Sprouted Onions :మొలకెత్తిన ఉల్లిపాయలు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?
22 May 2022, 17:01 IST
- Sprouted Onions Benefits: వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉల్లిపాయలు హీట్ స్ట్రోక్ నివారించడంలో సహాయపడుతాయి. అయితే మొలకెత్తిన ఉల్లిపాయలు ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Sprouted Onions
సాధరణంగా ప్రతి కూరలో ఉల్లిపాయలను ఉపయోగిస్తాం. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఉల్లిపాయలను కూరాలోనే కాకుండా వాటిని సలాడ్‌ల రూపంలో కూడా తీసుకుంటారు. రెగ్యూలర్‌గా ఉపయోగించేవి కాబట్టి వాటిని మార్కెట్లో నుండి ఎక్కువ మెుత్తంలో తెచ్చుకుని ఇంట్లో స్టోర్ చేసుకుని అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాం. అయితే కొద్ది రోజుల తర్వాత ఉల్లిపాయలు మొలకెత్తుతుంటాయి. మరీ ఇలాంటి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మంచిదా? మొలకెత్తిన వాటిని తినడం వల్ల ఆరోగ్యంపై ఏమైనా ప్రభావం చూపుతుందా? అసలు వీటిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం?
మొలకెత్తిన ఉల్లిపాయలను తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఒక సర్వేలో స్పష్టమైంది. విటమిన్ సి, ఫాస్పరస్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఫోలేట్, కాపర్ వంటి పోషకాలు మొలకెత్తిన ఉల్లిపాయల్లో పుష్కలంగా ఉంటాయి. అవి హీట్‌స్ట్రోక్‌ను నివారించడంలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో , కడుపు చికాకు సమస్యను తొలగించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మొలకెత్తిన ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం-
మొలకెత్తిన ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి
తాజా అధ్యయనం ప్రకారం , ఉల్లిపాయలు తినడం వల్ల వేసవిలో హీట్‌స్ట్రోక్‌ను తట్టుకోవడంలో సహాయపడుతుంది. మొలకెత్తిన ఉల్లిపాయలు తినడం రోగనిరోధక శక్తిని బలపడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది.
ఉదర సమస్యలను దూరం చేస్తాయి
ఉదర సంబంధిత సమస్యలను దూరం చేయడంలో మొలకెత్తిన ఉల్లిపాయలు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది పొట్టను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం వంటి అనేక ఉదర సంబంధిత వ్యాధుల నుండి బయటపడటంలో ప్రభావవంతంగా ఉంటుంది.
కడుపు మంటను తగ్గిస్తోంది
వేసవి కాలంలో, కడుపులో మంట సమస్య సాధరణంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మొలకెత్తిన ఉల్లిపాయలను తీసుకోవాలి. , ఉల్లిపాయలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ సజావుగా ఉంటుంది, దీని వల్ల కడుపులో మంట సమస్య ఉండదు.
మొలకెత్తి ఉల్లిపాయల కోసం ఏం చేయాలి
ఉల్లిపాయలు మొలకెత్తడానికి మనం ప్రత్యేకంగా చేయాల్సింది ఏమి లేదు. చాలా వరకు ఉల్లిపాయలు దానంతట అదే మొలకెత్తుతాయి. ప్రత్యేకంగా మొలకెత్తిన ఉల్లిపాయలు కావాలంటే వంటింట్లో ఉండే ఉల్లిపాయలను భూమిలో నాటి పది నుంచి పన్నెండు రోజుల తర్వాత అవే సులభంగా మొలకెత్తుతాయి. ఇప్పుడు వాటిని సాదరణంగా ఉపయోగించుకోవచ్చు.