Happy Easter 2022 | ఈస్టర్ శుభాకాంక్షలు.. ఈరోజుకున్న విశిష్టత తెలుసుకోండి!
17 April 2022, 6:17 IST
- ఈస్టర్ శుభాకాంక్షలు. ఈ రోజుకున్న విశేషం ఏమిటి? ఈస్టర్ ప్రాముఖ్యత, అసలు ఎందుకు జరుపుకుంటారు లాంటి అన్ని ఆసక్తికర విశేషాలను ఇక్కడ తెలుసుకోండి
Happy Easter 2022
ఈరోజు క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన పండుగ ఈస్టర్. గుడ్ ఫ్రైడే మొదలుకొని మూడవరోజు ఈస్టర్ వస్తుంది. ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యత ఇతర విశేషాలను తెలుసుకుందాం. క్రిస్మస్ మాదిరిగా కాకుండా ఈస్టర్‌కు నిర్ణీత తేదీ అంటూ లేదు. కానీ ఇది యేసును నమ్మే అందరూ ఒకచోట చేరి విందులు, వినోదాలతో వేడుకలు జరుపుకునే రోజు. ప్రార్థనలతో యేసును స్మరించుకునే రోజు. ఈ ఈస్టర్ రోజున ఈస్టర్ గుడ్లను రంగులతో అలంకరించి, పంపిణీ చేయడం.. ఆనందంగా ఆటలు ఆడటం సంప్రదాయం.
పవిత్ర బైబిల్ గ్రంథంలో పేర్కొన్న నిబంధన ప్రకారం, రోమన్లు యేసును శిలువ వేసిన మూడు రోజుల తర్వాత ఈస్టర్ సంభవిస్తుంది. యేసు పరమపదించిన మూడవరోజుకు ఆదివారం నాడు మళ్లీ ప్రాణాలతో తిరిగి వచ్చారు. ఈ శుభసందర్భంలో ఎంతో ఉల్లాసంగా జరుపుకునే పండుగ ఈస్టర్.
తేదీ:
ఈ సంవత్సరం ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజం ఈస్టర్ జరుపుకుంటుంది.
చరిత్ర:
ఈస్టర్ వెనుక ఉన్న కథ బైబిల్ నిబంధనల్లో ఉంది. 'దేవుని కుమారుడు'గా కొలుచుకునే యేసుకు రోమన్ చక్రవర్తి పోంటియస్ పిలేట్ మరణశిక్ష విధిస్తాడు. యేసుకు ముళ్ల కిరీటం నెత్తిన ధరింపజేసి ఆయనను శిలువ వేసిన తీరును స్మరించుకుంటారు. మానవాళి పాపాల ప్రక్షాళన కోసం యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేసుకుంటారు.
గురువారం రాత్రి యేసు చివరి భోజనం చేస్తారు, శుక్రవారం ఆయనను శిలువ చేయడంతో స్వర్గస్తులు అవుతారు. ఈరోజు పవిత్రతను తెలియజేస్తూ దీనిని గుడ్ ఫ్రైడేగా పిలిచారు. మూడవరోజు ఆదివారం నాడు ఈస్టర్ సంభవిస్తుంది. ఇది యేసు పునర్జన్మను సూచిస్తుంది. లోకంలోని చెడును, మరణాన్ని సైతం ఓడించిన స్వచ్ఛమైన దేవుడిగా యేసు అవతరిస్తారు. ధర్మం నశించిన రోజు దేవుడు మళ్లీ ఏదో ఒక రూపంలో తిరిగివస్తాడనే చాటేదే ఈస్టర్.
ఈ వారం అంతా క్రైస్తవులు పవిత్రంగా భావిస్తారు. ఈస్టర్ రోజున చాక్లెట్లతో నిండిన గుడ్లను పంపిణీచేసుకుంటారు. ఈ గుడ్లు కొత్త జీవితాన్ని, పునర్జన్మను సూచిస్తాయి. చర్చిలలో, క్రైస్తవుల ఇండ్లల్లో ఈస్టర్ లిల్లీ గుడ్లు అలంకరించుకుంటారు. ఈ నేపథ్యంలో వివిధ రకాల ఆటలు, కార్యకలాపాలు ఉంటాయి.
టాపిక్