Smart app for Skin: ఈ మొబైల్ యాప్‌లో ఫోటో తీస్తే చాలు మీ చర్మ సమస్యలు గురించి చెప్పేస్తుంది
06 July 2024, 10:30 IST
Smart app for Skin: కొన్ని మొబైల్ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా జీవితాన్ని సులభతరం చేసుకోవచ్చు. ఈ యాప్ చర్మ సమస్యలు గురించి సులువుగా చెబుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని చెప్పే స్మార్ట్ యాప్
స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించడం నేటి కాలంలో చాలా కష్టం. స్మార్ట్ ఫోన్లలో రకరకాల యాప్స్ ఉంటాయి. అటువంటి ఉపయోగకరమైన యాప్స్ గురించి ఇక్కడ మేము సమాచారం ఇస్తున్నాం. తద్వారా మీ జీవితాన్ని మునుపటి కంటే కొంచెం సులువుగా, భద్రంగా మార్చుకోవచ్చు
సీనియర్స్ సేఫ్టీ యాప్
వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఎదిగిన పిల్లలదే. వారి భద్రత, ఆరోగ్యం గురించి పిల్లులు ఆందోళన చెందడం సహజం. ఇంట్లో వృద్ధులను ఒంటరిగా ఉంచి ఉద్యోగాలకు వెళుతున్న కొడుకులు, కూతుళ్లు ఎంతో మంది. వారి దగ్గర మీరు లేకున్నా వారి భద్రతను పర్యవేక్షించడానికి మీరు సీనియర్ సేఫ్టీ యాప్ సహాయం తీసుకోవచ్చు. ప్రమాదం జరిగితే వెంటనే ఆ వృద్ధుల సంరక్షకులకు ఈ యాప్ సమాచారం అందిస్తుంది. వృద్ధులలో పడిపోవడం లేదా గాయపడటం వంటి సంఘటనలు సాధారణం. ఇలాంటి ప్రమాదాల్లో తక్షణ వైద్య సహాయం పొందడం వల్ల అనేక సమస్యలను నివారించవచ్చు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్ ను రూపొందించారు. ఫోన్లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసి యాక్టివ్ లో ఉంచాలి. ఫోన్ పడిపోయినప్పుడు, ఎక్కువ సేపు ఫోన్ ఉపయోగించనప్పుడు, నెట్ వర్క్ మారినప్పుడు, బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు, ఇంటి నుంచి ఫోన్ దూరంగా వెళ్లినప్పుడు ఈ యాప్ మీకు వెంటనే తెలియజేస్తుంది. దీని వల్ల మీరు వెంటనే అలెర్ట్ కావచ్చు.
AYSA యాప్
తామర, సోరియాసిస్, మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి.చర్మంపై ఏదైనా ఆరోగ్య సమస్యను వచ్చినట్టు అనిపిస్తే… ఆ సమస్య ఏమిటో చెప్పే యాప్ ఒకటుంది. అదే AYSA యాప్. లక్షణాల ఆధారంగా చర్మ సమస్యను గుర్తించడానికి ఈ యాప్ సహాయపడుతుంది. దీని కోసం మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం ఫోన్ కెమెరా సహాయంతో సమస్య ఉన్న చర్మం భాగాన్ని ఫొటో తీయాలి. సమస్య ఏమిటో, దాని పరిష్కారం ఏమిటో ఆ చిత్రం సహాయంతో యాప్ వెంటనే మీకు చెప్పగలుగుతుంది. సమస్యను పరిష్కరించడానికి ఏం చేయాలో కూడా యాప్ మీకు సలహా ఇస్తుంది.
Lazy Fit యాప్
బరువు తగ్గాలనుకుంటున్న వారికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. మీ సోమరితనాన్ని వదిలించుకుని ఈ ఫిట్నెస్ ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటే ఆ యాప్ సాయం తీసుకోండి. ఈ యాప్ సాయంతో ఇంటి నుంచే బయటకు వెళ్లకుండానే ఫిట్ నెస్ జర్నీని ప్రారంభించవచ్చు. ఈ యాప్ వర్చువల్ ఫిట్నెస్ కోచ్ లా పనిచేస్తుంది. ఈ యాప్ ఇంట్లోనే చేసే కుర్చీ వ్యాయామాలు, బెడ్ వర్కౌట్స్, యోగా, వాల్ పైలేట్స్ వంటివి ఉంటాయి. ఇవి ఉత్తమ వ్యాయామాలు కూడా. ఇంట్లోంచి బయటికి వెళ్లకుండానే మీరు బరువు తగ్గవచ్చు. అందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.