తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation : మనం మనుషులం.. తప్పులు చేస్తాం.. అర్థం చేసుకోండి..

Sunday Motivation : మనం మనుషులం.. తప్పులు చేస్తాం.. అర్థం చేసుకోండి..

22 January 2023, 4:00 IST

    • Sunday Motivation : ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదొక తప్పు చేస్తారు. అసలు తప్పు చేయని వారే ఉండరు. అలా అని చేసిన తప్పునకు వారి జీవితాంతం శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మంచివారు కూడా తప్పులు చేయాల్సి వస్తుంది. దాని అర్థం వారు చెడ్డవారు అని కాదు. వాళ్లు కూడా మనుషులే.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Sunday Motivation : చెడ్డవాళ్లే తప్పులు చేస్తారు. మంచివారు చేయరు అనేది తప్పుడు స్టేట్​మెంట్. తప్పులు చేసే వారు అంతా చెడ్డవారని కాదు. మంచివారు అస్సలు తప్పులు చేయరు అని కాదు. మనిషి అన్నాక ఏదొక టైమ్​లో కచ్చితంగా తప్పు చేస్తాడు. లేదా తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. అంతమాత్రానా వాళ్లు చెడ్డవారని అర్థం కాదు. అలాంటివాటికి వాళ్లు జీవితాంతం శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తప్పు చేశామనే గిల్ట్​తో బతకాల్సిన పని లేదు. మనిషన్నాక తప్పు చేస్తాడు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. లేదు నేను తప్పు చేయను అని అనుకుంటున్నారా? అలా అనుకోవడం కూడా తప్పే అనే గుర్తించుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

Buttermilk : వేసవిలో మజ్జిగను ఇలా చేసి తాగితే చర్మం, జుట్టుకు చాలా మంచిది

Iskon khichdi Recipe : కొత్తగా ట్రై చేయండి.. ఇస్కాన్ కిచిడీ రెసిపీ.. చాలా టేస్టీ

Foundation Side effects: ప్రతిరోజూ ముఖానికి ఫౌండేషన్ అప్లై చేస్తున్నారా? ఇలా చేస్తే జరిగేది ఇదే

ప్రతిసారి మనమే కరెక్ట్.. ఎదుటివారిదే తప్పు అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే పరీక్షలు రాసే సమయంలో మనం కరెక్ట్ అనుకుంటూనే తప్పుగా సమాధానం ఇస్తాము. అలాగే మన జీవితంలో కూడా తెలియకుండానే కరెక్ట్ అనుకుంటూ కొన్ని తప్పులు చేసేస్తాము. చేస్తున్నప్పుడు అది తప్పు అని తెలియకపోవచ్చు కానీ.. చేసేశాక కచ్చితంగా మీకు ఏదొక సమయంలో తెలుస్తుంది. తప్పులు చేయడం మంచిదే కానీ.. పదే పదే చేసిన తప్పులు చేయడమే కరెక్ట్ కాదు. తప్పులు చేయాలి.. చేసిన తప్పులనుంచి తగిన గుణపాఠాలు నేర్చుకోవాలి.

అంతేకానీ చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చేయడమే మిస్టెక్. తప్పు నుంచి ఒప్పు ఏంటో నేర్చుకున్నప్పుడే జీవితం సరైన దారిలో వెళ్తుంది. మీరు అనుకున్నది పొందే అవకాశముంది. అలాగే మనం చేసే ఏ తప్పుకైనా జీవితాంతం బాధపడాల్సిన అవసరం లేదు. మనం చేస్తున్నప్పుడు కరెక్ట్ అనుకునే ఆ తప్పు చేసి ఉంటాము. లేదని తప్పని పరిస్థితుల్లో ఆ తప్పు చేయాల్సి వచ్చి ఉంటుంది. వీటిని అర్థం చేసుకుని.. మళ్లీ వాటిని రిపీట్ చేయకుండా.. జరిగిన తప్పుల వల్ల కలిగే నష్టం ఎక్కువ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి.

కొన్నిసార్లు చెడు ఎంపికల వల్ల మీరు భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చు. కానీ తెలిసి తెలిసీ ఎప్పుడూ తప్పుచేయకండి. పొరపాటు నుంచి పాఠాలు నేర్చుకోండి. తప్పులు చేయడం పూర్తిగా సరైనదే. మనలో ఎవరూ అతీంద్రియ శక్తులు కాదు. మానవ జాతి తప్పులు చేస్తూనే.. వాటిని పాఠాలు నేర్చుకుంటూ ఇప్పుడు ఈ స్థానంలో నిలబడింది. జీవితంలో అప్ డేట్ కావాలి అంటే.. మనం తప్పుల నుంచి నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే.. వారు చెడ్డవారని ట్యాగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వారు కూడా మనుషులే.. వారి పరిస్థితులు.. మైండ్ సెట్ వల్ల వారు ఆ తప్పు చేయాల్సి వచ్చిందని గ్రహించండి. మీకు వీలైతే వారికి సహాయం చేసి.. తప్పులు చేయకుండా వారిని రక్షించండి.