తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Supermoon Blue Moon: ఆకాశంలో పెద్ద చందమామ.. సూపర్‌మూన్ బ్లూమూన్ ఏ సమయంలో, ఎక్కడ, ఎలా చూడొచ్చు?

Supermoon blue moon: ఆకాశంలో పెద్ద చందమామ.. సూపర్‌మూన్ బ్లూమూన్ ఏ సమయంలో, ఎక్కడ, ఎలా చూడొచ్చు?

18 August 2024, 14:20 IST

google News
  • Supermoon blue moon: ఈ సంవత్సరంలో మొదటి సూపర్ మూన్ ఈ సోమవారం రాబోతోంది. ఈ వారానికి ఇంతకంటే మంచి మంచి ప్రారంభం ఇంకేం ఉంటుంది.   అరుదైన సూపర్ మూన్ బ్లూ మూన్ ను ఎలా చూడాలో తెలుసుకోండి. మీరుంటున్న ప్రదేశంలో ఈ అరుదైన దృశ్యం ఏ సమయంలో చూడొచ్చో తెల్సుకోండి.

సూపర్ మూన్ బ్లూమూన్
సూపర్ మూన్ బ్లూమూన్ (File Photo)

సూపర్ మూన్ బ్లూమూన్

సూపర్ మూన్‌లు సాధారణంగా సంవత్సరానికి 3-4 సార్లు సంభవిస్తాయి. ఈ ఆగస్టు నెలలో సూపర్ మూన్, బ్లూ మూన్ కలిసి వచ్చే అరుదైన ఖగోళ సంఘటనను చూడటానికి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇది దశాబ్దానికి ఒకసారి మాత్రమే జరిగే సంఘటన. ఆగస్టులో వచ్చే పౌర్ణమికి ఇచ్చే సంప్రదాయ నామం 'స్టర్జన్ మూన్' కాబట్టి, ఈ సూపర్ మూన్ బ్లూ మూన్ ను 'స్టర్జన్ మూన్' అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం వరుసగా రాబోతున్న నాలుగు సూపర్ మూన్ లలో ఇది మొదటిది (తర్వాతివి సెప్టెంబర్ 18 న, అక్టోబర్ 17, నవంబర్ 15 న రానున్నాయి).

సూపర్ మూన్ బ్లూ మూన్ ను ఎప్పుడు చూడాలి:

అరుదైన సూపర్ మూన్ బ్లూ మూన్ లేదా 'స్టర్జన్ మూన్' ఆగస్టు 19, 2024 న కనిపించనుంది. రోజూ ఉండే చంద్రుని కాంతి కంటే సుమారు 30 శాతం ప్రకాశవంతంగా ఉంటుంది చందమామ. మీరుండే ప్రదేశం బట్టి, టైమ్ జోన్ ప్రకారం ఈ అద్భుత దృశ్యం కనిపించే సమయం మారుతుంది. ఆ వివరాలు చూడండి..

సూపర్ మూన్ బ్లూ మూన్ ను ఎక్కడ వీక్షించాలి:

  • ఉత్తర అమెరికా: వాళ్ల కాలమానం ప్రకారం ఆగస్టు 19 మధ్యాహ్నం 2:26 ఇడిటి (ఈస్టర్న్ డేలైట్ టైమ్) సూపర్ బ్లూమూన్ కనిపిస్తుంది. కానీ నాసా ప్రకారం, ఇది ఆదివారం ఉదయం నుండి బుధవారం తెల్లవారుజాము వరకు.. సుమారు మూడు రోజుల పాటు నిండుగా కనిపిస్తుంది.
  • భారతదేశం: ఆగస్టు 19 రాత్రి నుండి ఆగస్టు 20 తెల్లవారుజాము వరకు.
  • యూరప్: ఆగస్టు 18 సాయంత్రం నుండి ఆగస్టు 19 రాత్రి వరకు, ఆగస్టు 20 తెల్లవారుజాము వరకు.
  • ఆఫ్రికా: ఆగస్టు 18 సాయంత్రం నుండి ఆగస్టు 19 రాత్రి వరకు మరియు ఆగస్టు 20 తెల్లవారుజాము వరకు.

సూపర్ మూన్ బ్లూ మూన్ ను ఎలా వీక్షించాలి:

  • పాక్షిక చంద్రగ్రహణం తేదీ , సమయాన్ని మీ ప్రదేశంలో ఎప్పుడుందో ముందుగానే తెల్సుకోండి. దాంతో మీరు దానిని మిస్ అవ్వరు.
  • చీకటిగా ఉన్న ప్రదేశం ఎంచుకోండి. ముఖ్యంగా సిటీ లైట్లకు, లైట్ల కాలుష్యానికి దూరంగా ఉన్న ప్రదేశం ఎంచుకోండి.
  • మీ దగ్గర మంచి హై క్వాలిటీ కెమెరా ఉంటే ఆ దృశ్యాలని క్లిక్ మనిపించండి.
  • ముందుగానే మీ వ్యూయింగ్ స్పాట్ కు వెళ్లి చంద్రుడి వివిధ దశలను మిస్ కాకుండా చూసుకోవాలి.
  • బైనాక్యులర్లు లేదా టెలిస్కోపులు ఉంటే వాటిని ఉపయోగించండి. అవి మంచి వీక్షణా అనుభూతిని ఇస్తాయి.
  • మీ దగ్గర్లో ఏదైనా ఆస్ట్రానమీ క్లబ్ ఉంటే దాంట్లో చేరండి. వాళ్లు మంచి లూనార్ షో వ్యూ చూయిస్తారు.
  • కెమెరాతో చిత్రాలు తీయాలనుకుంటే మంచి లాంగర్ ఎక్స్‌పోజర్ కెమెరా వాడండి. స్మార్ట్ ఫోన్ వాడితే మ్యాన్యువల్ గానే ఎక్స్‌పోజర్ అడ్జస్ట్ చేసుకోండి.
  • బయటి వాతావరణం నేరుగా చంద్రుణ్ని చూడ్డానికి సహకరించకపోతే ఏదైనా లైవ్ స్ట్రీమింగ్ చూసి ఆనందించండి.

 

టాపిక్

తదుపరి వ్యాసం