తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chilli Baby Corn Recipe : స్టార్టర్​గా చిల్లీ బేబీ కార్న్ రెసిపీ.. రెడీ చేయడం చాలా ఈజీ

Chilli Baby Corn Recipe : స్టార్టర్​గా చిల్లీ బేబీ కార్న్ రెసిపీ.. రెడీ చేయడం చాలా ఈజీ

26 January 2023, 12:54 IST

    • Chilli Baby Corn Recipe : మీరు లంచ్ లేదా డిన్నర్​తో పాటు స్నాక్​గా, స్టార్టర్​గా ఏమైనా తినాలనుకుంటే.. మీరు కచ్చితంగా చిల్లీ బేబీ కార్న్ ట్రై చేయాల్సిందే. దీనిని ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
చిల్లీ బేబీ కార్న్ రెసిపీ
చిల్లీ బేబీ కార్న్ రెసిపీ

చిల్లీ బేబీ కార్న్ రెసిపీ

Chilli Baby Corn Recipe : మీరు బేబీ కార్న్​ను ఇష్టపడేవారు అయితే.. ఈ చిల్లీ బేబీ కార్న్ రెసిపీని కచ్చితంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. బయట తినడం, డబ్బులు ఎక్కువ అవుతాయని ఆలోచించే వారు హ్యాపీగా ఇంట్లోనే వీటిని తయారు చేసుకోవచ్చు. దీనిని వండటం అంటే కష్టం అనుకుంటున్నారేమో.. చాలా ఈజీగా దీనిని తయారు చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా వండాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* కార్న్ ఫ్లోర్ - 4 టేబుల్ స్పూన్ల పిండి

* ఉప్పు - తగినంత

* నీళ్లు - తగినంత

* బేబికార్న్ - 20

* ఆయిల్ - వేయించడానికి తగినంత

సాస్ కోసం..

* ఆయిల్ - 1 టేబుల్ స్పూన్

* స్ప్రింగ్ ఆనియన్ - 1/2 కప్పు

* గార్లిక్ - 2 టేబుల్ స్పూన్లు (చిన్నగా కట్ చేసుకోవాలి)

* అల్లం - 2 టేబుల్ స్పూన్లు (చిన్నగా కట్ చేసుకోవాలి)

* పచ్చిమిర్చి - 2,3

* క్యాప్సికమ్ - ⅓ కప్పు

* సోయా సాస్ - ½ కప్పు

* చిల్లీ సాస్ - 1 టీ స్పూన్

* పెప్పర్ - ¼ టీ స్పూన్

* పంచదార - 1 టీస్పూన్

* ఉప్పు - తగినంత

చిల్లీ బేబీ కార్న్ తయారీవిధానం

ముందుగా బేబీ కార్న్‌ను కడిగి నీటిని ఆరబెట్టండి. బేబీ కార్న్ పరిమాణం పెద్దగా ఉంటే వాటిని సగానికి ముక్కలుగా కోయండి. చిన్నవిగా ఉంటే వాటిని అలానే ఉంచండి. స్ప్రింగ్ ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం, క్యాప్సికమ్‌లను సిద్ధం చేసి పక్కన పెట్టండి. కార్న్ ఫ్లోర్ పిండిలో ఉప్పు, పెప్పర్ వేసి మందపాటి పిండిని తయారు చేయండి.

ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్‌లో నూనెను వేడి చేయండి. ప్రతి బేబీ కార్న్ ముక్కను పిండిలో ముంచి.. దానిని బాగా కోట్ చేయండి. వేడి నూనెలో పిండి పూసిన బేబీ కార్న్ ముక్కలను వేసి.. క్రిస్పీగా, లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. వీటిని టిష్యూలపై వేసి ఆయిల్ పీల్చేలా చూడండి.

మరొక పాన్ తీసుకుని నూనె వేసి వేడి చేయండి. దానిలో తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, పచ్చి మిరపకాయ ముక్కలను వేసి వేయించండి. 2 నిమిషాలు మీడియం మంట మీద వేయించండి. ఇప్పుడు దానిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలపండి. క్యాప్సికమ్ సగం ఉడికినంత వరకు మీడియం మంట మీద 3 నుంచి 4 నిమిషాలు వేయించాలి. ఎందుకంటే ఇవి కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మంటను తగ్గించి.. దానిలో సోయా సాస్, స్వీట్ గ్రీన్ చిల్లీ సాస్ లేదా స్వీట్ రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా కలపాలి. దానిలో పెప్పర్, ఉప్పు, పంచదార వేసి బాగా కలపండి.

చిల్లీ బేబీ కార్న్ కోసం..

వేయించిన బేబీ కార్న్ ఈ మిశ్రమంలో వేసి బాగా కలపండి. మీరు క్రిస్పీ, క్రంచీ బేబీ కార్న్ టెక్స్‌చర్‌ను ఇష్టపడితే మీరు ఇక్కడే దానిని ఆపేయవచ్చు. బేబీ కార్న్‌ను కొన్ని స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ లేదా తరిగిన సెలెరీతో అలంకరించవచ్చు. మీరు చిల్లీ బేబీ కార్న్‌ను స్టార్టర్ స్నాక్‌గా లేదా బ్రెడ్‌తో లేదా సైడ్‌గా తీసుకోవచ్చు.

తదుపరి వ్యాసం