Mysore Bonda Recipe : వేడి వేడిగా మైసూర్ బోండా.. లాగించండి అటు ఇటు చూడకుండా
18 November 2023, 6:30 IST
- Mysore Bonda For Breakfast : మైసూర్ బోండాలు అంటే చాలామందికి ఇష్టం. కొందరూ ఉదయం లేవగానే అల్పాహారంలోకి కూడా తీసుకుంటారు. దీనిని ఈజీగా తయారు చేయడం ఎలానో ఈరోజు తెలుసుకుందాం..
ప్రతీకాత్మక చిత్రం
కర్ణాటకలోనీ మైసూర్ చాలామందికే తెలుసు. ఈ నగరం అనేక విశేషాలకు ప్రసిద్ధి చెందింది. మైసూర్ తమలపాకులు, మైసూర్ మల్లె, మైసూర్ మసాలా దోస, మైసూర్ పాక్, మైసూర్ బోండా లాంటి పేర్లు మనం చాలా సార్లు విని ఉంటాం.. మైసూర్ బోండా మైసూరులోనే కాదు, చాలా రాష్ట్రాల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. రుచికరమైన మైసూర్ బోండాను తినడానికి ఇష్టపడతారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి చేసుకోండి. ఇది సిద్ధం చేయడం కూడా చాలా సులభం. మైసూర్ బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇలా ఉన్నాయి. దీనికి పెద్ద మొత్తంలో పదార్థాలు కూడా అవసరం లేదు.
మైసూర్ బోండా తయారీకి కావలసిన పదార్థాలు
మైదా పిండి - 1 1/2 కప్పులు
పెరుగు - 1 కప్పు
జీలకర్ర - 1 టీస్పూన్
సోడా - 1/2 టీస్పూన్
నూనె - వేయించడానికి
ఉప్పు - రుచి ప్రకారం
మైసూర్ బోండా తయారు చేసే విధానం
ఒక పాత్రలో ఒక కప్పు పెరుగు, సమానమైన నీరు కలపండి
జీలకర్ర, ఉప్పు, 1 స్పూన్ నూనె, మైదా.. ప్రతిదీ జోడించండి
ఈ మిశ్రమానికి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కలపాలి, 2-3 గంటలు పులియనివ్వండి
2-3 గంటల తర్వాత 1/2 టీస్పూన్ సోడా వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి
నూనె వేడి చేయండి, మీ చేతుల్లో పిండిని తీసుకోండి. మీ పిడికిలి మధ్యలో పిండిని పెట్టుకుని.. ఒక్కో ముద్దగా నూనెలో వేయండి. చిన్న చిన్నగా వేసుకోవాలి.
బోండాను బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు మీడియం మంటలో వేయించాలి. అంతే రుచికరమైన మైసూర్ బోండా తినడానికి సిద్ధంగా ఉంటుంది.
మైసూర్ బోండాను ఆస్వాదించేందుకు పుదీనా చట్నీతో వేడిగా తినండి. బాగుంటుంది.