తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Easter Feast | ఈస్టర్ విందు కోసం స్పెషల్ స్ట్రాబెరీ చికెన్, దీని రుచి విభిన్నం

Easter Feast | ఈస్టర్ విందు కోసం స్పెషల్ స్ట్రాబెరీ చికెన్, దీని రుచి విభిన్నం

HT Telugu Desk HT Telugu

17 April 2022, 9:28 IST

google News
    • ఈస్టర్ అంటే ఉల్లాసంగా జరుపుకునే పండుగ. విందులు, వినోదాలు ఉంటాయి. అందుకోసమే ఒక ప్రత్యేకమైన వంటకాన్ని మీకు పరిచయం చేస్తున్నాం.
Strawberry Glazed Chicken
Strawberry Glazed Chicken (HT Photo)

Strawberry Glazed Chicken

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ జరుపుకునే ఈస్టర్ పండుగ ఈ సంవత్సరం ఏప్రిల్ 17న వచ్చింది. ఈ ఈస్టర్ శుభసందర్భంలో అందరూ విందులు, వినోద కార్యక్రమాలతో ఆనందంగా గడుపుతారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రత్యేకమైన స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ గ్లేజ్డ్ చికెన్‌ రెసిపీని పరిచయం చేస్తున్నాం. మీరు ఎప్పుడూ తినే చికెన్ వంటకాల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఇంకా ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. మీరు దీనిని ఒక్కసారి రుచిచూస్తే మళ్లీ మళ్లీ ఇదే కోరుకుంటారు. మరి ఈ ప్రత్యేకమైన చికెన్ వంటకానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి, దీనిని ఎలా తయారుచేసుకోవాలో రెసిపీని కింద ఇచ్చాము. వీలైతే ప్రయత్నించి చూడండి.

కావలసినవి:

1 చికెన్ బ్రెస్ట్

1/2 కప్పు స్ట్రాబెర్రీ సిరప్

చిటికెడు రోజ్మేరీ

1 గ్రాము వెల్లుల్లి

1/2 టేబుల్ స్పూన్ నూనె

2 టీస్పూన్లు చికెన్ స్టాక్

రుచికి తగినంత ఉప్పు, మిరియాలు

తయారీ విధానం

చికెన్ బ్రెస్ట్‌ను రెండువైపుల నుంచి చదునుగా, మృదువుగా మార్చండి. ఇందుకోసం 'మీట్ టెండరైజర్‌' అనే పరికరాన్ని ఉపయోగించండి. లేదా మీకు అందుబాటులో ఉండే వేరే ఏదైనా చెంచాను ఉపయోగించవచ్చు. ఉదాహారణకు నూనెలోంచి పూరీలు, గారెలు తీసే పొడవైన చెంచాను వాడవచ్చు.

మృదువుగా మారిన చికెన్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆపై స్ట్రాబెర్రీ సిరప్, నూనె, వెల్లుల్లి, రోజ్మేరీలను చికెన్ ముక్కలకు బాగాపట్టించండి.

ఈ దశలో చికెన్ కు ఉప్పు, మిరియాల పొడి బాగా కలిపి ఒక 15 నిమిషాల పాటు మ్యారినేడ్ చేయాలి.

ఇప్పుడు ఒక గ్రిల్ పాన్‌పై నూనె వేడిచేసి చికెన్‌ను రెండు వైపులా కొన్ని నిమిషాల పాటు వేయించండి. సూప్ లాగా మారేంత వరకు వేయించండి.

ఆపై చికెన్ స్టాక్, రోస్మరీ వేసి.. పై నుంచి ఉప్పు, మిరియాలు చల్లుకోవాలి. అంతే ప్రత్యేకమైన చికెన్ వంటకం రెడీ అయినట్లే.

దీనిని సర్వింగ్ ప్లేటలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం