తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chocolate Mug Cake Recipe : కిడ్స్ స్పెషల్ చాక్లెట్ మగ్ కేక్.. 2 నిముషాల్లో చేసేయొచ్చు..

Chocolate Mug Cake Recipe : కిడ్స్ స్పెషల్ చాక్లెట్ మగ్ కేక్.. 2 నిముషాల్లో చేసేయొచ్చు..

27 January 2023, 6:00 IST

    • Chocolate Mug Cake Recipe : పిల్లలు ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్ తిననని మారం చేస్తున్నారా? అయితే చిటికెలోనే వారి మనసు మార్చే.. టేస్టీ రెసిపీ ఇక్కడొకటి ఉంది. అదే చాక్లెట్ మగ్​ కేక్. దీనిని తయారు చేయడం చాలా అంటే చాలా సులభం. కేక్ అంటే ఎక్కువ సమయం పడుతుంది అనుకుంటున్నారేమో.. నిముషాల్లో తయారు చేసేయవచ్చు.
చాక్లెట్ మగ్ కేక్
చాక్లెట్ మగ్ కేక్

చాక్లెట్ మగ్ కేక్

Chocolate Mug Cake Recipe : చాక్లెట్స్ అంటే పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టంగాతింటారు. పిల్లలకి టేస్టీగా ఏదైనా తినిపించాలి అన్నా.. లేదా మీకు తీపి తినాలనే కోరికలు కలిగినా.. మీరు ఈ సింపుల్ చాక్లెట్ మగ్​ కేక్ రెడీ చేసుకోవచ్చు. కేక్ అంటే సాధరణంగా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. పైగా దానిని ఎక్కువ మోతాదులో చేయడం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువగా తినేస్తాము. అది కంట్రోల్​లో ఉండాలంటే మీకు చాక్లెట్ మగ్ కేక్ పర్​ఫెక్ట్. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

కావాల్సిన పదార్థాలు

* ఎగ్ - 1

* నూనె - 3 టేబుల్ స్పూన్స్

* పాలు - 3 టేబుల్ స్పూన్స్

* మైదాపిండి - 4 టేబుల్ స్పూన్స్

* పంచదార - 4 టేబుల్ స్పూన్స్

* బేకింగ్ పౌడర్ - 1/2 స్పూన్

* కోకో పౌడర్ - 1.5 టేబుల్ స్పూన్లు

* ఉప్పు - చిటికెడు

* వెనిలా ఎసెన్స్ - కొన్ని చుక్కలు

తయారీ విధానం..

మైక్రోవేవ్‌లో కేక్ పొంగిపోకుండా ఉండేందుకు.. మీరు అతి పెద్ద కప్పును తీసుకోండి. దానిలో గుడ్డు పగలగొట్టి వేయండి. దానిలో నూనె, పాలు, పిండి వేసి.. మృదువైనంత వరకు బాగా కలపండి. చక్కెర పొడి, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్, ఉప్పు, కొన్ని చుక్కల వెనీలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేయండి. ఉండలు లేకుండా.. క్రీమ్ మాదిరిగా అయ్యేంత వరకు కలపండి. ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్ మధ్యలో మీ మగ్ ఉంచండి. దానిని మరియు 1-2 నిమిషాలు ఉడికించాలి. అయితే వివిధ మైక్రోవేవ్‌లలో ఒక్కో సమయం పడుతుంది. అయితే మెత్తని, పొంగే చాక్లెట్ మగ్ కేక్ 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. అది కుక్ అయ్యిందని నిర్ధారించాక.. బయటకు తీసేయండి. చల్లారాక సేవించేయండి.

తదుపరి వ్యాసం