Brain Teaser: ఇక్కడిచ్చిన చిత్రంలో ఒక తప్పు ఉంది, దాన్ని కేవలం తెలివైనవారు మాత్రమే కనిపెట్టగలరు, అది కూడా 10 సెకన్లలో
04 November 2024, 9:30 IST
- Brain Teaser: బ్రెయిన్ టీజర్లు ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి బ్రెయిన్ టీజర్లను ఇక్కడ మేము ఇచ్చాము. ఈ చిత్రంలో ఉన్న తప్పును కనిపెడితే మీరు తెలివైన వారే.
బ్రెయిన్ టీజర్
ఆప్టికల్ ఇల్యూషన్లు, బ్రెయిన్ టీజర్లు మెదడుకు పని చెబుతాయి. ఇవి మీలో శ్రద్ధగా గమనించడం, విశ్లేషించడం, నిర్ణయాలు తీసుకోవడం, ఒత్తిడి సమయంలో ఎలా పనిచేయాలో మెదుడుకు ట్రైనింగ్ ఇవ్వడం వంటివి నేర్పుతాయి. అందుకే కొన్ని రకాల బ్రెయిన్ టీజర్లను, ఆప్టికల్ ఇల్యూషన్లను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రస్తుతం మేము ఇక్కడ ఒక బ్రెయిన్ టీజర్ ను ఇచ్చాము. ఆ బ్రెయిన్ టీజర్ లో ఒక చిన్న తప్పు ఉంది. ఆ తప్పు ఏంటో కనబడితే మీరు చాలా తెలివైన వారిని అర్థం.
ఇక్కడ ఇచ్చిన చిత్రంలో పిల్లలు బెలూన్లతో ఆడుకుంటున్నాడు. ఒక వైపు చెట్టుకి ఆపిల్ పండ్లు ఉన్నాయి. దూరంగా కూడా కొన్ని చెట్లు ఉన్నాయి. అలాగే ఆకాశంలో అప్పుడే ఇంద్రధనస్సు విరిసింది. ఈ చిత్రం చూసేందుకు చాలా ఆహ్లాదంగా ఉంది. ఇప్పుడు మీరు మెదడుకు పనిపెట్టి ఆ చిత్రంలో ఉన్న తప్పును ఏమిటో కనిపెట్టాలి. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు. కేవలం 10 సెకండ్లలోనే మీరు తప్పు కనిపెడితే మీ ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ అని ఒప్పుకుంటాం.
ఏకాగ్రత, అధిక తెలివితేటలు కలవారు మాత్రమే ఈ బ్రెయిన్ టీజర్లను చాలా తక్కువ సమయంలో పరిష్కరించగలరు. చిత్రంలో ఇచ్చిన ప్రతి అంశాన్ని ఒక్కసారి ఏకాగ్రతగా చూడండి, తప్పు ఇట్టే దొరికేస్తుంది.
బ్రెయిన్ టీజర్ జవాబు
ఇక్కడ ఇచ్చిన బ్రెయిన్ టీజర్లో ఒక పెద్ద తప్పే ఉంది. అదే రెయిన్ బో కలర్స్. అంటే అక్కడ విరిసిన ఇంద్రధనస్సులోని రంగులు గజిబిజిగా ఉన్నాయి. ఇంద్రధనస్సులోని రంగులు ఒక వరుసలో ఉంటాయి. ఆ వరుస ఏంటో అందరికీ తెలిసిందే. దీన్నే షార్ట్ కట్ లో VIBGYOR అంటారు. అంటే మొదట వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ వరుసగా ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన రంగుల వరుసలో అక్కడ ఉన్న ఇంద్రధనస్సు లేదు. ఆ ఇంద్రధనస్సులోని రంగులు మారిపోయాయి. ఇదే ఈ బ్రెయిన్ టీజర్ లోని పెద్ద తప్పు.
బ్రెయిన్ టీజర్ ఉపయోగాలు
బ్రెయిన్ టీజర్లను తరచూ సాధించడం వల్ల విభిన్న కోణాల నుంచి ఒక విషయాన్ని చూసే అవకాశం మెదడుకు వస్తుంది. ఇది సమస్యలను అర్థం చేసుకోవడంతో పాటు పరిష్కారాలను కనుగొనేలా ఆలోచిస్తుంది. విమర్శనాత్మకంగా, సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని మెదుడుకు మీరు అందించినవారు అవుతారు. కాబట్టి బ్రెయిన్ టీజర్లను తక్కువగా చూడకుండా సాధించేందుకు ప్రయత్నించండి.