For Better Sleep : నిద్రలేమి సమస్యలా ? అయితే వీటిని తాగేయండి..
16 July 2022, 16:52 IST
- వివిధ సమస్యలతో చాలా మంది నిద్రలేక ఇబ్బందులు పడతారు. సరైన నిద్రలేకపోతే.. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పాలల్లో కొన్ని కలిపి తీసుకుంటే మెరుగైన నిద్రపొందవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుని.. మీరు కూడా హాయిగా పడుకోండి.
మంచి నిద్ర కావాలంటే ఇవి తాగండి..
For Better Sleep : మంచి నిద్ర అనేది మనస్సు, శరీరాన్ని తాజాగా ఉంచడంతోపాటు వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది. అయితే చాలా మందికి నిద్ర విషయంలో రకరకాల సమస్యలు ఉంటాయి. దీనివల్ల చాలామంది మెంటల్‌గా, ఆరోగ్యంగా.. ఇబ్బందులు పడతారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. కొన్ని ఆహారాలు ఈ సమస్యను తగ్గించుకోవడానికి.. ఉపయోగపడతాయి అంటున్నారు.
అశ్వగంధ
అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది సహజంగా ట్రైఎథిలిన్ గ్లైకాల్‌ను కలిగి ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మంచి నిద్ర కోసం మీరు పడుకునే 30 నిమిషాలు ముందు దీనిని తీసుకోవచ్చు.
బాదం
బాదంలో ఫైబర్, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. బాదం మెగ్నీషియంకు మంచి మూలం. ఇది నిద్ర-సహాయక కారకం అయిన మెలటోనిన్ నియంత్రణకు అవసరం. మెగ్నీషియం మీ కండరాలను కూడా సడలిస్తుంది. ఫలితంగా నిద్ర బాగా వస్తుంది.
గుమ్మడికాయ గింజలు
గుమ్మడికాయ గింజలను పెపిటాస్ అని కూడా అంటారు. ఇందులో ట్రిప్టోఫాన్‌తో పాటు జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ సెరోటోనిన్‌ను నిర్మించడంలో సహాయపడతాయి. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది.
జాజికాయ పాలు
ఒక గ్లాసు పాలలో చిటికెడు జాజికాయ కలిపి తీసుకోవడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. రెండూ మంచి నిద్రకు సహాయపడతాయి.
టాపిక్