తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Instant Mutton Curry Recipe : ఇన్​స్టంట్​గా మటన్​ కర్రీ చేయాలంటే.. రెసిపీ ఇదే..

Instant Mutton Curry Recipe : ఇన్​స్టంట్​గా మటన్​ కర్రీ చేయాలంటే.. రెసిపీ ఇదే..

27 January 2023, 14:14 IST

    • Instant Mutton Curry Recipe : మేము తెలంగాణ వాళ్లం.. మాకు మర్యాదతో పాటు మటన్​ కూడా కావాలి అని ఓ డైలాగ్ ఉంటుంది. మటన్ ప్రియులు ఎప్పుడూ ఆ కర్రీ పెట్టినా అస్సలు వద్దు అనకుండా తింటారు. మీ ఇంటి అతిధి అనుకోకుండా వస్తే.. వారికి మటన్ చేయాలనుకుంటే ఇన్​స్టంట్ మటన్ కర్రీ రెసిపీ ఇక్కడ ఉంది. 
మటన్​ కర్రీ
మటన్​ కర్రీ

మటన్​ కర్రీ

Instant Mutton Curry Recipe : మటన్ ఆరోగ్యానికి మంచిది అంటూ.. చాలా మంది తింటూనే ఉంటారు. ముఖ్యంగా తెలంగాణలో మటన్ లేనిదే ఏ ఫంక్షన్ ఉండదు. అయితే ఈ మటన్​ కర్రీ చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ దీనిని ఇన్​స్టంట్​గా తయారు చేసుకోవాలంటే.. ఓ సింపుల్ రెసిపీ ఉంది. ఈజీగా ఈ కర్రీని ఎలా తయారు చేయవచ్చో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* మటన్ - 300 గ్రాములు

* నూనె - 2 టేబుల్ స్పూన్లు

* ఉల్లిపాయ - 1/2 కప్పు

* అల్లం - 2 టీస్పూన్లు (సన్నగా తరిగినవి)

* వెల్లుల్లి - 2 టీస్పూన్లు

* టమాటో - 1/2 కప్పు (తరిగినది)

* నిమ్మరసం - 2 టీస్పూన్

* జీలకర్ర - 1 టీస్పూన్

* పెప్పర్ - కొంచెం

* పచ్చిమిర్చి - 1

* కారం పొడి - 1 స్పూన్

* ధనియాపొడి - 1 టీస్పూన్

* గరం మసాలా - 1 టీస్పూన్

* ఉప్పు - రుచికి తగినంత

తయారీ విధానం

మొదట పాత్రను వేడి చేసి.. అందులో నూనె వేయండి. మొత్తం మసాలా దినుసులు వేసి సుమారు 20 సెకన్ల పాటు వేయించండి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలను వేసి బాగా వేయించండి. తరిగిన టమోటాలు వేయండి. వాటిని ఉడికించండి. మటన్ ముక్కలను వేసి సుమారు 4-5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. దానిని బాగా కలిపి.. మరింత నీరు వేసి.. దానిని కుక్కర్ మూత పెట్టేయండి. కొన్ని విజిల్స్ తర్వాత ఆపేయండి. పూర్తయిన తర్వాత.. ప్రెజర్​ని బయటకి పంపి.. నిమ్మరసం వేసి బాగా కలపండి. అంతే ఇన్‌స్టంట్ మటన్ కర్రీ రెడీ. రోటీ, నాన్ లేదా స్టీమ్డ్ రైస్‌తో జత చేస్తే చాలా రుచిగా ఉంటుంది.

తదుపరి వ్యాసం