహా తయారీ విధానం

పోహాను చల్లటి నీళ్లలో నానబెట్టి.. వడకట్టి పక్కన పెట్టుకోవాలి. 3/4వ వంతు బాదం రేకులను నీళ్లలో నానబెట్టి.. మిగిలిన వాటిని టోస్ట్ చేయాలి. అనంతరం పాన్‌లో నూనె తీసుకుని.. ఆవాలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి.

ఇప్పుడు ఆ తాళింపులో నానబెట్టిన పోహా, బాదంపప్పు వేయాలి. అనంతరం తరిగిన కొత్తిమీర, తాజా కొబ్బరి తురుమును వేసుకోవాలి. చివరిలో రోస్ట్ చేసిన బాదంపప్పులను వేసి.. వేడిగా సర్వ్ చేసుకోవడమే.

టాపిక్

తదుపరి వ్యాసం