తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tata Neu ఇన్నింగ్స్.. ‘సూపర్ యాప్’ ఆవిష్కరణ!

Tata Neu ఇన్నింగ్స్.. ‘సూపర్ యాప్’ ఆవిష్కరణ!

HT Telugu Desk HT Telugu

07 April 2022, 18:19 IST

google News
    • టాటా గ్రూప్ సూపర్ యాప్, డూపర్ యాప్ అంటూ Tata Neu పేరుతో ఒక కొత్త యాప్‌ను ప్రారంభించింది. అది ఎందుకు.. ఏమిటి దీనితో ఉపయోగం, ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి
Tata Neu app launched
Tata Neu app launched

Tata Neu app launched

టాటా వారి సూపర్-యాప్ అంటూ ఎంతో హైప్ చేసిన టాటా న్యూ యాప్ (Tata Neu)ను టాటా గ్రూప్ గురువారం ఆవిష్కరించింది. గూగుల్ ప్లేస్టోర్ అలాగే యాపిల్ యాప్ స్టోర్‌లలో ఈ కొత్త యాప్ ఈరోజు (ఏప్రిల్ 7) లిస్టింగ్‌ చేశారు. అంటే నేటి నుంచే ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు వినియోగదారులకు అందుబాటులో ఉంది.

ఈ యాప్ గురించి టాటా గ్రూప్ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఈరోజు రాత్రి 7:30 గంటలకు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) - ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరిగే IPL మ్యాచ్‌లోనూ Tata Neu యాప్ ప్రకటనలు ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇంతకీ ఈ యాప్ దేని గురించి? అసలెలా పనిచేస్తుంది? దీనివల్ల ఉపయోగం ఏమిటి? అనే విషయాలపై ఇప్పుడు చర్చించుకుందాం.

Tata Neu యాప్ అనే ఒక మల్టీపర్పస్ యాప్. మనకు ఇదివరకే అందుబాటులో ఉన్న Paytm, Amazon, Flipkart తరహా యాప్‌ల లాగే ఇదీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా షాపింగ్ చేయడానికి, కిరాణా సామాగ్రితో పాటు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి, హోటెల్స్ బుకింగ్, ప్రయాణాలకు సంబంధించి టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

Tata Neu UPI ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చు. DTH బిల్లులు చెల్లించడానికి, మొబైల్ రీఛార్జ్‌లు, కిరాణా సామాగ్రి, మందులు, దుస్తుల కొనుగోలు, ఎలక్ట్రానిక్స్, ఇతర ఎన్నో సేవల కోసం చెల్లించవచ్చు. ఇందులో IPL అప్డేట్స్ కూడా పొందవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే వివిధ యాప్‌లను ఉపయోగించి చేసే పనులను ఈ ఒక్క యాప్ ద్వారా చేసుకోవచ్చు

వినియోగదారులు Tata Neu యాప్ ద్వారా కొనుగోలు చేసినా ప్రతీసారి వారి ఖాతాలో NeuCoins రివార్డ్ ఇస్తుంది. ఒక్కో కాయిన్ ఒక రూపాయికి సమానం. ఇలా పోగిచేసిన డబ్బును వినియోగదారులు తిరిగి రీడీమ్ చేసుకోవచ్చు అని కంపెనీ పేర్కొంది.

టాపిక్

తదుపరి వ్యాసం