తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spicy Tomato Pickle Recipe : టొమాటోలతో నిల్వ ఊరగాయ చేయడం చాలా సింపుల్

Spicy Tomato Pickle Recipe : టొమాటోలతో నిల్వ ఊరగాయ చేయడం చాలా సింపుల్

28 January 2023, 13:44 IST

google News
    • Spicy Tomato Pickle Recipe : ఇంట్లో టొమాటోలు ఎక్కువగా ఉన్నా.. లేదా తక్కువ ధరకే టొమాటోలు వచ్చినా.. మీరు వాటితో మంచి టొమాటో పికిల్ చేసుకోవచ్చు. నిల్వ ఉండే ఊరగాయ మీకు చేయడం రాకుంటే.. దానిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
టమాటోలతో నిల్వ ఊరగాయ
టమాటోలతో నిల్వ ఊరగాయ

టమాటోలతో నిల్వ ఊరగాయ

Spicy Tomato Pickle Recipe : పచ్చళ్లు అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. మీరు కూడా పచ్చడి ప్రియులైతే.. టొమాటోలతో అదిరిపోయే ఊరగాయను తయారు చేయవచ్చు. మీకు పచ్చడి తయారు చేయడం రాదు అని బాధపడకండి. దీనిని తయారు చేయడం చాలా సింపుల్. మరి దీనిని ఎలా తయారు చేయవచ్చో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* టమోటాలు - 1 కేజీ (పండినవి)

* పచ్చిమిర్చి - 2

* ఆవాలు - 1 టీస్పూన్

* జీలకర్ర - 1 టీస్పూన్

* మెంతులు - 1/2 టీస్పూన్

* కరివేపాకు - 5

* కారం - 2 టీస్పూన్లు

* ఇంగువ - 1/2 టీస్పూన్

* నువ్వులు నూనె - 2 టేబుల్ స్పూన్లు

* ఉప్పు - రుచికి తగినంత

తయారీ విధానం

ముందుగా టమోటాలు, పచ్చి మిరపకాయలను కోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాన్ తీసుకుని.. దానిని మీడియం మంట మీద వేడి చేయండి. అనంతరం దానిలో నూనె వేసి.. ఆవాలు వేయండి. అవి వేగినాక.. జీలకర్ర, మెంతులు, ఇంగువ, కరివేపాకు వేసి బాగా కలపండి. దానిలో తరిగిన టమోటాలను వేసి.. బాగా కలిపి.. మంటను తగ్గించి.. పాన్‌ను కవర్ చేయండి. దానిని 10-15 నిమిషాలు ఉడకనివ్వండి.

సుమారు 15 నిమిషాల తర్వాత.. టమాటో ప్యూరీ బబ్లింగ్ అవుతుంది. టొమాటోల నుంచి పచ్చి పోతుంది. దానిలో కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. దానిలోని నీరంతా ఆవిరైపోయే వరకు ఉడికించండి. దాని నుంచి నూనె బయటకు వస్తుంది. టొమాటో ఊరగాయ మందపాటి స్థిరత్వాన్ని పొందిన తర్వాత.. స్టవ్ ఆపేయండి. ఈ స్పైసీ టొమాటో పికిల్ రెసిపీని ఒక గాజు కూజాలోకి తీసి స్టోర్ చేసుకోండి. దీనిని ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. దీనిని మీరు ఇడ్లీ, దోశ లేదా వేడి వేడి అన్నంతో నెయ్యి కలిపి తీసుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం