తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఇది మగవారికి మాత్రమే.. ఈ టిప్స్ కచ్చితంగా పాటించాలి!

ఇది మగవారికి మాత్రమే.. ఈ టిప్స్ కచ్చితంగా పాటించాలి!

HT Telugu Desk HT Telugu

21 April 2022, 21:47 IST

google News
    • మగవారు వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. మగవారికి ఆయా భాగాల్లో వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సమస్యలు అధికంగా ఉంటాయి. అందుకే ఈ చిట్కాలు పాటించండి..
Men's Hygiene Tips
Men's Hygiene Tips (Unsplash)

Men's Hygiene Tips

చాలా మంది పురుష మహానుభావులు శుభ్రతకు బ్రాండ్ అంబాసిడర్‌లా ఉంటారు. అయినప్పటికీ ఇంకా చాలా మంది పురుషులు తమ వ్యక్తిగత పరిశుభ్రత గురించి అస్సలు పట్టించుకోరని కొన్ని డిజిటల్ రిపోర్టుల్లో పేర్కొన్న డేటా ప్రకారం ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పురుషుల్లో లైంగిక అనారోగ్యం, ఫిట్‌నెస్‌ దెబ్బతినడం వారి వ్యక్తిగత అపరిశుభ్ర జీవనశైలే కారణం అని చెబుతున్నారు. పురుషులు తమకోసం తాము సమయం కేటాయించుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని గుర్తించాలి. వ్యక్తిగత పరిశుభ్రత వలె సన్నిహిత పరిశుభ్రతకూ ప్రాధాన్యత ఇవ్వాలి అని సూచిస్తున్నారు.

వేడికాలంలో అధిక చెమట, దుర్వాసన, దురద, దద్దుర్లు, మొటిమలు మొదలైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పురుషులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

గ్రూమింగ్: 

పురుషులకు శరీర భాగాలపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని తొలగించుకోవాలి. చంకల్లో ఇంకా సన్నిహిత భాగాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. సున్నిత ప్రాంతాలలో షేవ్ చేయడానికి ఎప్పుడూ రేజర్‌ని ఉపయోగించవద్దు ఎందుకంటే ఇది చికాకు, దురదను కలిగిస్తుంది. ఇతర సమస్యలకు దారితీస్తుంది. జాగ్రత్తగా ట్రిమ్ చేసుకోవడమే మేలు. వెంట్రుకలు తొలగించుకున్న తర్వాత మళ్లీ స్నానం చేయండి. అప్పుడప్పుడూ వేడినీటితో షవర్ స్నానం చేయండి.

మాయిశ్చరైజింగ్: 

షేవ్ చేసుకున్న తర్వాత సాఫ్ట్ బాడీ లోషన్‌ను ఉపయోగించవచ్చు. షేవింగ్ చేయాల్సి వస్తే కచ్చితంగా నురుగు లేదా క్రీమ్ రాయండి. షేవింగ్ పూర్తయిన తర్వాత ఆ ప్రాంతాన్ని మాయిశ్చరైజ్ చేయండి. చర్మం పొడిబారినట్లు ఉంటే చికాకు కలుగుతుంది. కాబట్టి మాయిశ్చరైజ్ ద్వారా ఆ ప్రాంతాన్ని తేమగా ఉంచడం చాలా అవసరం.

ఇంటిమేట్ వాష్‌:

 సాధారణంగా సబ్బుల్లో ఉండే ఆల్కలీన్‌ గుణాలు చర్మంలోని pHని మారుస్తాయి. కాబట్టి దురద లాంటి అంటువ్యాధులు సోకే అవకాశం ఉంది. సన్నిహిత ప్రాంతం చాలా సున్నితమైనది, కాబట్టి సువాసనలు లేని తేలికైన నురగ కలిగిన పురుషుల ఇంటిమేట్ వాష్‌ను ఉపయోగించండి.

లోదుస్తులు: 

ఎల్లప్పుడూ శుభ్రమైన లోదుస్తులు ధరించడం చాలా ముఖ్యం. అండర్ గార్మెంట్స్ నాణ్యత విషయంలో రాజీపడకూడదు. సింథటిక్ బదులుగా కాటన్ బట్టతో చేసిన అండర్ వేర్ లను ఎంచుకోండి. తేలికపాటి ఫాబ్రిక్ మీ ప్రైవేట్ ప్రాంతాన్ని పొడిగా ఇంకా చల్లగా ఉంచుతుంది. అండర్ వేర్ సరిగ్గా లేకపోతే చమట, దురద కలగడంతో పాటు ఆ ప్రాంతంలో వేడి వాతావరణం కారణంగా లైంగిక సామర్థ్యం దెబ్బతింటుంది.

క్లీనింగ్ జాబ్: 

మీ ప్రైవేట్ పార్టును ఎప్పుడూ శుభంగా ఉంచుకోవాలి. శారీరకంగా కలవడానికి ముందు, ఆ తర్వాత కూడా ఆ పార్టును నీటితో శుభ్రపరుచుకోవాలి. హస్త ప్రయోగం చేసుకున్న తర్వాత కూడా శుభ్రపరుచుకోవాలి. అలాగే ఉంచుకుంటే ఫిమోసిస్ లాంటి వ్యాధులు వస్తాయి, సుఖవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

చివరగా చెప్పేదేంటంటే.. శుభ్రంగా ఉండండి, శుభ్రమైనది తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి

టాపిక్

తదుపరి వ్యాసం