తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation: జీవితంలో సక్సెస్ అవ్వాలని ఉందా? విజయవంతులు వాళ్ల వీకెండ్స్ గడిపేది ఇలాగే

Sunday motivation: జీవితంలో సక్సెస్ అవ్వాలని ఉందా? విజయవంతులు వాళ్ల వీకెండ్స్ గడిపేది ఇలాగే

21 July 2024, 5:00 IST

google News
  • Sunday motivation: వారాంతాన్ని విజయవంతమైన వ్యక్తులు ఎలా గడుపుతారో తెల్సుకుంటే మనమూ అదే బాటలో మన జీవితాన్ని మార్చుకోవచ్చు. వాళ్లు వారాంతాన్ని ఎలా గడుపుతారో చూడండి.

విజయవంతులు వీకెండ్ ఎలా ఉపయోగించుకుంటారు?
విజయవంతులు వీకెండ్ ఎలా ఉపయోగించుకుంటారు? (freepik)

విజయవంతులు వీకెండ్ ఎలా ఉపయోగించుకుంటారు?

వారాన్ని వారాన్ని విడదీసేవి శని, ఆదివారాలు. లేదంటే కలిపేవే అనుకుందాం. ఈ రెండ్రోజులు సరిగ్గా వాడుకుంటే మిగతా వారమంతా ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఉత్సాహంగా పనిలో నిమగ్నమవ్వచ్చు. సక్సెస్‌ఫుల్ పీపుల్ వాళ్ల వీకెండ్స్ ఎలా గడుపుతారో తెలుసా? దానివల్లే మిగతా వారంలో వాళ్లనుకున్న పనులు విజయవంతంగా చేయగలుగుతారట. వాళ్లు చేసే పనులేంటో చూడండి.

1. డిస్‌కనెక్ట్:

వీకెండ్ లో ఫోన్లు, మెయిళ్లు, ల్యాప్‌టాప్ వాడరట. వీకెండ్ మొత్తం పనికి సంబంధించిన పనులకు పూర్తిగా దూరంగా ఉండటం వీలుకాకపోతే కనీసం శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం దాకా అయినా ఈ నియమం ఫాలో అవ్వాలి. కనీసం వాకింగ్ వెళ్లినప్పుడు ఫోన్ తీసుకెళ్లకపోవడం, అవసరమైతేనే ఫోన్లు వాడటం లాంటివి చేయాలి.

2. వాలంటీర్:

వారాంతంలో వాలంటీర్ గా సేవలు అందించడానికి కొంత సమయం తప్పకుండా కేటాయిస్తారు సక్సెస్‌ఫుల్ పీపుల్. ఒక స్వచ్ఛంత సంస్థకోసమో, ఏదైనా సంస్థకోసం విరాళాలు జమకూర్చేందుకు పాల్గొనడమో లాంటి పనులు చేస్తారు.దానివల్ల జీవితం మీద సంతృప్తి పెరుగుతుంది. వాళ్లలాగే ఆలోచించే మరికొంతమందితో పరిచయం ఏర్పడుతుంది. ఒక మంచి నెట్వర్క్ తయారు చేసుకోడానికి కూడా ఇది సాయపడుతుంది.

3. వెకేషన్:

ప్రతి వారాంతం కాకపోయినా నెలలో ఒక్కసారయినా ఒక వెకేషన్ వెళ్తారు. దానివల్ల మానసిక ఉత్తేజం పెరుగుతుంది. కుటుంబంతోనూ బంధం బలపడుతుంది. జీవితం రంగులమయంగా అనిపస్తుంది. ఇది కష్టపడి పనిచేసేందుకు కొత్త శక్తి ఇస్తుంది.

4. ప్లానింగ్:

విజయవంతమైన వ్యక్తులు వాళ్లు నెల మొత్తం చేయాల్సిన పనులను ముందుగానే ప్లానింగ్ చేసుకుంటారు. చెప్పాలంటే ఒక సంవత్సరం గడిచేలోపు వాళ్లే చేయాలనుకుంటున్నారో కూడా వాళ్లకు ప్రణాళిక ఉంటుంది. అందుకే మీరు వీకెండ్ రోజు కనీసం ఈ వారంలో ఏ ఏ పనులు చేయాలనుకుంటున్నారో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. దీంతో వారమంతా ఉత్సాహంగా సాగుతుంది.

5. వ్యాయామం:

విజయం సాధించాలంటే మంచి ఆరోగ్యం ముఖ్యం. ఆఫీసుకు వెళ్లే రోజుల్లో వ్యాయామం చేయడం అందరికీ కుదరని పని. అందుకే కనీసం వీకెండ్ రోజుల్లో తప్పకుండా దానికోసం సమయం కేటాయించాలి. బద్దకంగా ఉండి వీకెండ్ గడిపేయడం కన్నా ఇలాంటి వాటికోసం కేటాయిస్తే చాలా సంతృప్తిగా రోజుల్ని వాడుకున్న అనుభూతి వస్తుంది చూడండి.

6. పనులకే కేటాయించరు:

వారం మొత్తం ఉతకకుండా ఉన్న బట్టలు, మరికొన్ని పనులు పూర్తి చేయడానికే వీకెండ్ అంతా వాడేయకూడదు. వీలైనంత తొందరగా ఈ పనులు పూర్తి చేసుకోవాలి. వీలైతే విశ్రాంతి తీసుకోవాలి. వీకెండ్ చివరిదాకా ఈ పనులను వాయిదా వేస్తూ ఉంటే వాటికోసమే వీకెండ్ గడిపినట్లు అనిపిస్తుంది. అందుకే ముందు అలా పెండింగ్‌లో ఉన్న పనులు చేసేస్తారు.

7. నచ్చిన పని:

పెయింటింగ్, గార్డెనింగ్, క్రాఫ్ట్స్ తయారు చేయడం.. ఇలా వాళ్లకిష్టమైన పనికోసం వారాంతంలో కొద్దిగా అయినా సమయం కేటాయిస్తారు. గార్డెన్‌లో కలుపు తీసేసి అందంగా మార్చేస్తే వచ్చే సంతృప్తి వారం మొత్తం ఉంటుంది. వారాంతంలో క్రాఫ్ట్ తయారు చేసి వారం మొత్తం చూస్తూ ఉంటే అదో సంతోషం. కాబట్టి వారాంతంలో ఇష్టమైన పనులు చేయడానికి కాస్తైనా కేటాయించాలి.

కాబట్టి వీకెండ్‌ను విశ్రాంతి కోసం, మీకిష్టమైన పనుల కోసం, ఆరోగ్యం కోసం కేటాయించడం చాలా ముఖ్యం. కాస్త బద్దకంగా ఉండి విశ్రాంతి తీసుకుంటే పరవాలేదు కానీ, ఆ రెండ్రోజులు మిగతా వారం మెరుగుపర్చుకునేలా వాడుకుంటే అన్నింటా విజయం సాధిస్తారు.

తదుపరి వ్యాసం