తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Care : ఈ ఫ్రూట్స్ మీ డైట్​లో చేర్చుకోండి.. హెయిర్​ గ్రోత్​ మీరే చూస్తారు..

Hair Care : ఈ ఫ్రూట్స్ మీ డైట్​లో చేర్చుకోండి.. హెయిర్​ గ్రోత్​ మీరే చూస్తారు..

30 July 2022, 10:43 IST

google News
    • Hair Care Tips : వర్షాకాలంలో జుట్టు రాలేపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. స్కాల్ప్ సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అయితే ఈ సమస్యను తప్పించుకోవాలంటే.. లోపలనుంచి తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. అయితే కొన్ని ఫ్రూట్స్​ని మీ డైట్​లో యాడ్​ చేసుకుంటే.. మీ హెయిర్​ ఆరోగ్యంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు.
జుట్టు సంరక్షణ
జుట్టు సంరక్షణ

జుట్టు సంరక్షణ

Hair Care Tips : జుట్టు రాలడం అనేది అన్ని వయసుల వారికి ఆందోళన కలిగించే విషయం. ఒత్తిడి, కాలుష్యం, హానికరమైన రసాయనాలు వంటి కారకాలు మీ జుట్టును బలహీనపరుస్తాయి. లేదా వాటిని దెబ్బతీస్తాయి. జుట్టు ఆరోగ్యం, నాణ్యతను మెరుగుపరచడంలో మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. దీనిలో భాగంగా పండ్లను మీ డైట్​లో చేర్చుకోవాలి అంటున్నారు నిపుణులు. పండ్లలో ఫైబర్, విటమిన్ల అద్భుతమైన మూలం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని వెల్లడించారు. అయితే ఈ పండ్లు జుట్టు సంరక్షణలో మీకు ఉపయోగపడతాయని తెలిపారు. అవేంటో మీరు తెలుసుకని హెయిర్​ని హెల్తీగా చేసుకోండి.

అరటిపండు

సహజ నూనెలు, విటమిన్లు, పొటాషియం సమృద్ధిగా ఉన్నందున అరటిపండ్లు జుట్టు చిట్లడం, స్ప్లిట్ ఎండ్స్​కు చికిత్స చేయడంలో గ్రేట్​గా సహాయం చేస్తాయి. ఇవి చుండ్రును కూడా నివారిస్తాయి. స్కాల్ప్ రంధ్రాలను అన్‌లాగ్ చేసి.. హెయిర్​ని హెల్తీగా చేస్తుంది.

అరటిపండ్లను తినడంతో పాటు.. మీరు వాటిని తేనెతో కలిపి పేస్ట్ లాగా చేసి.. హెయిర్​కు మాస్క్​లా అప్లై చేసుకోవచ్చు. అనంతరం దానిని చల్లటి నీటితో శుభ్రం చేయాలి.

ఆపిల్

రోజుకో యాపిల్ తింటే హెయిర్​ ఫాల్​ కచ్చితంగా ఆగుతుంది. యాపిల్స్​లోని ఎపిథీలియల్ కణాలలో జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. అవి ప్రోసైనిడిన్ B-2 ను కలిగి ఉంటాయి కాబట్టి హెయిర్​కి చాలా మంచిది. జుట్టు సాంద్రతను పెంచి, వాల్యూమ్‌ను పెంచడానికి ఇవి గొప్పగా పనిచేస్తాయి.

యాపిల్స్‌ను నేరుగా తినవచ్చు. సలాడ్‌లలో కలిపి తీసుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసంతో మిక్స్ చేసి.. ఆ పేస్ట్ ను మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుతుంది.

ద్రాక్ష

ప్రొసైనిడిన్స్‌లో యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మీ డ్యామేజ్ హెయిర్​ని చికిత్స చేస్తాయి.

ద్రాక్షలో మంచి పరిమాణంలో ప్రొసైనిడిన్‌లు ఉంటాయి. ఇవి మీ జుట్టు కుదుళ్లకు నష్టం కలిగించడాన్ని, జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి జుట్టు కుదుళ్ల వాపును కూడా తగ్గించగలవు.

మీరు ద్రాక్షను నేరుగా తీసుకోవచ్చు. లేదా జ్యూస్ తయారుచేసుకుని తాగవచ్చు. లేదా వాటిని సలాడ్స్​లో చేర్చవచ్చు.

ఉసిరికాయ

ఉసిరికాయలు చాలా సంవత్సరాలుగా జుట్టు చికిత్స, స్కాల్ప్ సమస్యలకు ఉపయోగిస్తున్నారు. మెరిసే జుట్టును కావాలనుకునేవాళ్లు కచ్చితంగా దీనిని ఉపయోగించవచ్చు.

ఇవి హెయిర్ పిగ్మెంట్‌ను మెరుగుపరుస్తాయి. జుట్టు నెరసిపోకుండా ఉండేందుకు సాధారణంగా హెయిర్ ఆయిల్స్‌లో ఉపయోగిస్తారు.

క్రమం తప్పకుండా అప్లై చేస్తే.. రంగు మారడానికి సిద్ధంగా ఉన్న హెయిర్​ను రిపైర్​ చేసి.. నలుపు చేస్తాయి. అంతేకాకుండా మీ తల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

టాపిక్

తదుపరి వ్యాసం