తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ravva Utappam | కొంచెంగా క్రిస్ప్రీ, కొంచెం స్పాఫ్ట్, ఎంతో టేస్టీగా రవ్వ ఉతప్పం!

Ravva Utappam | కొంచెంగా క్రిస్ప్రీ, కొంచెం స్పాఫ్ట్, ఎంతో టేస్టీగా రవ్వ ఉతప్పం!

HT Telugu Desk HT Telugu

10 July 2022, 9:01 IST

google News
    • కొంచెం క్రిస్ప్రీగా, కొంచెం స్పాఫ్ట్‌గా రవ్వ ఉతప్పం తింటూ వేడివేడిగా మసాలా చాయ్ సిప్ చేస్తుంటే ఈ వర్షాకాలంలో అది మంచి కాంబినేషన్ అవుతుంది. మరి రవ్వ ఉతప్పం ఎలా చేసుకోవాలో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
Ravva Utappam
Ravva Utappam

Ravva Utappam

బయట వర్షం పడుతున్న వేళ ఒక కప్పు వేడి మసాల చాయ్ సిప్ చేస్తూ మరొవైపు వేడివేడిగా ఏదైనా మంచి అల్పాహారం తింటూ ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు? అయితే ఈరోజు ఆదివారం కాబట్టి. చాలా మందికి సెలవు ఉంటుంది. త్వరత్వరగా కాకుండా రుచికరంగా ఏదైనా చేసుకుని తినటానికి సమయం ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ కోసం మనకు సౌత్ ఇండియాలో ఎన్నో రకాల రుచికరమైన రెసిపీలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఉతప్పం కూడా చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే ఈ ఉతప్పం మీరు ఎప్పుడూ చేసేలా కాకుండా, రవ్వతో ఎప్పుడైనా చేసుకున్నారా? రవ్వతో ఉతప్పం చేసుకోవడం చాలా సులభం. వేడివేడిగా రవ్వ ఉతప్పం చేసుకొని కొబ్బరి చట్నీ కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. కొంచెం క్రిస్పీగా, కొంచెం మృదువుగా నోట్లో వేస్తే కరిపోయేలా ఉంటుంది.

రవ్వ ఉతప్పం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ రెసిపీని ఇచ్చాం మరి ఆలస్యం ఎందుకు? మీరు ట్రై చేసి చూడండి.

కావాల్సిన పదార్థాలు

  • రవ్వ – 1 కప్పు
  • ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
  • పెరుగు - 1/4 కప్పు,
  • టమోటో ముక్కలు - 1/2 కప్పు
  • క్యారెట్ తురుము - 1/4 కప్పు
  • పచ్చిమిర్చి – 2
  • అల్లం 1 అంగుళం ముక్క
  • తాజా కొత్తిమీర
  • నూనె అవసరం మేరకు
  • ఉప్పు రుచికి తగినంత

తయారు చేసే విధానం

  1. ముందుగా ఒక గిన్నెలో రవ్వను, పెరుగును కలపండి. పైనుంచి కొద్దిగా నీరు, కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత మిశ్రమాన్ని మూతపెట్టి 30 నిమిషాలు అలాగే ఉంచాలి.
  2. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా తురిమిన అల్లం అన్నీ కలిపి రవ్వ మిశ్రమంలో బాగా కలుపుకోపాలి. కొద్దిగా కొత్తిమీర కూడా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు తవాను వేడి చేసి, ఒక టీస్పూన్ నూనె పోసి, చెంచాతో మొత్తం తవాపై రాయాలి.
  4. తవా వేడయ్యాక అన్నీ కలిపిన రవ్వ మిశ్రమంను ఒక గరెటితో తవా మీద ఉతప్పంలాగా పరచండి.
  5. ఒక టీస్పూన్ నూనెను ఉతప్పం చుట్టూ వేయాలి. ఉతప్పం దిగువన ముదురు గోధుమ రంగు వచ్చేంతవరకు కాల్చి, అనంతరం అదే విధంగా మరోవైపు కాల్చండి.

అంతే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని టమాటో సాస్ లేదా చట్నీతో అద్దుకొని వేడివేడిగా తినండి.

టాపిక్

తదుపరి వ్యాసం