Stress Free Holiday : మీ హాలీడేని ఎంజాయ్ చేయండి.. స్ట్రెస్ తీసుకోకండి..
14 December 2022, 9:06 IST
- Stress Free Holiday : రోజూ ఆఫీస్‌కి వెళ్తూ.. లేదా స్కూల్, కాలేజికి వెళ్తూ స్ట్రెస్ తీసుకోవడం కామనే. కానీ కొందరు సెలవు రోజుల్లో కూడా తెగ స్ట్రెస్ తీసేసుకుంటారు. సెలవులు ఉన్నవే ఒత్తిడి నుంచి ఫ్రీగా ఉండాలని తీసుకునేవి. సెలవుల్లో మీ స్ట్రెస్‌ని ఇలా దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
హాలీడేని ఎంజాయ్ చేయండి
Stress Free Holiday : మీరు మీ పని నుంచి బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారా? లేదా ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారా? మీ సెలవుదినం అనేది మీకు శాంతిని.. ఆనందాన్ని.. మీ సెల్ఫ్ గ్రూమింగ్‌కి టైమ్ స్పెండ్ చేసేలా ఉండాలి. అంతేకానీ అన్ని పనులను మీద వేసేసుకుని.. నార్మల్ డే కన్నా బిజీగా ఉండాలని అర్థం కాదు.
పని ఎక్కువైనప్పుడే మనం పని నుంచి బ్రేక్ తీసుకుంటాము. అలాంటిది ఆరోజే ఇతర పనుల పేరుతో.. ఇంకా బిజీగా సమయాన్ని గడుపుతూ ఉంటాము. అయితే కొన్ని టిప్స్ పాటించడం వల్ల మీ పనులు పూర్తవుతాయి.. మీకు ఫ్రీ టైమ్ దొరుకుతుంది అంటున్నారు నిపుణులు. ఇవి మీ సెలవులను ఒత్తిడి లేకుండా ఆస్వాదించడానికి సహాయం చేస్తాయి అంటున్నారు ఇంతకీ ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన అలవాట్లు
సెలవులు వస్తూనే ఉంటాయి. అప్పుడు రిలాక్స్‌డ్‌గా.. హాయిగా మీ నచ్చిన ఫుడ్ తినండి. రుచికరమైన హెల్తీ ఆహారాన్ని తీసుకోండి. ఒకవేళ హెల్తీ ఫుడ్ కాకపోయినా.. ఏది తిన్నా లిమిట్‌గా తినండి. ఇలా చేయడం వల్ల మీరు మద్యపానం, ధూమపానం వైపునకు కాస్త తక్కువ వెళ్తారు.
చురుకుగా ఉండటానికి, మితంగా తాగడానికి.. మరింత సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. చక్కెర తీసుకోండి. అలాగే ప్రతి రాత్రి కనీసం ఏడు గంటలు నిద్రపోయేందుకు సిద్ధకండి. ఈ ఆరోగ్యకరమైన అలవాట్లకు కట్టుబడి ఉంటే మీరు ప్రశాంతంగా ఉంటారు.
చురుకుగా ఉండండి..
మీరు ఓ పనిలో పడి.. మీ వ్యాయామ సెషన్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వస్తే.. మీ పట్ల, మీ డైట్ పట్ల కఠినంగా ఉండకండి. బదులుగా.. నష్టాన్ని భర్తీ చేయడానికి మీ దినచర్యలో కొన్ని ఆరోగ్యకరమైన కార్యకలాపాలను చేర్చుకోవచ్చు.
ఏ పని చేసినా.. దానిలో చురుకుగా ఉండాలనే నిర్ణయం తీసుకోండి. ఉదాహరణకు చురుగ్గా నడవండి లేదా మెట్లు ఎక్కి దిగుతూ ఉండండి. ఇవన్నీ మీ వ్యాయామాన్ని భర్తీ చేయడంలో మీకు సహాయం చేస్తాయి.
షెడ్యూల్ ఫిక్స్ చేసుకోండి..
సెలవులు అంటే మీ పని షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకోవడం. అంతేకానీ మీ రోజువారీ షెడ్యూల్‌తో రాజీ పడాలని కాదు. ప్రతిరోజూ చేయవలసిన పనుల జాబితాను ఫిక్స్ చేసుకోండి. ఈవెంట్‌లు, పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆచరణాత్మక విధానంతో మీ పనిని ప్లాన్ చేయండి.
లక్ష్యాలను నిర్దేశించడం, వాస్తవికంగా ఉండటం మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోండి. మీ పనులను ఆపకుండా.. మీ టైమ్‌ని మీకోసం స్పెండ్ చేసేలా మీ రోజుని ప్లాన్ చేసుకోండి.
హాలిడే షాపింగ్
కొన్నిసార్లు హాలిడే షాపింగ్ మనకు స్ట్రెస్ ఇస్తుంది. అయ్యే అనవసరంగా వాటిని కొనేశాను అని బాధపడకుండా.. మీకంటూ ఓ బడ్జెట్‌ను సెట్ చేసుకోండి. అప్పుడు ఎన్ని ఆఫర్లు ఉన్నా.. ఎన్ని నచ్చిన బట్టలు ఉన్నా.. మీ లిమిట్లో మీరు ఖర్చు చేస్తారు.
అధిక ఖర్చును నివారించడానికి ముందుగా బడ్జెట్‌ను సెట్ చేయండి. లేదంటే మొత్తం నెల అంతా ఆ షాపింగ్ గురించి బాధపడాల్సి వస్తుంది.
దేనివల్ల ఒత్తిడి వస్తుంది?
మీకు హాలిడే ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఎక్కువ ఏది ఒత్తిడికి గురిచేస్తుందో గుర్తించండి. పర్సనల్ స్ట్రెస్? ప్రొఫెషనల్ స్ట్రెస్? ఇలా ఏది మిమ్మల్ని ఒత్తిడి గురి చేస్తుందో గుర్తించి.. దానిని క్లియర్ చేసుకోండి.
మీరు హాలిడే తీసుకున్నప్పుడు.. మీ కుటుంబంలోని ఎవరైనా మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తే.. వారితో కలిసి గడిపే సమయాన్ని పరిమితం చేయండి. ఆఫీస్ స్ట్రెస్ అయితే.. మీ పెండింగ్ వర్క్స్ లేకుండా చూసుకోండి. మీ హాలిడే అయ్యేవరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయవద్దని మీ కొలిగ్స్కి చెప్పేయండి.
టాపిక్