సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలపై శ్రద్ధ వహించండి
28 February 2022, 16:23 IST
- మా ఇంట్లో కార్లు ఉన్నాయి.. బైక్‌లు కొనడం అవసరమా అనుకునే వారికి సెకండ్ హ్యాండ్ బైక్స్ బెస్ట్ ఆప్షన్. కానీ చాలా మంది వినియోగదారులకు వాటిని కొనుగోలు చేసేటప్పు డు ఏ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి? ఏయే జాగ్రత్తలు పాటించాలి? లాంటి విషయాలను ఇప్పుడు చూద్దాం
సెకండ్ హ్యాండ్ బైక్స్
నగరాలు,పట్టణాలు ట్రాఫిక్ మయమవుతున్నాయి. ఇరుకుగా ఉన్న రోడ్లపై పెద్ద వాహనాల పరిమితి పెరిగిపోతుంది. గత 10 ఏళ్లలో నగరాలలో అనుహ్య రితిలో ఈ సంఖ్య పెరిగింది. బస్సులు,కార్లు,ఆటోలు లాంటి పెద్ద సైజ్ వాహనాలు రోడ్లపైకి వచ్చి పలు కూడళ్లు పద్మవ్యూహాన్ని తలపిస్తున్నాయి. పెరుగుతున్న పట్టణీకరణ ద్వారా మనిషికి ఎదురవుతున్న అతి పెద్ద సవాలు ట్రాఫిక్. ఆఫీస్ 5 గంటలకు అయిపోతే ఇంటికి వచ్చేసరికి 7 గంటలవుతోంది. రాను రాను ఈ సమయం మరింత పెరగనుంది. అయితే ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించాలంటే మనకున్న ప్రత్యామ్నాయం చిన్న సైజ్ వాహనాలను వాడడమే.
ముఖ్యంగా నగరాలలో ద్విచక్ర వాహనాలను వినియోగించడం అలవాటు చేసుకోవాలి. చిన్న వాహనాలను వాడడం వల్ల రోడ్లపై రద్దీ తగ్గుతుంది. అయితే మా ఇంట్లో కార్లు ఉన్నాయి.. బైక్‌లు కొనడం అవసరమా అనుకున్న వారికి సెకండ్ హ్యాండ్ బైక్స్ బెస్ట్ ఆప్షన్. కానీ చాలా మంది వినియోగదారులకు వాటిని కొనుగోలు చేసేటప్పు డు ఏం చూడాలో కచ్చితంగా తెలియదు. దీనివల్ల మోసానికి గురవుతున్నారు. మోసాన్ని నివారించడానికి, సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారుడు ఎలాంటి విషయాలపై శ్రద్ధ వహించాలో ఒకసారి చూద్దాం.
సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు, ఈ కింది విషయాలను పరిగణనలోకి తీసుకోండి:
బడ్జెట్ :
సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేసేటప్పుడు, వినియోగదారులు ధర విషయాన్ని ముఖ్యంగా పరగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ధరల విషయంలో దృష్టి పెట్టాలి. అదనపు పన్నులు, ఇతర తగ్గింపు లాంటిటివి పరిగణనలోకి తీసుకుని రేటు మాట్లాడాలి. బడ్జెట్‌ను నిర్ణయించేటప్పుడు నాణ్యత, బైక్ కాలపరిమితి, బ్రాండ్ ధర లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
కంపెనీ :
సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు విషయంలో పరిగణించాల్సిన ముఖ్యమైన విషయం మంచి బ్రాండ్‌ను ఎంచుకోవడం. బైక్ కొనుగోలు చేసిన తర్వాత సర్వీస్, బీమా, ఇతర విలువ ఆధారిత సేవలపై దృష్టి పెట్టాలి. వీటన్నింటినీ ఒకే చోట ఉంచే బ్రాండ్‌ను ఎంచుకోవడం ముఖ్యం
అధ్యయనం:
కొనుగోలు చేయాలనుకునే ద్విచక్ర వాహనానికి సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లోనే శోధించాలి. బైక్ మోడల్ / బ్రాండ్.. అది మన అవసరాలకు తగ్గట్టుగా సరిపోతుందా.. లేదా అనే విషయాలను సేకరించాలి. కస్టమర్ ఫీడ్‌బ్యాక్, రివ్యూ స్కోర్‌లను కూడా చెక్ చేయాలి.
మోసాల పట్ల జాగ్రత్త వహించండి:
సెకండ్ హ్యాండ్ బైక్ మార్కెట్ చాలా వరకు మోసపూరితంగా ఉంటాయి. కాబట్టి మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించండి. ఇక్కడ విస్తృతమైన అవగాహన అవసరం. అంతేకాకుండా పేరున్న డీలర్ల నుంచి బైక్‌లను కొనుగోలు చేయడం మంచిది.
హోమ్ టెస్ట్ రైడ్:
కొనుగోలు లావాదేవీని ఖరారు చేసే ముందు, వాహానాన్ని ట్రయల్ రన్‌కు తీసుకోవాలి. మీరు ఎంచుకున్న బైక్.. రైడ్ చేయడానికి ఎంత సౌకర్యంగా ఉంది, బ్రేక్‌లు, ఇతర భాగాలు సరిగా పనిచేస్తున్నాయా? లేదా? అనే విషయాలపై శ్రద్ద వహించాలి. లాక్‌డౌన్ సమయంలోనూ ద్విచక్ర వాహనాల కంపెనీలు బైక్‌లను హోమ్ డెలివరీని కూడా చేస్తున్నాయి. ఇలాంటి సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. బైక్‌లపై పూర్తిగా అవగాహాన ఉన్న వారితో టెస్ట్ రైడ్ చేయించాలి.
డాక్యుమెంట్ వెరిఫికేషన్:
సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేసే ముందు బీమా, ఆర్‌సి బుక్, ఛేసిస్ నంబర్, తయారీ తేదీ,పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి అన్ని సంబంధిత పత్రాలను ధృవీకరించడం తప్పనిసరి. మీరు కారుపై గతంలో రుణం తీసుకున్నట్లయితే, మీరు తప్పనిసరిగా బ్యాంక్ హైపోథెకేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. RTO కార్యాలయంలో వాహన పత్రాలను చెక్ చేయడం ద్వారా ద్విచక్రవాహనంపై ఏవైనా పోలీసు కేసులు నమోదు చేశారో లేదో తెలుసుకోవచ్చు . ఈ రోజుల్లో మోసాలకు ఆస్కారం ఎక్కువ కాబట్టి డాక్యుమెంట్స్‌ను, వినియోగదారులను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి.
వారంటీ వ్యవధి:
సెకండ్ హ్యాండ్ బైక్ ఎంచుకున్నప్పుడు, వారంటీ గడువు ముగింపు తేదీ, మార్పిడి వ్యవధిని చెక్ చేయడం మంచిది. ఇలా చేయడం ద్వారా బైక్ నాణ్యత సంతృప్తికరంగా లేకుంటే మీరు కొనుగోలు చేసిన బైక్‌ను తిరిగి ఇవ్వవచ్చు లేదా మరో ద్విచక్ర వాహనంతో భర్తీ చేయవచ్చు.
టాపిక్