తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Skin Care Routine । చలికాలం ముగిసినట్లే.. వేసవిలో మీ చర్మ సంరక్షణ ఇలా ఉండాలి!

Summer Skin Care Routine । చలికాలం ముగిసినట్లే.. వేసవిలో మీ చర్మ సంరక్షణ ఇలా ఉండాలి!

HT Telugu Desk HT Telugu

21 February 2023, 13:05 IST

    • Summer Skin Care Routine: వాతావరణం వేడెక్కుతున్నప్పుడు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వేసవిలో చర్మ సంరక్షణ ఏ విధంగా ఉండాలో తెలుసుకోండి.
Summer Skin Care Routine
Summer Skin Care Routine (istock)

Summer Skin Care Routine

Summer Skin Care Routine: వాతావరణంలో కలిగే మార్పులు చర్మంపైనే ముందుగా ప్రభావం చూపుతాయి. ఇది వరకు చలికాలంలో చర్మం పొడిబారడం వంటి సమస్యలను చూశాము, వేసవి వచ్చిందంటే అందుకు భిన్నమైన పరిస్థితి ఉంటుంది. అధిక వేడితో చర్మం జిడ్డుగా మారుతుంది. ఫలితంగా చర్మంపై మొటిమలు, దద్దుర్లు ఏర్పడతాయి. ఎండవలన చెమట పెరిగి శరీరంపై చికాకును, దుర్వాసనను కలిగిస్తుంది. చర్మం కూడా నల్లబడుతుంది. అందువల్ల వేడి వాతావరణంలో చర్మం దెబ్బకుండా ముందుగానే జాగ్రత్తపడాలి. వేసవిలో చర్మ సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

హైడ్రేటెడ్ గా ఉండండి

వేడి కారణంగా శరీరం నీటిని కోల్పోతుంది. కాబట్టి ముందుగా నిర్జలీకరణాన్ని నివారించండి. వేసవిలో మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం- రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు త్రాగాలి. వేసవిలో నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. శరీరంలో నీటి శాతం సమృద్ధిగా ఉంటే అది చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.

ముఖం కడుగుతూ ఉండండి

వేసవిలో చల్లని నీటితో మీ ముఖాన్ని తరచుగా కడగాలి. ముఖంపై మొటిమలకు కారణం అయ్యే జిడ్డు పేరుకు పోకుండా శుభ్రపరుచుకోవాలి. రోజ్ వాటర్ ముఖంపై స్ప్రే చేసుకోవాలి. పొడి చర్మం ఉన్నవారు తక్కువ నురుగు, పిహెచ్ బ్యాలెన్స్ ఉన్న ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కోవాలి.

యాంటీఆక్సిడెంట్లు ఉత్పత్తులు మేలు

యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఉన్న చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. వాతావరణంలోని కాలుష్య కారకాలను శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇంకా చర్మం దెబ్బతినకుండా నిరోధించడానికి ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తుంది. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ పెరగాలంటే పుల్లని ఆహార పదార్థాలు, ఆకు కూరలు, గ్రీన్ టీ వంటివి తీసుకోవచ్చు.

చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయండి

వేసవిలో చర్మంలో పేరుకుపోయిన దుమ్ము, నూనెను శుభ్రం చేయడానికి వారానికి రెండుసార్లు మీ ముఖాన్ని స్క్రబ్ చేయండి. స్క్రబ్బర్ ఉపయోగించే ముందు మన ముఖానికి ఏది సరిపోతుందో చూసుకోవాలి. మీ మెడ , పెదాలను కూడా సున్నితంగా స్క్రబ్ చేయడం మర్చిపోవద్దు.

సన్‌స్క్రీన్ వాడకం

వేసవిలో ఏ కారణం చేతనైనా సన్‌స్క్రీన్ ఉపయోగించడం మర్చిపోవద్దు. సూర్యుడి UV కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. సన్‌టాన్ వలన చర్మం రంగు మారుతుంది. ఇంకా చర్మంపై ముడతలు, వృద్ధాప్య సంకేతాలు, నల్ల మచ్చలను పెంచుతుంది. అందువల్ల, SPF 30 కంటే అధికంగా ఉండే సన్‌స్క్రీన్ లోషన్‌లను ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. చర్మాన్ని శుభ్రపరుచుకున్న తర్వాత సన్‌స్క్రీన్ ఉపయోగించాలి.

ఎక్కువ మేకప్ వేసుకోవద్దు

వేసవిలో మేకప్ చాలా తక్కువగా ఉండాలి. ఎక్కువ మేకప్ వేసుకోవడం వల్ల చర్మంపై రంధ్రాలు మూసుకుపోతాయి. అలాగే వివిధ ఉత్పత్తులు ఎండకు కరిగి జిడ్డుగా మారతాయి. ఇవి మొఖంపై మొటిమలతో పాటు దురద, మచ్చలు, దురద వంటి సమస్యలను కలిగిస్తాయి.

రెండుసార్లు స్నానం చేయండి

వేసవిలో రెండుసార్లు స్నానం చేయడం మంచిది. విపరీతమైన చెమట కారణంగా శరీరాన్ని శుభ్రపరచడానికి, శరీర దుర్వాసనను నివారించడానికి రెండుసార్లు స్నానం చేయడం అవసరం. వేసవిలో దుమ్ము ఎక్కువ ఉంటుంది. చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, మలినాలను శుభ్రం చేయడాని రోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేయాలి.

టాపిక్

తదుపరి వ్యాసం