యూఎస్ఏ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ-నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ అంతరిక్షంలో నిత్యం వేలాది ఫొటోలను తీస్తుంది. వీటిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు.
pexels
By Bandaru Satyaprasad May 19, 2024
Hindustan Times Telugu
అంతరిక్ష పరిశీలన, పరిశోధనల కోసం హబుల్ టెలిస్కోప్ ను 15 ఏళ్ల క్రితం నాసా స్పెస్ లోకి పంపింది. ఈ అధునాతన కెమెరా అతినీలలోహిత, కంటికి కనిపించని సుదూర ప్రాంతాల్లోని కాంతిని సైతం చిత్రీకరిస్తుంది.
pexels
అంతరిక్షంలో పరిశోధనల కోసం అధునాతన కెమెరా (ACS) 2002లో సర్వీసింగ్ మిషన్ 3B సమయంలో హబుల్ స్పేస్ టెలిస్కోప్‌లో ఏర్పాటు చేశారు. జనవరి 2007లో ఎలక్ట్రానిక్స్ వైఫల్యం రెండు సైన్స్ ఛానల్స్ విఫలమయ్యయాయి.
pexels
సర్వీసింగ్ మిషన్ 4 సమయంలో వ్యోమగాములు వైడ్ ఫీల్డ్ ఛానల్ (WFC)ని మరమ్మతు చేశారు. ఇది 2007కి ముందు ACS సైన్స్‌లో 70 శాతం మేర పనిచేస్తుంది. హై రిజల్యూషన్ ఛానెల్ కు మరమ్మతులు చేయడం సాధ్యపడలేదు.
pexels
వ్యోమగాములు కిందటి వారం 15 ఏళ్ల నాటి హబుల్ టెలిస్కోప్ లో వైడ్ ఫీల్డ్ కెమెరా 3ని ఇన్‌స్టాల్ చేశారు. 550 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ట్రిపుల్ స్టార్ సిస్టమ్-HP టౌ దాని చుట్టూ గ్యాస్, ధూళి మేఘాలను చిత్రీకరించింది.
pexels
వైల్డ్ ఫీల్డ్ ఛానల్-3 దాని ముందున్న వైడ్ ఫీల్డ్ కెమెరా-2 కంటే విస్తృతమైన ఫీల్డ్-ఆఫ్-వ్యూ, ఎక్కువ సున్నితత్వాన్ని కలిగి ఉంది. ఇది అతినీలలోహిత, కనిపించే, సమీప-ఇన్‌ఫ్రారెడ్ కాంతిలో యూనివర్స్ ను గమనిస్తుంది. నాసా పరిశోధలనలకు ఒక వంతెనగా పనిచేస్తుంది.
pexels
హబుల్ టెలిస్కోప్ క్లిక్ మనిపించిన అంతరిక్షం అద్భుత చిత్రం
pexels
నక్షత్రాలతో నిండిన ప్రదేశానికి వ్యతిరేక దిశలో మెరుస్తున్న సన్నని, గులాబీ-రేకుల వంటి ఫిలమెంట్స్ సూపర్నోవా అవశేషాలు SNR 0519. హబుల్ టెలిస్కోప్ నక్షత్రం పేలుడు లేదా డెత్ స్టార్ లో జరిగిన పరిణామాలను మనోహరంగా అందిస్తుంది.