Sunday Thoughts | మనం చేసే తప్పులపై క్లారిటీ ఉండాలి.. ఎందుకంటే..
17 April 2022, 8:00 IST
- మన తప్పులు మనం ఒప్పుకోవడం లేదా.. మన తప్పులు మనకి తెలియడమనేది కచ్చితంగా మంచి విషయం. ఎందుకంటే.. ఇది మనల్ని మరోసారి ఆ తప్పులు చేయకుండా.. వాటిని సరిదిద్దుకునేలా చేస్తుంది. కాబట్టి జీవితంలో మంచిగా ముందుకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా వారి తప్పులు గురించి తెలుసుకునే ఉండాలి.
సండే సందేశాలు
Motivational Stories | మనిషి తప్పులు చేయడం సహజం. కానీ చేసిన తప్పులు మళ్లీ చేయడమే అసహజం. చేసిన తప్పులనుంచి పాఠాలు నేర్చుకోని ముందుకు వెళ్లాలనే విషయం కచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. లేదంటే మన తప్పులను వేలు పెట్టి చూపేవారు ఎక్కువైపోతారు. వేరొకరు మన తప్పులను చూపించే లోపు.. మన తప్పులను మనం గుర్తిస్తేనే మనకు మంచిది. ఎవరో మనల్ని జడ్జ్ చేస్తే మనం త్వరగా తీసుకోలేము కూడా. సెల్ఫ్ రియలైజేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే.
ఒక్కోసారి తప్పులనేవి మన ప్రమేయం లేకుండా కూడా జరగవచ్చు. కానీ వాటి ప్రభావం మనపై ఎక్కువ ఉండొచ్చు. అలాంటి సమయంలో ఎవరి వల్ల తప్పులు జరిగాయి.. దేని వల్ల మనపై ఎఫెక్ట్ అనేది మనపై పడంది అనే విషయాలను ఆలోచించి.. మరోసారి వాటికి బలైపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మన తప్పులను మనం తెలుసుకుని సరిచేసుకుంటే.. వేరొకరు మన తప్పులను వేలెత్తి చూపే అవకాశం ఉండదు. కాబట్టి తప్పులు చేయండి. చేసిన తప్పులను సరిదిద్దుకోండి. చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేయకండి.
టాపిక్