తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sunday Motivation On Talk With Friends When You Are Feel Alone

Sunday Motivation | నీ స్నేహితులు ఉండగా ఒంటరితనమేలా మిత్రమా..

HT Telugu Desk HT Telugu

08 May 2022, 7:00 IST

    • ఈ మధ్య కాలంలో అందరికీ వర్క్​ ఫ్రమ్​ హోమ్​లు అవడం. ఇతరత్రా కారణాలతో ఇంట్లోనుంచి బయటకు రాకపోవడం వల్ల చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఒంటరితనాన్ని అనుభవిస్తూ.. తమలో తామే కృంగిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఓ ఫ్రెండ్ అవసరమంటున్నారు నిపుణులు.
ప్రతి ఫ్రెండ్ అవసరమేరా..
ప్రతి ఫ్రెండ్ అవసరమేరా..

ప్రతి ఫ్రెండ్ అవసరమేరా..

Sunday Motivation | ఈ రోజుల్లో ఒంటరితనం అనేది మన దినచర్యలో ఒకటిగా మారింది. చాలా వేగవంతమైన జీవితాన్ని గడుపుతున్న కారణంగా.. మనుషుల మధ్య సంబంధాలు తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఆందోళన, నిరాశ, అనేక ఇతర విషయాల వంటి అనేక మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలతో మీరు కూడా బాధపడుతున్నట్లయితే.. మీరు మీ స్నేహితులతో ఇంటరాక్ట్ అవ్వాల్సిన సమయం ఇది. ఆ చీకటి చెరల నుంచి బయటకు రావడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. అంతేకాకుండా మీ జీవితాన్ని సంతోషంగా గడపడానికి కూడా ఇది అనుమతిస్తుంది. బహుశా మీ స్నేహితుల సర్కిల్ చిన్నది కావచ్చు. కానీ.. ఆ స్నేహితులు మీకు అత్యంత సన్నిహితులు. ఈ విషయాన్ని మీరు గుర్తించుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Bank Account : చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం ఎలా?

Curd Face Packs : వీటితో కలిపి పెరుగు ఫేస్ ప్యాక్ తయారుచేస్తే మీ ముఖం మెరిసిపోతుంది

Beetroot Palya Recipe : అన్నం, చపాతీలోకి బీట్‌రూట్ పల్యా రెసిపీ.. గట్టిగా లాగించేయెుచ్చు

Foods For Anxiety : ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఆహారాలు తీసుకోవాలి

మీరు ఇష్టపడే వ్యక్తులతో మీ జీవిత మార్గంలో నడవడం ఎల్లప్పుడూ ఉత్తమ ఎంపికే. లేదంటే ఒంటరితనం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఒంటరిగా ఉన్న సమయంలో.. ఆ సమస్యల గురించి మీ స్నేహితులతో మాట్లాడటం ఉత్తమ ఎంపిక. ఆ సమయాల్లో మీ పక్కన ఉండేవారు ఉత్తమ వ్యక్తులు. ఎంత డిప్రెషన్‌లో ఉన్నా... స్నేహితులతో మాట్లాడిన తర్వాత కాస్త ఉపశమనం లభిస్తుంది. అందువల్ల మీరు ఏదైనా మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు.. స్నేహితుడిని సంప్రదించడానికి సంకోచించకండి.

టాపిక్