Weight loss Tips : రోజుకి మూడుసార్లు మంచిదా? ఆరుసార్లా?
26 July 2022, 14:44 IST
- Weight loss Tips : మీరు బరువు తగ్గించే ప్రక్రియలో ఉన్నప్పుడు సరైన డైట్ మెయింటైన్ చేయాల్సి ఉంది. ఒక్కోసారి మీరు తక్కువగా ఆహారం ఎక్కువసార్లు తీసుకోవాల్సి ఉంది. లేదా రోజుకు మూడుసార్లు సరైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ రెండిటిలో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
తినే ఆహారంపై శ్రద్ధ అవసరం
Weight loss Tips : బరువు తగ్గాలని చాలామందికి ఉంటుంది. వాటికోసం రకరకాల డైట్లను ఫాలో అవుతారు. అయితే ఈ ప్రయాణంలో మీరు తినే ఆహారం చాలా ముఖ్యం. అంతేకాకుండా మీరు రోజుకు ఎన్నిసార్లు తింటున్నారో తెలుసుకోవడం కూడా ముఖ్యం. చాలా మంది ప్రజలు బరువు తగ్గడానికి మూడు విశాలమైన భోజనాలకు బదులుగా.. తరచుగా తక్కువ తక్కువ మోతాదులో తింటారు. అయితే ఈ రెండిటిలో ఏది ప్రయోజనాలు చేకూరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
తక్కువగా.. ఎక్కువసార్లు..
చిన్న, తరచుగా చేసే భోజనాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మీ ఆకలిని తీర్చి, మీ శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడానికి, మీ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా అవి మీ జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి.
తరచుగా తినడం వల్ల మీ తదుపరి భోజనం సమయంలో అతిగా తినకుండా ఉండేలా నిరోధిస్తుంది. ఇది శరీర కొవ్వు నిల్వను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తూ.. కండర ద్రవ్యరాశిని పెంచుతుంది.
బరువు తగ్గడానికి ఈ పథకం పనిచేస్తుందా?
చిన్న, తరచుగా భోజనం తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన, వేగవంతమైన మార్గంలో బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. మూడు గంటల గ్యాప్‌తో రోజుకు ఐదు-ఆరు సార్లు తక్కువ మొత్తంలో మీ ఆకలిని కంట్రోల్ చేసుకోవచ్చు. పోషకాహార నిపుణుల ప్రకారం ఇలా చేసే చిన్న భోజనాలు.. అజీర్ణం, వాంతులు లేదా వికారంతో బాధపడుతున్న వ్యక్తులకు ప్రయోజనం చేకూరుస్తుందని వెల్లడించారు. అయితే మీరు తప్పనిసరిగా క్యాలరీల అవసరాన్ని భోజనంలో విభజించి.. పోషకమైన ఆహారాన్నే తీసుకోవాలి. అప్పుడే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
మరి మూడు పెద్ద భోజనం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి?
పనిలో ఉండే వ్యక్తులు లేదా ఆకలిని తట్టుకోలేని వ్యక్తుల ఇలాంటి చిన్న, తరచుగా చేసే భోజన ప్రణాళికలను అనుసరించడం కష్టం. ఆఫీసులో ఉన్నప్పుడు ఇలాంటివి కుదరవు కాబట్టి.. ఒకేసారి ఎక్కువగా తినాల్సి వస్తుంది. అయితే రోజూ మూడు పూటలా భోజనం చేయడం వల్ల.. మీరు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి తగినంత సమయం లభిస్తుంది. అయితే ప్రాసెస్ చేసిన స్నాక్స్‌ను తగ్గించండి. ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోండి.
చిన్న, తరచుగా చేసే భోజనం చాలా ప్రజాదరణ పొందింది. వీటిని పలువురు ప్రముఖులు సైతం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇవి నిర్దిష్ట వ్యక్తులకు పని చేయకపోవచ్చు. అలాంటివారు రోజుకు మూడు భోజనాలు అంటే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు, పోషకాల శోషణకు తోడ్పడతాయి. అంతేకాకుండా తక్కువ కేలరీలతో.. ఎక్కువ కాలం సంతృప్తి చెందుతారు. ఇది శ్రద్ధగల ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది.
మీరు ఏది ఎంచుకోవాలి?
మీరు మంచి ఆహారం తీసుకోవాలని, మీ కేలరీలపై దృష్టి పెడితే ఈ రెండు ప్రణాళికలు మంచిగా పనిచేస్తాయి. భోజనం చేసేటప్పుడు టెలివిజన్ లేదా మీ స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పెట్టేయండి. ఎలాంటి డైట్ మెయింటైన్ చేసినప్పటికీ.. జంక్ ఫుడ్‌ను నివారించండి. మీ ఆహారంలో తక్కువ కొవ్వు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోండి.