Tata Tiago XT NRG । మరిన్ని ఎక్‌ట్రా ఫీచర్లతో మరింత దృఢంగా విడుదలైన టాటా టియాగో!
03 August 2022, 14:54 IST
- టాటా మోటార్స్ తమ పాపులర్ కార్ మోడల్ టియాగోలో సరికొత్త NRG XT వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ. 6.42 లక్షలు.
Tiago XT NRG
టాటా మోటార్స్ నుంచి వచ్చిన పాపులర్ కార్ మోడల్ టియాగో NRG మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ సరికొత్త టియాగో NRG XT వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్-షోరూం వద్ద దీని ధర రూ. 6.42 లక్షలు. టియాగో ఇప్పుడు రెండు ట్రిమ్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అవి Tiago XT NRG అలాగే Tiago XZ NRG.
ఈ టియాగో మోడల్‌ను టాటా మోటార్స్ 2016లో ప్రారంభించింది. సరసమైన ధరలో లభిస్తుండటం, పటిష్టమైన పనితీరు కారణంగా తక్కువ సమయంలోనే సేల్స్ పెంచుకొని ఇండియాలో ఒక బెస్ట్ మోడల్ హ్యాచ్‌బ్యాక్‌గా అవతరించింది. ఇటీవలి సంవత్సరాలలో, గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో టియాగో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందటం కూడా దీని అమ్మకాలు పెంచడంలో సహాయపడింది.
తాజాగా లాంచ్ చేసిన Tiago XT NRG వేరియంట్ విషయానికి వస్తే గత సంవత్సరం టియాగో మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త కారు మరింత డైనమిక్ వేరియంట్‌గా విడుదలైంది. ఈ కొత్త కారులో మరిన్ని ఫీచర్లు, కఠిమైన ఎక్స్‌టీరియర్ యాక్ససరీలను అదనంగా అందిస్తున్నారు.
2022 Tiago XT NRG ఇంజన్ కెపాసిటీ
సరికొత్త Tiago XT NRGలో 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 84 బిహెచ్‌పి పవర్ అలాగే 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ AMT ఆప్షన్లో లభిస్తుంది. టియాగో CNG ఆప్షన్లో కూడా ఉంటుంది. ఇది 73 PS శక్తి, 95 Nm టార్క్ అవుట్‌పుట్‌తో లభిస్తుంది.
టియాగో ప్రస్తుతం సెగ్మెంట్‌లో అత్యంత సురక్షితమైన కారు. సేఫ్టీ కిట్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ఇమ్మొబిలైజర్, రియర్ పార్కింగ్ అసిస్ట్, వెనుక కెమెరా, ఫాలో-మీ హోమ్ ల్యాంప్స్, ఫైర్ ప్రొటెక్షన్ డివైస్ , పంక్చర్ రిపేర్ కిట్ ఉన్నాయి.
ఇతర స్పెసిఫికేషన్లు
ఈ కొత్త మోడల్‌లోని కొన్ని ముఖ్య ఫీచర్లను పరిశీలిస్తే 14-అంగుళాల హైపర్‌స్టైల్ అల్లాయ్ వీల్స్, రగ్గడ్ బ్లాక్ క్లాడింగ్‌లు, రూఫ్ రైల్స్‌తో కూడిన ఇన్ఫినిటీ బ్లాక్ రూఫ్ వంటి డిజైన్ అంశాలు NRGకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇంకా కొత్త ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్‌లు లోపలి భాగంలో చార్‌కోల్ బ్లాక్ ఇంటీరియర్స్, హర్మాన్ నుంచి 3.5-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉన్నాయి.
టాపిక్