తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Personality Test: ఆప్టికల్ ఇల్యూషన్లో మీకు మొదట ఏం కనిపిస్తోందో చెప్పండి, దాన్నిబట్టి మీ వ్యక్తిత్వం గురించి చెప్పవచ్చు

Personality Test: ఆప్టికల్ ఇల్యూషన్లో మీకు మొదట ఏం కనిపిస్తోందో చెప్పండి, దాన్నిబట్టి మీ వ్యక్తిత్వం గురించి చెప్పవచ్చు

Haritha Chappa HT Telugu

27 March 2024, 10:46 IST

google News
    • Personality Test: ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్ల్యూషన్ ఉంది. దీన్నిబట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు. ఒకసారి ఈ పర్సనాలిటీ టెస్ట్ ను ప్రయత్నించండి.
ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్

ఆప్టికల్ ఇల్యూషన్

Personality Test: ఆర్టికల్ ఇల్యూషన్ల ద్వారా పర్సనాలిటీ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. మీరు ఈ చిత్రంలో చూసే మొదటి బొమ్మను బట్టి మీరు ఎలాంటి వారో అంచనా వేయవచ్చు. ఈ పర్సనాలిటీ టెస్టులు ద్వారా మీ మెదడులో కుడివైపు భాగం అధికంగా పనిచేస్తుందా? లేక ఎడమవైపు భాగం అధిపత్యాన్ని చూపిస్తుందో తెలుసుకోవచ్చు. కుడివైపు ఉన్న మెదడు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే మీకు భావోద్వేగాలు, సృజనాత్మకత ఎక్కువ అని అర్థం. అదే ఎడమవైపు ఉన్న మెదడు బాగా పనిచేస్తే తార్కికంగా విశ్లేషించే గుణం ఎక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు చిత్రంలో మీకు మొదట చేప లేదా మేఘం... ఈ రెండింటిలో మీ మెదడు మొదట దేన్ని గుర్తించిందో చెప్పండి. దాన్నిబట్టి మీ మెదడులో ఏ భాగం చురుగ్గా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు.

చేప

ఆప్టికల్ ఇల్యూషన్ చూడగానే మీకు వెంటనే చేప స్పూరించినట్లయితే మీ జీవితం సాధారణంగా సాగుతుంది. మీ జీవితంలో ప్రతిక్షణం విలువైనదని మీరు తెలుసుకుంటారు. కొత్త అవకాశాలను పొందేందుకు ఉత్సాహంతో ఉంటారు. ఏ పనినైనా కష్టపడి హృదయపూర్వకంగా చేస్తారు. నిండైన జీవితాన్ని జీవించాలని కలలుగంటారు.

మేఘం

మీరు మొదటగా మేఘాన్ని గమనించినట్లయితే మీకు బలం ఎక్కువ అని అర్థం. చాలా బలంగా, స్థిరంగా ఉంటుంది మీ వ్యక్తిత్వం. లోపల ఎంత దుర్భరంగా ఉన్నా కూడా బయటికి మాత్రం చాలా శక్తివంతంగా ఉన్నట్టే కనిపిస్తారు. దీనివల్ల ఇతరుల మాటలు చర్యల వల్ల మీరు భావోద్వేగాలకు గురవుతారు. బయటకి చెప్పుకోలేక ఇబ్బంది పడతారు. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు మీరు తరచూ మానసిక వేదనతో బాధపడే అవకాశం ఉంది.

మీకు చేప కనిపించినా లేక మేఘం కనిపించిన పైన చెప్పిన లక్షణాల్లో అన్నీ మీకు ఉండాలని లేదు. కొన్ని ఖచ్చితంగా కలిసే అవకాశం ఉంది. మీకు మొదటగా మేఘం కనిపించినట్టయితే మీ మెదడులో కుడి వైపు ఉన్న భాగం ఉత్సాహంగా పనిచేస్తున్నట్టు లెక్క. అదే ఆదిపత్యాన్ని చలాయిస్తుంది. అది తీసుకునే నిర్ణయాలే అమలయ్యేలా చేస్తుంది. అదే చేప కనిపించినట్లైతే మీరు తార్కికంగా ఆలోచిస్తారు. ప్రతి విషయాన్ని విశ్లేషిస్తారు. ఏదైనా సరే నెమ్మదిగా, సింపుల్ గా చేసేందుకు ఇష్టపడతారు

తదుపరి వ్యాసం