తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Quote : మనుషులను చులకనగా చూస్తూ.. పూజలు చేస్తే దైవానుగ్రహం పొందుతారా?

Thursday Quote : మనుషులను చులకనగా చూస్తూ.. పూజలు చేస్తే దైవానుగ్రహం పొందుతారా?

04 August 2022, 7:04 IST

google News
    • Thursday Quote : అందరి దేవుళ్లు గొప్పవాళ్లే. దైవం ఒక్కటే అని భావించే మనం.. వివిధ రూపాలలో ఆయనను మొక్కుతాము. కానీ వివిధ రూపాలలో ఉండే మనుషులను మాత్రం ఒకేలా చూడము. ఓ మనిషిని మనిషిలాగా కూడా చూడకుండా.. చీప్​గా, చులకనగా చూస్తే.. దేవుడు మీరు చేసే పనులకు హర్షిస్తాడు అంటారా?
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Thursday Motivation : కొందరు దేవుళ్లను చాలా ఎక్కువగా పూజిస్తారు. దైవ భక్తి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. నిరంతరం ఏదో పూజ చేస్తూనే ఉంటారు. వారాలు వస్తే ఉపవాసాలు చేస్తారు. మొక్కులు చెల్లిస్తారు. ఇలా చాలానే చేస్తారు. కానీ.. మనుషులను మాత్రం చులకనగా చూస్తారు. అందరినీ కాదు. కొన్ని మతాల వారిని, కొన్ని వర్గాల వారిని వేరు చేసి చూడటం.. చులకనగా మాట్లాడటం వంటివి చేస్తారు. ఇలాంటి మనసు ఉన్న వారు దేవుని అనుగ్రహం నిజంగా పొందుతారా?

మీ సంక్షోభంలో దేవుడు మీకు సహాయం చేస్తాడు. అందుకే మనం దేవుడిని ఆరాధిస్తాము. మనకు మంచి చేయాలని ప్రార్థనలు చేస్తాము. ఇదొక వెర్షన్ అయితే.. మరోవైపు మనం ప్రజలను చులకనగా చూస్తాము. పెద్దలు, ఇతర సభ్యులకు కూడా గౌరవం ఇవ్వము. అలా చేస్తే దేవుడు మీ ప్రార్థనలను వింటారని ఆశించడం పొరపాటే. మీరు నిజంగా దేవుడి అనుగ్రహం పొందాలనుకుంటే.. మొదట మీ చుట్టూ ఉన్నవారికి తగిన గౌరవం ఇవ్వండి. దేవుడు వారి రూపంలో వచ్చి మీకు సహాయం చేస్తారేమో ఎవరికి తెలుసు?

మీరు లోపల నుంచి మంచి మనిషిగా లేకపోతే.. దేవుడి అనుగ్రహం మీకు ఎందుకు అందుతుంది. నేటి ప్రపంచంలో గుడికి లేదా చర్చికి వెళ్లి స్వీట్లు ఇచ్చి.. దేవుడి పేరు మీద పెట్టడం చాలా సులభం. కానీ మానవ సేవే.. మాధవ సేవ అంటారు. దేవునికి పూజ చేస్తారు కానీ.. మానవ సేవను విస్మరిస్తారు. విస్మరిస్తే పర్లేదేమో కానీ.. చులకనగా చూస్తారు. అది కచ్చితంగా తప్పే అవుతుంది.

ప్రతిరోజూ ఉదయం ఆలయాన్ని లేదా చర్చిని సందర్శించి.. దేవునికి పూజలు, ప్రార్థనలు చేయడం మంచిదే. కానీ.. అదే సమయంలో మీరు మీ సొంత చర్యలపై కూడా జాగ్రత్త వహించాలి. కేవలం షో-ఆఫ్ పనులు కాకుండా.. మంచి మనసుతో ప్రజల పట్ల శ్రద్ధ వహించాలి. వారి కోరికలను వినాలి. కుదిరితే నెరవేర్చగలగాలి. వాస్తవానికి అర్హులైన వారిని గుర్తించి తగిన గౌరవం ఇవ్వాలి.

దేవుడు గొప్పవాడే. కానీ ఆయనైనా సరే మనిషి రూపంలోనే మీకు సహాయం చేయగలడు అని ఎంతమందికి తెలుసు. దేవుడిలా వచ్చావు అంటారు కానీ.. దేవుడే వచ్చాడు అనరు కదా. అంటే ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నట్లే కదా.. మీరు వారిని సరిగా చూడట్లేదు.. చీప్​గా చూస్తున్నారు అంటే.. దేవుడిని అవమానించినట్లే కదా. ఈ సింపుల్ లాజిక్ మిస్​ పక్కన పెట్టి.. చాలా మంది మనుషులను చాలా హీనంగా ట్రీట్ చేస్తారు.

టాపిక్

తదుపరి వ్యాసం