తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Military Mutton Curry Recipe : మనసు దోచే మిలటరీ మటన్ కర్రీ.. రెసిపీ ఇదే..

Military Mutton Curry Recipe : మనసు దోచే మిలటరీ మటన్ కర్రీ.. రెసిపీ ఇదే..

04 August 2024, 1:33 IST

google News
    • Military Mutton Curry Recipe : పండుగలొచ్చినా.. పబ్బమొచ్చినా.. దాదాపు నాన్ వెజ్ ఇష్టపడే ప్రతి ఇంట్లో మటన్ కచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో మటన్ కర్రీ లెవలే వేరు. అయితే మీరు కూడా మటన్ ప్రియులైతే.. ఈ మిలటరీ మటన్ కర్రీ కచ్చితంగా ట్రై చేయవచ్చు. 
మిలటరీ మటన్ కర్రీ
మిలటరీ మటన్ కర్రీ

మిలటరీ మటన్ కర్రీ

Military Mutton Curry Recipe : మిలటరీ మటన్ కర్రీని ఇడ్లీ, దోశ, దమ్ బిర్యానీ, రాగి ముద్ద లేదా అన్నం, రోటీ వంటి వాటితో కలిపి తీసుకోవచ్చు. కాస్త ఓపిగ్గా ఉంటే అద్భుతమైన, టేస్టీ మటన్ మీ ప్లేట్లో ఉంటుంది. ఇంతకీ మిలటరీ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* పచ్చిమిర్చి - 8

* మటన్ - 1/2 కిలో

* వెల్లుల్లి రెబ్బలు - 8

* అల్లం - 2 అంగుళాలు

* పెరుగు - 1 కప్పు

* ఉల్లిపాయలు - 3 (తరగాలి)

* కారం - 1 1/2 టేబుల్ స్పూన్

* పసుపు - 1 టీస్పూన్

* జీలకర్ర - 1 టీస్పూన్

* పుదీనా - 2 టేబుల్ స్పూన్లు (తరిగినవి)

కర్రీ కోసం..

* నూనె - 3 - 4 టేబుల్ స్పూన్లు

* దాల్చిన చెక్క - 1

* పచ్చి ఏలకులు - 4

* లవంగాలు - 2

* మిరియాలు - 10

* బే ఆకులు - 2

* ఉల్లిపాయలు - 3

* వాటర్ - 1 లీటర్

* ఉప్పు - తగినంత

* కొత్తిమీర ఆకులు - 1 కప్పు

* పచ్చిమిర్చి - 5 (పేస్ట్ చేయాల్సినవి)

* నెయ్యి - 2 టీస్పూన్లు

తయారీ విధానం

మిలటరీ మటన్ కర్రీకి కోసం.. వెల్లుల్లి, అల్లం పేస్ట్ చేయాలి. దానిని పక్కన పెట్టి.. మరో మిక్సర్ జార్‌లో కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్‌లా చేసి.. దీన్ని కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు ఓ గిన్నే తీసుకుని దానిలో మటన్ వేసి.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. అనంతరం పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, మిగిలిన పదార్థాలు వేసి బాగా కలిపి.. గంటసేపు అలాగే ఉంచండి.

ఇప్పుడు పాన్ తీసుకుని దానిలో నూనె వేసి.. దాల్చిన చెక్క, ఏలకులు, మిరియాలు, బే ఆకులు, ఉల్లిపాయలను వేసి వేయించాలి. అవి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. దానిలో మారినేట్ చేసిన మటన్ వేసి.. అధిక మంట మీద ఉడికించాలి. ఇప్పుడు నీళ్లు పోసి ఉప్పు వేయండి. దానిని ఇకపై ఉడకనివ్వండి. దానిపై కొత్తిమీర వేసి.. దానిపైన కొంచెం నెయ్యి వేయండి. అంతే మటన్ కర్రీ రెడీ.

తదుపరి వ్యాసం